بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
الر ۚ كِتَابٌ أُحْكِمَتْ آيَاتُهُ ثُمَّ فُصِّلَتْ مِن لَّدُنْ حَكِيمٍ خَبِيرٍ1
అలిఫ్ లామ్ రా. ఇది ఒక ఫర్మానా. ఇందులోని ఆయతులు నిర్దుష్టమైనవీ, సవివరంగా చెప్ప బడినవీ - వివేకవంతుడూ అన్నీ ఎరిగినవాడూ అయిన వాని తరఫు నుండి.
Syed Abul Aala Maudoodi
أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۚ إِنَّنِي لَكُم مِّنْهُ نَذِيرٌ وَبَشِيرٌ2
(ఆ ఫర్మానా ఏమిటంటే) నీవు అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకు - నేను ఆయన తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాణ్ణి శుభవార్తలు అందజేసేవాణ్ణి కూడా.
Syed Abul Aala Maudoodi
وَأَنِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُمَتِّعْكُم مَّتَاعًا حَسَنًا إِلَىٰ أَجَلٍ مُّسَمًّى وَيُؤْتِ كُلَّ ذِي فَضْلٍ فَضْلَهُ ۖ وَإِن تَوَلَّوْا فَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ كَبِيرٍ3
ఇంకా మీరు మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు మరలిరండి. అప్పుడు ఆయన ఒక నిర్ణీత కాలం వరకూ మీకు మంచి జీవిత సామగ్రిని అనుగ్రహిస్తాడు. అనుగ్రహాలకు అర్హుడైన ప్రతివానికీ ఆయన తన అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. కాని మీరు గనక విముఖులైతే, ఒక అతి భయంకరమైన దినంనాటి యాతనకు మీరు గురి అవుతారేమో అని నేను భయపడుతున్నాను.
Syed Abul Aala Maudoodi
إِلَى اللَّهِ مَرْجِعُكُمْ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ4
మీరందరూ అల్లాహ్ వైపునకే మరలవలసివున్నది. ఆయన సర్వమూ చెయ్యగల సమర్థుడు.
Syed Abul Aala Maudoodi
أَلَا إِنَّهُمْ يَثْنُونَ صُدُورَهُمْ لِيَسْتَخْفُوا مِنْهُ ۚ أَلَا حِينَ يَسْتَغْشُونَ ثِيَابَهُمْ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ5
చూడండి వారు తమ వక్షములను తిప్పుకుంటారు, అతని నుండి దాక్కుందామని. జాగ్రత్త! వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పటికీ, అల్లాహ్ వారి గుప్త విషయాలనూ ఎరుగును, వారి బహిరంగ విషయాలనూ ఎరుగును. ఆయన హృదయాలలో ఉన్న రహస్యాలను కూడా ఎరుగును.
Syed Abul Aala Maudoodi
۞ وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ إِلَّا عَلَى اللَّهِ رِزْقُهَا وَيَعْلَمُ مُسْتَقَرَّهَا وَمُسْتَوْدَعَهَا ۚ كُلٌّ فِي كِتَابٍ مُّبِينٍ6
ధరణిపై సంచరించే ఏ ప్రాణి ఉపాధి అయినా అల్లాహ్ బాధ్యతలో లేకుండా లేదు. ఆ ప్రాణి ఎక్కడ నివసిస్తుందో అది ఎక్కడకు చేర్చబడనున్నదో ఆయనకు తెలియకుండా లేవు. సమస్తమూ ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది.
Syed Abul Aala Maudoodi
وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ وَكَانَ عَرْشُهُ عَلَى الْمَاءِ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۗ وَلَئِن قُلْتَ إِنَّكُم مَّبْعُوثُونَ مِن بَعْدِ الْمَوْتِ لَيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ7
ఆకాశాలనూ, భూమినీ ఆరు దినాలలో సృష్టించినవాడు ఆయనే - దానికి పూర్వం ఆయన సింహాసనం నీళ్ళపై ఉండేది - మీలో ఎవడు మంచిపనులు చేస్తాడో మిమ్మల్ని పరీక్షించి చూద్దామని. ప్రవక్తా! ఇప్పుడు నీవు గనక వారితో ‘‘ప్రజలారా! మరణించిన తరువాత మీరు మళ్ళీ లేపబడతారు’’ అని అంటే అవిశ్వాసులు తక్షణం ఇలా అంటారు : ‘‘ఇది స్పష్టమైన ఇంద్రజాలం’’.
Syed Abul Aala Maudoodi
وَلَئِنْ أَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ إِلَىٰ أُمَّةٍ مَّعْدُودَةٍ لَّيَقُولُنَّ مَا يَحْبِسُهُ ۗ أَلَا يَوْمَ يَأْتِيهِمْ لَيْسَ مَصْرُوفًا عَنْهُمْ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ8
ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత వ్యవధి వరకు వాయిదా వేస్తే వారు, అసలు దానిని ఏ వస్తువు పట్టి ఆపుతోంది? అని అనటం ప్రారంభిస్తారు. వినండి, ఆ శిక్షా సమయం వచ్చే రోజున దానిని ఎవరూ మరలించలేరు. వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే వారిని చుట్టుముట్టుతుంది.
Syed Abul Aala Maudoodi
وَلَئِنْ أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَاهَا مِنْهُ إِنَّهُ لَيَئُوسٌ كَفُورٌ9
ఒకవేళ మేము ఎప్పుడైనా మానవునికి మా కారుణ్యాన్ని ప్రసాదించి, తరువాత అది అతనికి లేకుండా చేస్తే అతడు నిరాశ చెందుతాడు. కృతఘ్నత చూపుతాడు.
Syed Abul Aala Maudoodi
وَلَئِنْ أَذَقْنَاهُ نَعْمَاءَ بَعْدَ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ السَّيِّئَاتُ عَنِّي ۚ إِنَّهُ لَفَرِحٌ فَخُورٌ10
అతనిపై పడిన ఆపద (తొలగిన) తరువాత, ఒకవేళ మేము అతనికి అనుగ్రహాన్ని రుచి చూపిస్తే, ‘‘కష్టాలన్నీ తొలగి పోయాయి’’ అని అంటాడు. అతడు తరువాత ఉబ్బితబ్బిబ్బౌతాడు, విర్రవీగుతాడు.
Syed Abul Aala Maudoodi