بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అత్-తకాసుర్

أَلْهَاكُمُ التَّكَاثُرُ1

వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది.

Syed Abul Aala Maudoodi

అత్-తకాసుర్

حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ2

చివరకు మీరు (ఈ వ్యామోహం లోనే) శ్మశానికి చేరుకుంటారు.

Syed Abul Aala Maudoodi

అత్-తకాసుర్

كَلَّا سَوْفَ تَعْلَمُونَ3

(మీరనుకునేది) ఎంతమాత్రం కాదు, త్వరలోనే మీకు తెలిసిపోతుంది.

Syed Abul Aala Maudoodi

అత్-తకాసుర్

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ4

మరొకసారి (వినండి, మీరనుకునేది) ఎంతమాత్రం నిజం కాదు, అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది.

Syed Abul Aala Maudoodi

అత్-తకాసుర్

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ5

ఎంతమాత్రం కాదు, మీరు గనక నిశ్చయజ్ఞానంతో (మీ ఈ వైఖరి పర్యవసానాన్ని) తెలుసుకుంటే, (మీ నడవడిక ఇలా ఉండదు).

Syed Abul Aala Maudoodi

అత్-తకాసుర్

لَتَرَوُنَّ الْجَحِيمَ6

మీరు నరకాన్ని చూసితీరుతారు.

Syed Abul Aala Maudoodi

అత్-తకాసుర్

ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ7

మరొకసారి (వినండి) మీరు పూర్తి నమ్మకంతో దాన్ని చూస్తారు.

Syed Abul Aala Maudoodi

అత్-తకాసుర్

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ8

తరువాత ఆ రోజున మీరు తప్పనిసరిగా ఈ సౌఖ్యాలను గురించి ప్రశ్నించబడతారు.

Syed Abul Aala Maudoodi