بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అన్-నహ్ల్

أَتَىٰ أَمْرُ اللَّهِ فَلَا تَسْتَعْجِلُوهُ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ1

అల్లాహ్ తీర్పు వచ్చేసింది. ఇక దానికొరకు తొందరపెట్టకండి. ఆయన పరిశుద్ధుడు. వారు చేస్తూవున్న షిర్కుకు అతీతుడు, ఉన్నతుడు.

Syed Abul Aala Maudoodi

అన్-నహ్ల్

يُنَزِّلُ الْمَلَائِكَةَ بِالرُّوحِ مِنْ أَمْرِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ أَنْ أَنذِرُوا أَنَّهُ لَا إِلَـٰهَ إِلَّا أَنَا فَاتَّقُونِ2

ఆయన ఈ ఆత్మను తనకు నచ్చిన తన దాసునిపై తన ఆజ్ఞతో దైవదూతల ద్వారా అవతరింపజేస్తాడు. (ఈ ఉపదేశంతో ప్రజలను) హెచ్చరించండి: ‘‘నేను తప్ప మీకు మరొక దేవుడు ఎవ్వడూ లేడు. కనుక మీరు నాకే భయపడండి.’’

Syed Abul Aala Maudoodi

అన్-నహ్ల్

خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ تَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ3

ఆయన ఆకాశాన్నీ భూమినీ సత్యం పునాదిగా సృష్టించాడు. ఈ ప్రజలు చేసే షిర్కుకు ఆయన అతీతుడు, ఉన్నతుడు.

Syed Abul Aala Maudoodi

అన్-నహ్ల్

خَلَقَ الْإِنسَانَ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ4

ఆయన మానవుణ్ణి స్వల్పమైన బిందువుతో సృష్టించాడు. చూస్తూ చూస్తూ ఉండగానే అతడు ఒక బహిరంగ వివాదిగా మారిపోయాడు.

Syed Abul Aala Maudoodi

అన్-నహ్ల్

وَالْأَنْعَامَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ وَمِنْهَا تَأْكُلُونَ5

ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీకొరకు దుస్తులూ ఉన్నాయి, ఆహారమూ ఉన్నది. ఇంకా రకరకాల ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి.

Syed Abul Aala Maudoodi

అన్-నహ్ల్

وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ6

ఉదయంపూట మీరు వాటిని మేపటానికి తోలుకుని వెళ్ళేటప్పుడూ, సాయంత్రం పూట వాటిని తిరిగి తోలుకొని వచ్చేటప్పుడూ అవి మీకు రమణీయంగా కనిపిస్తాయి.

Syed Abul Aala Maudoodi

అన్-నహ్ల్

وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَّمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ7

ఎంతో కష్టంతో తప్ప మీరు చేరలేని ప్రదేశాలకు సయితం అవి మీకొరకు బరువును మోసుకునిపోతాయి. యథార్థ మేమిటంటే, మీ ప్రభువు ఎంతో వాత్సల్యం కలవాడు, ఎంతో కనికరించేవాడు.

Syed Abul Aala Maudoodi

అన్-నహ్ల్

وَالْخَيْلَ وَالْبِغَالَ وَالْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً ۚ وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ8

ఆయన గుర్రాలనూ, కంచర గాడిదలనూ, గాడిదలనూ సృష్టించాడు. మీరు వాటిపై స్వారీ చెయ్యటానికి, అవి మీ జీవితాలకు శోభను చేకూర్చటానికి. ఆయన ఇంకా చాలా వస్తువులను (మీ ప్రయోజనం కొరకు) సృష్టిస్తాడు. వాటిని గురించి మీకసలు తెలియనే తెలియదు

Syed Abul Aala Maudoodi

అన్-నహ్ల్

وَعَلَى اللَّهِ قَصْدُ السَّبِيلِ وَمِنْهَا جَائِرٌ ۚ وَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ9

.వక్రములైన మార్గాలు కూడా ఉన్నప్పుడు, సక్రమమైన మార్గం చూపటం అల్లాహ్ బాధ్యతే. ఆయన తలచుకుని ఉంటే మీ అందరికీ సన్మార్గం చూపి ఉండేవాడే.

Syed Abul Aala Maudoodi

అన్-నహ్ల్

هُوَ الَّذِي أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً ۖ لَّكُم مِّنْهُ شَرَابٌ وَمِنْهُ شَجَرٌ فِيهِ تُسِيمُونَ10

ఆకాశం నుండి మీకోసం నీళ్ళను కురిపించేవాడు ఆయనే. ఆ నీటిని మీరూ తనివితీరా త్రాగుతారు, ఆ నీటివల్ల మీ పశువులకు కూడా మేత మొలుస్తుంది. ఆయన ఆ నీటిద్వారా పొలాలను పండిస్తాడు.

Syed Abul Aala Maudoodi