بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة الحجر

الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ وَقُرْآنٍ مُّبِينٍ1

అలిఫ్‌ లామ్‌ రా. ఇవి దైవ గ్రంథమైనటువంటి స్పష్టమైన ఖురానులోని ఆయతులు.

Syed Abul Aala Maudoodi

سورة الحجر

رُّبَمَا يَوَدُّ الَّذِينَ كَفَرُوا لَوْ كَانُوا مُسْلِمِينَ2

ఆ సమయం ఎంతో దూరంలో లేదు, (ఇస్లామ్‌ సందేశాన్ని స్వీకరించ టానికి) తిరస్కరించిన వారే అప్పుడు పశ్చాత్తాపపడుతూ: ‘‘అయ్యో! మేము ముస్లిములము అయివుంటే ఎంత బాగుండేది’’ అని అంటారు.

Syed Abul Aala Maudoodi

سورة الحجر

ذَرْهُمْ يَأْكُلُوا وَيَتَمَتَّعُوا وَيُلْهِهِمُ الْأَمَلُ ۖ فَسَوْفَ يَعْلَمُونَ3

వారిని వదిలి పెట్టు - తినటానికి త్రాగటానికి సుఖాలు అనుభవించటానికీ, లేనిపోని ఆశలు వారిని భ్రమలో పడవేసి ఉంచటానికీ. అతి త్వరలోనే వారు దానిని గ్రహిస్తారు.

Syed Abul Aala Maudoodi

سورة الحجر

وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُومٌ4

మేము ఇంతకు పూర్వం నాశనం చేసిన ప్రతి పట్టణానికీ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ వ్యవధి ఇదివరకే వ్రాయబడి ఉన్నది.

Syed Abul Aala Maudoodi

سورة الحجر

مَّا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَأْخِرُونَ5

ఏ జాతి అయినా తన నిర్ణీత కాలానికి ముందే నాశనమూ కాదు, ఆ తరువాత తప్పించుకోనూ లేదు.

Syed Abul Aala Maudoodi

سورة الحجر

وَقَالُوا يَا أَيُّهَا الَّذِي نُزِّلَ عَلَيْهِ الذِّكْرُ إِنَّكَ لَمَجْنُونٌ6

ఈ ప్రజలు ఇలా అంటారు: ‘‘ఈ జ్ఞాపిక అవతరించిన మనిషీ! నీవు నిజంగానే పిచ్చివాడవు.

Syed Abul Aala Maudoodi

سورة الحجر

لَّوْ مَا تَأْتِينَا بِالْمَلَائِكَةِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ7

నీవు చెప్పేది గనక సత్యమే అయితే మా ముందుకు దైవదూతలను ఎందుకు తీసుకురావు?’’

Syed Abul Aala Maudoodi

سورة الحجر

مَا نُنَزِّلُ الْمَلَائِكَةَ إِلَّا بِالْحَقِّ وَمَا كَانُوا إِذًا مُّنظَرِينَ8

మేము దైవదూతలను ఊరకే అవతరింపజెయ్యము. వారు అవతరించినప్పుడు సత్యంతోపాటు అవతరిస్తారు, తరువాత ప్రజలకు వ్యవధి ఇవ్వటం అనేది జరగదు.

Syed Abul Aala Maudoodi

سورة الحجر

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ9

ఇక ఈ జ్ఞాపిక, దానిని మేము అవతరింపజేశాము. స్వయంగా మేమే దానిని రక్షిస్తాము.

Syed Abul Aala Maudoodi

سورة الحجر

وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ فِي شِيَعِ الْأَوَّلِينَ10

ప్రవక్తా! మేము నీకు పూర్వం, గతించిన అనేక జాతులవద్దకు ప్రవక్తలను పంపివున్నాము.

Syed Abul Aala Maudoodi