بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
الر ۚ كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِ رَبِّهِمْ إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ1
అలిఫ్ లామ్ రా. ముహమ్మద్! ఇది ఒక గ్రంథం. మేము దీనిని నీ వైపునకు అవతరింపజేశాము, నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుండి వెలికితీసి వెలుగులోకి తీసుకురావాలని- మహాశక్తిమంతుడూ, స్వతహ స్తోత్రాలకు అర్హుడూ, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తానికీ స్వామి అయిన దేవుని మార్గం మీదకు తీసుకురావాలని.
Syed Abul Aala Maudoodi
اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَوَيْلٌ لِّلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ2
సత్యాన్ని స్వీకరించటానికి తిరస్కరించేవారికి కఠినమైన, వినాశకరమైన శిక్ష పడుతుంది.
Syed Abul Aala Maudoodi
الَّذِينَ يَسْتَحِبُّونَ الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا ۚ أُولَـٰئِكَ فِي ضَلَالٍ بَعِيدٍ3
వారు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారు ప్రజలను అల్లాహ్ మార్గం నుండి వారిస్తారు. వారు ఈ మార్గం (తమ కోరికలకు అనుగుణంగా) వక్రమైనదిగా కావాలని కోరుతున్నారు. వారు మార్గభ్రష్టత్వంలో చాలాదూరం వెళ్లిపోయారు.
Syed Abul Aala Maudoodi
وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا بِلِسَانِ قَوْمِهِ لِيُبَيِّنَ لَهُمْ ۖ فَيُضِلُّ اللَّهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ4
మేము మా సందేశాన్ని అందజేసే నిమిత్తం ప్రవక్తను పంపినప్పుడల్లా, అతడు తన జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే మా సందేశాన్ని అందజేశాడు, వారికి అతడు విషయాన్ని చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పటానికి. అల్లాహ్ తాను మార్గభ్రష్టులుగా చేయదలచుకున్న వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు. తాను మార్గం చూపదలచుకున్నవారికి మార్గం చూపుతాడు. ఆయన శక్తిసంపన్నుడూ, వివేక సంపన్నుడూను.
Syed Abul Aala Maudoodi
وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَذَكِّرْهُم بِأَيَّامِ اللَّهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ5
మేము ఇంతకు ముందు మూసాను కూడా మా సూచనలను ఇచ్చి పంపివున్నాము. ఆయనను కూడా మేము ఇలా ఆజ్ఞాపించాము : నీ జాతివారిని చీకట్లలోనుండి బయటికి తీసి వెలుగులోకి తీసుకురా. దైవ చరిత్రలోని గుణపాఠంతో నిండివున్న సంఘటనలను వారికి వినిపించి హితబోధ చెయ్యి. ఈ సంఘటనలలో సహనశీలుడూ కృతజ్ఞుడూ అయిన ప్రతి మనిషికీ గొప్ప నిదర్శనాలు ఉన్నాయి.
Syed Abul Aala Maudoodi
وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ أَنجَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ6
ఆ సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు మూసా తన జాతివారితో ఇలా అన్నాడు : ‘‘అల్లాహ్ మీకు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మీకు ఫిరౌను ప్రజల నుండి విముక్తి కలిగించాడు. వారు మిమ్మల్ని తీవ్రమైన బాధలకు గురిచేస్తూ ఉండేవారు. మీ కొడుకులను చంపేవారు. మీ కూతుళ్ళను బ్రతుకనిచ్చేవారు. ఇది మీ ప్రభువు తరఫు నుండి మీకు పెద్ద పరీక్ష!
Syed Abul Aala Maudoodi
وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ7
జ్ఞాపకం ఉంచుకోండి. మీ ప్రభువు ఇలా హెచ్చరిక చేశాడు : మీరు గనక కృతజ్ఞులైతే, నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అనుగ్రహిస్తాను. ఒకవేళ కృతఘ్నతకు పాల్పడితే నా శిక్ష చాలా కఠినముగా ఉంటుంది.’’
Syed Abul Aala Maudoodi
وَقَالَ مُوسَىٰ إِن تَكْفُرُوا أَنتُمْ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا فَإِنَّ اللَّهَ لَغَنِيٌّ حَمِيدٌ8
మూసా ఇలా అన్నాడు : ‘‘ఒకవేళ మీరు అవిశ్వాసానికి పాల్పడినా, భూమిపై ఉండే వారందరూ అవిశ్వాసులైపోయినా, అల్లాహ్ ఏ అక్కరలేనివాడు, స్వతహ స్తోత్రాలకు అర్హుడు.’’
Syed Abul Aala Maudoodi
أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ مِن قَبْلِكُمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ ۛ وَالَّذِينَ مِن بَعْدِهِمْ ۛ لَا يَعْلَمُهُمْ إِلَّا اللَّهُ ۚ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَرَدُّوا أَيْدِيَهُمْ فِي أَفْوَاهِهِمْ وَقَالُوا إِنَّا كَفَرْنَا بِمَا أُرْسِلْتُم بِهِ وَإِنَّا لَفِي شَكٍّ مِّمَّا تَدْعُونَنَا إِلَيْهِ مُرِيبٍ9
మీకు పూర్వం గతించిన జాతుల గాధలు మీదాకా చేరలేదా? నూహ్ జాతి, ఆద్‌జాతి, సమూద్ జాతి, ఇంకా వాటి తరువాత వచ్చిన అనేక జాతులూ, వాటి సంఖ్యా అల్లాహ్ కు మాత్రమే తెలుసు. వారి ప్రవక్తలు వారివద్దకు స్పష్టమైన మాటలను, ప్రస్ఫుటమైన నిదర్శనాలనూ తీసుకుని వచ్చినప్పుడు వారు తమ నోళ్ళల్లో చేతులు బిగబట్టి ఇలా అన్నారు : ‘‘ఏ సందేశంతో నీవు పంపబడ్డావో ఆ సందేశాన్ని మేము విశ్వసించము. ఏ విషయం వైపునకు నీవు మమ్మల్ని ఆహ్వానిస్తున్నావో, మేము ఆ విషయాన్ని గురించి కలతలో, సందేహంలో పడ్డాము.
Syed Abul Aala Maudoodi
۞ قَالَتْ رُسُلُهُمْ أَفِي اللَّهِ شَكٌّ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يَدْعُوكُمْ لِيَغْفِرَ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرَكُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ قَالُوا إِنْ أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا تُرِيدُونَ أَن تَصُدُّونَا عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُنَا فَأْتُونَا بِسُلْطَانٍ مُّبِينٍ10
వారి ప్రవక్తలు ఇలా అన్నారు : ‘‘ఆకాశాలకూ భూమికీ సృష్టికర్త అయిన అల్లాహ్ పట్ల సందేహమా? ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీ తప్పులను మన్నించటానికి, మీకు ఒక నిర్ణీతకాలం వరకు వ్యవధినివ్వటానికి.’’ వారు ఇలా జవాబు పలికారు: ‘‘నీవు మావంటి ఒక మానవుడవు తప్ప మరేమీ కావు. మా తాత ముత్తాతల కాలం నుండీ ఆరాధించ బడుతూ వచ్చిన శక్తుల ఆరాధన నుండి నీవు మమ్మల్ని ఆపాలని అనుకుంటున్నావు. సరే, స్పష్టమైన ప్రమాణాన్ని దేనినైనా తీసుకునిరా.’’
Syed Abul Aala Maudoodi