بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ1
అలిఫ్ లామ్ రా. ఇవి తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ప్రకటించే గ్రంథంలోని ఆయతులు.
Syed Abul Aala Maudoodi
إِنَّا أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ2
మేము దానిని ఖురానుగా చేసి అరబ్బీ భాషలో అవతరింపజేశాము, మీరు (అరేబియా వాసులు) దానిని చక్కగా అర్థం చేసుకోగలందులకు.
Syed Abul Aala Maudoodi
نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِمَا أَوْحَيْنَا إِلَيْكَ هَـٰذَا الْقُرْآنَ وَإِن كُنتَ مِن قَبْلِهِ لَمِنَ الْغَافِلِينَ3
ప్రవక్తా! మేము ఈ ఖురానును వహీద్వారా నీ వద్దకు పంపి అత్యుత్తమమైనరీతిలో సంఘటనలనూ యథార్థాలనూ నీకు వివరిస్తున్నాము. ఇంతకుముందు (ఈ విషయాలు) నీకు ఎంతమాత్రం తెలియవు
Syed Abul Aala Maudoodi
إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَا أَبَتِ إِنِّي رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًا وَالشَّمْسَ وَالْقَمَرَ رَأَيْتُهُمْ لِي سَاجِدِينَ4
ఇది యూసుఫ్ తన తండ్రితో ఇలా అన్నప్పటి ప్రస్తావన : ‘‘తండ్రీ! నేను ఒక కలగన్నాను అందులో పదకొండు నక్షత్రాలనూ, సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ చూశాను. అవి నాముందు సాష్టాంగపడ్డాయి.’’
Syed Abul Aala Maudoodi
قَالَ يَا بُنَيَّ لَا تَقْصُصْ رُؤْيَاكَ عَلَىٰ إِخْوَتِكَ فَيَكِيدُوا لَكَ كَيْدًا ۖ إِنَّ الشَّيْطَانَ لِلْإِنسَانِ عَدُوٌّ مُّبِينٌ5
సమాధానంగా అతని తండ్రి ఇలా అన్నాడు: ‘‘కుమారా! నీ స్వప్నాన్ని గురించి నీ సోదరులకు చెప్పకు. ఎందుకంటే వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు. వాస్తవం ఏమిటంటే షైతాను మనిషికి బహిరంగ శత్రువు.
Syed Abul Aala Maudoodi
وَكَذَٰلِكَ يَجْتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِن تَأْوِيلِ الْأَحَادِيثِ وَيُتِمُّ نِعْمَتَهُ عَلَيْكَ وَعَلَىٰ آلِ يَعْقُوبَ كَمَا أَتَمَّهَا عَلَىٰ أَبَوَيْكَ مِن قَبْلُ إِبْرَاهِيمَ وَإِسْحَاقَ ۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٌ6
ఆ విధంగానే జరుగుతుంది (నీవు కలలో చూసిన విధంగా). నీ ప్రభువు నిన్ను (తన పనికొరకు) ఎన్నుకుంటాడు. నీకు విషయాల లోతును అందుకోవటం నేర్పుతాడు. నీకూ యాఖూబ్ సంతతికీ తన అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు, ఇంతకు పూర్వం ఆయన నీ పెద్దలైన ఇబ్రాహీముకూ, ఇస్‌హాఖుకూ పూర్తిగా ప్రసాదించినట్లు. నిశ్చయంగా నీ ప్రభువు సర్వజ్ఞుడు, మహావివేకి.
Syed Abul Aala Maudoodi
۞ لَّقَدْ كَانَ فِي يُوسُفَ وَإِخْوَتِهِ آيَاتٌ لِّلسَّائِلِينَ7
యథార్థానికి యూసుఫ్ అతని సోదరుల గాథలో ఈ అడిగే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి.
Syed Abul Aala Maudoodi
إِذْ قَالُوا لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَىٰ أَبِينَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ إِنَّ أَبَانَا لَفِي ضَلَالٍ مُّبِينٍ8
ఈ గాథ ఇలా ప్రారంభమవుతుంది. అతని సోదరులు పరస్పరం ఇలా చెప్పుకున్నారు : ‘‘వాస్తవానికి మనదొక పెద్ద బలగమైనప్పటికీ యూసుఫ్, అతని సొంత సోదరుడూ ఇద్దరూ అంటే మన తండ్రికి, మన అందరికంటే ఎక్కువ ఇష్టం. నిజంగానే మన తండ్రికి పూర్తిగా మతి భ్రమించింది.
Syed Abul Aala Maudoodi
اقْتُلُوا يُوسُفَ أَوِ اطْرَحُوهُ أَرْضًا يَخْلُ لَكُمْ وَجْهُ أَبِيكُمْ وَتَكُونُوا مِن بَعْدِهِ قَوْمًا صَالِحِينَ9
కనుక పదండి, యూసుఫ్‌ను చంపెయ్యండి లేదా అతణ్ణి ఎక్కడైనా పారవెయ్యండి, మీ తండ్రి ధ్యాస కేవలం మీపైనే ఉండేందుకు. ఈ పనిచేసిన తరువాత తిరిగి సజ్జనులుగా ఉండాలి.’’
Syed Abul Aala Maudoodi
قَالَ قَائِلٌ مِّنْهُمْ لَا تَقْتُلُوا يُوسُفَ وَأَلْقُوهُ فِي غَيَابَتِ الْجُبِّ يَلْتَقِطْهُ بَعْضُ السَّيَّارَةِ إِن كُنتُمْ فَاعِلِينَ10
అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడు: ‘‘యూసుఫ్‌ను చంపకండి. ఒకవేళ అతన్ని ఏదైనా చెయ్యాలనే అను కుంటే, అతన్ని ఒక చీకటి బావిలో పడవెయ్యండి. వచ్చే పోయే బాటసారుల బృందమేదైనా అతన్ని తీసుకుపోతుంది.’’
Syed Abul Aala Maudoodi