بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْحَكِيمِ1
అలిఫ్ లామ్ రా. ఈ ఆయతులు వివేకంతోనూ విజ్ఞానంతోనూ నిండివున్న గ్రంథంలోనివి.
Syed Abul Aala Maudoodi
أَكَانَ لِلنَّاسِ عَجَبًا أَنْ أَوْحَيْنَا إِلَىٰ رَجُلٍ مِّنْهُمْ أَنْ أَنذِرِ النَّاسَ وَبَشِّرِ الَّذِينَ آمَنُوا أَنَّ لَهُمْ قَدَمَ صِدْقٍ عِندَ رَبِّهِمْ ۗ قَالَ الْكَافِرُونَ إِنَّ هَـٰذَا لَسَاحِرٌ مُّبِينٌ2
(ఏమరుపాటులో పడివున్న) ప్రజలను హెచ్చరించు అనీ, విశ్వసించిన వారికి తమ ప్రభువువద్ద నిజమైన గౌరవమూ సాఫల్యమూ ఉన్నాయనే శుభవార్త తెలుపు అనీ మేము స్వయంగా వారిలోని ఒక మనిషిపైకి వహీని పంపించటం ప్రజలకు చోద్యమైన విషయంగా కన్పిస్తోందా? (దానికి) తిరస్కారులు ‘‘ఈ మనిషి పచ్చి మాంత్రికుడు’’ అని అన్నారు.
Syed Abul Aala Maudoodi
إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ يُدَبِّرُ الْأَمْرَ ۖ مَا مِن شَفِيعٍ إِلَّا مِن بَعْدِ إِذْنِهِ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ أَفَلَا تَذَكَّرُونَ3
యథార్థం ఏమిటంటే ఆకాశాలనూ, భూమినీ ఆరు రోజులలో సృష్టించి, తరువాత రాజ్యపీఠాన్ని అలంకరించి సృష్టివ్యవహారాలను నడుపుతూవున్న దేవుడే మీ ప్రభువు. ఆయన అనుమతి ఇస్తే తప్ప ఎవడూ సిఫారసు చేయలేడు. ఈ అల్లాహ్ యే మీ ప్రభువు. కనుక మీరు ఆయననే ఆరాధించండి. మీరు ఇక స్పృహలోకి రారా?
Syed Abul Aala Maudoodi
إِلَيْهِ مَرْجِعُكُمْ جَمِيعًا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ إِنَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ بِالْقِسْطِ ۚ وَالَّذِينَ كَفَرُوا لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ4
ఆయన వైపునకే మీరంతా మరలిపోవలసి ఉన్నది. ఇది అల్లాహ్ యొక్క తిరుగులేని వాగ్దానం. నిస్సందేహంగా సృష్టిని ఆయనే ప్రారంభిస్తాడు. తరువాత రెండోసారి మళ్ళీ ఆయనే సృష్టిస్తాడు. విశ్వసించి మంచి పనులు చేసిన వారికి ప్రతిఫలం న్యాయంగా ఇవ్వటానికి - అవిశ్వాసవైఖరిని అవలంబించిన వారు సల సల కాగే నీరు త్రాగటానికి, వ్యధాభరితమైన శిక్షను అనుభవించటానికి, వారు ఒడిగట్టిన సత్యతిరస్కారానికి ఫలితంగా.
Syed Abul Aala Maudoodi
هُوَ الَّذِي جَعَلَ الشَّمْسَ ضِيَاءً وَالْقَمَرَ نُورًا وَقَدَّرَهُ مَنَازِلَ لِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ ۚ مَا خَلَقَ اللَّهُ ذَٰلِكَ إِلَّا بِالْحَقِّ ۚ يُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ5
సూర్యుణ్ణి కాంతిమంతునిగా చేసినవాడు ఆయనే. చంద్రుడికి వెలుగును ఇచ్చినవాడూ ఆయనే. చంద్రుని తరిగే పెరిగే దశలను కచ్చితంగా నిర్ణయించినవాడూ ఆయనే. తద్వారా మీరు సంవత్సరాల, తేదీల లెక్కను తెలుసుకోవాలని. అల్లాహ్ ఇదంతా సత్యబద్ధంగానే పుట్టించాడు. జ్ఞానం కల ప్రజలకు ఆయన తన సూచనలను తేటతెల్లంగా తెలియజేస్తున్నాడు.
Syed Abul Aala Maudoodi
إِنَّ فِي اخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا خَلَقَ اللَّهُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَّقُونَ6
నిశ్చయంగా రేయింబవళ్ళ నిరంతర పరిభ్రమణంలో భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన ప్రతి వస్తువులో (తప్పుడు దృష్టికోణం నుండి తప్పుడు ప్రవర్తన నుండి) తప్పించుకోగోరే వారికొరకు సూచనలు ఉన్నాయి.
Syed Abul Aala Maudoodi
إِنَّ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا وَرَضُوا بِالْحَيَاةِ الدُّنْيَا وَاطْمَأَنُّوا بِهَا وَالَّذِينَ هُمْ عَنْ آيَاتِنَا غَافِلُونَ7
యథార్థం ఏమిటంటే మమ్మల్ని కలుసుకోవాలని ఆశించనివారూ ప్రాపంచిక జీవితమునే వరించి దానితోనే తృప్తి చెందినవారూ మా సూచనల పట్ల నిర్లక్ష్య భావం కలిగివున్నవారూ
Syed Abul Aala Maudoodi
أُولَـٰئِكَ مَأْوَاهُمُ النَّارُ بِمَا كَانُوا يَكْسِبُونَ8
అటువంటి వారి అంతిమ నివాస స్థలం నరకమే అవుతుంది. వారు (తమ ఈ తప్పుడు విశ్వాసం, తప్పుడు ప్రవర్తనలు కారణంగా) చేస్తూ వచ్చిన చెడులకు ఫలితంగా.
Syed Abul Aala Maudoodi
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ يَهْدِيهِمْ رَبُّهُم بِإِيمَانِهِمْ ۖ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ فِي جَنَّاتِ النَّعِيمِ9
యథార్థమే. విశ్వసించి (అంటే ఈ గ్రంథంలో తెలుపబడిన సత్యాలను స్వీకరించి), మంచి పనులు చేస్తూ ఉండినవారిని వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా సరిjైున మార్గంపై నడుపుతాడు. భోగభాగ్యాలతో నిండివున్న స్వర్గవనాలలో వారి క్రింద కాలువలు ప్రవహిస్తాయి.
Syed Abul Aala Maudoodi
دَعْوَاهُمْ فِيهَا سُبْحَانَكَ اللَّهُمَّ وَتَحِيَّتُهُمْ فِيهَا سَلَامٌ ۚ وَآخِرُ دَعْوَاهُمْ أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ10
అక్కడ వారు దైవమా! నీవు పవిత్రుడవు అని స్తుతిస్తారు, శాంతికలుగుగాక అని ప్రార్థిస్తారు. వారి ప్రతి మాటకు ముగింపు ఇలా ఉంటుంది : స్తోత్రమంతా సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే.
Syed Abul Aala Maudoodi