بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అర్-రాద్

المر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ ۗ وَالَّذِي أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ الْحَقُّ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ1

అలిఫ్‌ లామ్‌ మీమ్‌ రా. ఇవి అల్లాహ్ గ్రంథంలోని ఆయతులు. నీ ప్రభువు తరఫునుండి నీపై అవతరింపచేయబడినదంతా పూర్తిగా సత్యం. కాని (మీ జాతికి చెందిన) చాలామంది విశ్వసించటం లేదు.

Syed Abul Aala Maudoodi

అర్-రాద్

اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ يُدَبِّرُ الْأَمْرَ يُفَصِّلُ الْآيَاتِ لَعَلَّكُم بِلِقَاءِ رَبِّكُمْ تُوقِنُونَ2

మీకు కనిపించే ఆధారాలు లేకుండా ఆకాశాలను నిలిపిన వాడు అల్లాహ్ యే. తరువాత ఆయన తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. ఆయన సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ ఒక నియమానికి బద్ధులుగా చేశాడు. ఈ సమస్త వ్యవస్థకు చెందిన ప్రతి వస్తువూ ఒక నిర్ణీతకాలం వరకు పయనిస్తోంది. అల్లాహ్ యే ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నాడు. ఆయన తన సూచనలను స్పష్టంగా వివరిస్తున్నాడు, బహుశా మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్ముతారేమో అని.

Syed Abul Aala Maudoodi

అర్-రాద్

وَهُوَ الَّذِي مَدَّ الْأَرْضَ وَجَعَلَ فِيهَا رَوَاسِيَ وَأَنْهَارًا ۖ وَمِن كُلِّ الثَّمَرَاتِ جَعَلَ فِيهَا زَوْجَيْنِ اثْنَيْنِ ۖ يُغْشِي اللَّيْلَ النَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ3

ఆయనే ఈ భూమిని విశాలంగా పరచినవాడు అందులో పర్వతాలను గుంజలవలె పాతిపెట్టినవాడు, నదులను ప్రవహింపజేసినవాడు, ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండిరచినవాడు, ఆయనే పగలుపై రాత్రిని కప్పేవాడు, ఈ అన్ని విషయాలలోనూ ఆలోచించే వారికొరకు పెద్ద సూచనలు ఉన్నాయి.

Syed Abul Aala Maudoodi

అర్-రాద్

وَفِي الْأَرْضِ قِطَعٌ مُّتَجَاوِرَاتٌ وَجَنَّاتٌ مِّنْ أَعْنَابٍ وَزَرْعٌ وَنَخِيلٌ صِنْوَانٌ وَغَيْرُ صِنْوَانٍ يُسْقَىٰ بِمَاءٍ وَاحِدٍ وَنُفَضِّلُ بَعْضَهَا عَلَىٰ بَعْضٍ فِي الْأُكُلِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ4

చూడండి! భూమిలో వేర్వేరు ప్రదేశాలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి ప్రక్కప్రక్కన ఉన్నాయి. ద్రాక్ష తోటలూ ఉన్నాయి, పంటపొలాలూ ఉన్నాయి, ఖర్జూరపు చెట్లూ ఉన్నాయి - వాటిలో కొన్ని ఒక్కొక్కటిగానూ మరికొన్ని జంటలుగానూ ఉన్నాయి - వాటన్నింటికీ ఒకే నీరు పారుతోంది. కానీ మేము కొన్నింటిని ఎక్కువ రుచికరమైనవిగా చేశాము. మరికొన్నింటిని తక్కువ రుచికరమైనవిగా చేశాము. ఈ అన్ని విషయాలలోనూ బుద్ధిని ఉపయోగించే వారికి చాలా సూచనలు ఉన్నాయి.

Syed Abul Aala Maudoodi

అర్-రాద్

۞ وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۗ أُولَـٰئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ وَأُولَـٰئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ ۖ وَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ5

ఒకవేళ మీరు ఇప్పుడు ఆశ్చర్యపడవలసివుంటే, ఆశ్చర్యపడదగిన విషయం ప్రజలయొక్క ఈ మాట : ‘‘మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు మళ్ళీ మేము సరికొత్తగా పుట్టించబడతామా?’’ వారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. వారి మెడలలోనే కంఠపట్టికలు ఉండేది. వారు నరకవాసులు. నరకంలో కలకాలం ఉంటారు.

Syed Abul Aala Maudoodi

అర్-రాద్

وَيَسْتَعْجِلُونَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِن قَبْلِهِمُ الْمَثُلَاتُ ۗ وَإِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلَىٰ ظُلْمِهِمْ ۖ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ6

వారు మేలుకు ముందు కీడుకొరకు తొందర పెడుతున్నారు. వాస్తవానికి వారికి పూర్వం (ఈ వైఖరినే అవలంబించిన వారిపై దేవుని శిక్ష పడిన) గుణపాఠాన్ని నేర్పే దృష్టాంతాలు ఎన్నో జరిగాయి. నిజం ఏమిటంటే ప్రజలు దుర్మార్గాలు చేసిన తరువాత కూడా, నీ ప్రభువు వారిని మన్నించి వదలివేస్తాడు. నీ ప్రభువు కఠినంగా శిక్షించే వాడనేది కూడా నిజమే.

Syed Abul Aala Maudoodi

అర్-రాద్

وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۗ إِنَّمَا أَنتَ مُنذِرٌ ۖ وَلِكُلِّ قَوْمٍ هَادٍ7

నీ మాటను వినటానికి నిరాకరించిన వారు ఇలా అంటారు : ‘‘ఈ వ్యక్తిపై ఇతని ప్రభువు తరఫు నుండి ఒక నిదర్శనం ఏదైనా ఎందుకు అవతరించలేదు?’’ - నీవు కేవలం హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతి జాతి కొరకూ ఒక మార్గదర్శకుడు ఉన్నాడు.

Syed Abul Aala Maudoodi

అర్-రాద్

اللَّهُ يَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ أُنثَىٰ وَمَا تَغِيضُ الْأَرْحَامُ وَمَا تَزْدَادُ ۖ وَكُلُّ شَيْءٍ عِندَهُ بِمِقْدَارٍ8

అల్లాహ్ కు ప్రతి గర్భిణి యొక్క గర్భాన్ని గురించి తెలుసు అందులో తయారయ్యేది కూడా ఆయనకు తెలుసు అందులో జరిగే హెచ్చుతగ్గులను గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయన వద్ద ప్రతి వస్తువు కొరకు ఒక పరిమాణం నిర్ణయమై ఉన్నది.

Syed Abul Aala Maudoodi

అర్-రాద్

عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْكَبِيرُ الْمُتَعَالِ9

ఆయన గోప్యంగా ఉన్నటువంటి, బహిరంగంగా ఉన్నటువంటి ప్రతి వస్తువును గురించీ తెలిసిన పండితుడు. ఆయన గొప్పవాడు. సర్వకాల సర్వావస్థలలో ఆధిక్యం కలిగి ఉండేవాడు.

Syed Abul Aala Maudoodi

అర్-రాద్

سَوَاءٌ مِّنكُم مَّنْ أَسَرَّ الْقَوْلَ وَمَن جَهَرَ بِهِ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِاللَّيْلِ وَسَارِبٌ بِالنَّهَارِ10

మీలో ఎవరైనా బిగ్గరగా మాట్లాడినా లేక మెల్లగా మాట్లాడినా మీలో ఎవరైనా రాత్రి చీకటిలో దాగివున్నా లేక పగటి వెలుగులో నడుస్తూ ఉన్నా, ఆయనకు వారంతా సమానమే.

Syed Abul Aala Maudoodi