بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-ఇస్రా

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ1

కొన్ని నిదర్శనాలను చూపటానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిదె హరామ్‌ నుండి, దూరంగా ఉన్న మసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు. నిజానికి ఆయనే అన్నీ వినేవాడూ, అన్నీ చూసేవాడూను.

Syed Abul Aala Maudoodi

అల్-ఇస్రా

وَآتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَاهُ هُدًى لِّبَنِي إِسْرَائِيلَ أَلَّا تَتَّخِذُوا مِن دُونِي وَكِيلًا2

మేము ఇంతకుపూర్వం మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. దానిని ఇస్రాయీల్‌ సంతతికి మార్గదర్శక సాధనంగా చేశాము, మీరు నన్ను తప్ప మరెవరినీ సంరక్షకుడుగా చేసుకోవద్దు అనే ఆజ్ఞతో.

Syed Abul Aala Maudoodi

అల్-ఇస్రా

ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ ۚ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا3

మేము నూహ్ ప్రవక్తతో పాటు ఓడలోకి ఎక్కించిన వారి సంతానమే మీరు. నూహ్ ప్రవక్త ఒక కృతజ్ఞుడైన దాసుడు.

Syed Abul Aala Maudoodi

అల్-ఇస్రా

وَقَضَيْنَا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا4

మేము మా గ్రంథంలో ఇస్రాయీల్‌ సంతతిని ‘‘మీరు భువిలో రెండుసార్లు గొప్ప సంక్షోభాన్ని సృష్టిస్తారు. దురహంకారాన్ని ప్రదర్శిస్తారు’’ అనే విషయాన్ని గురించికూడా హెచ్చరించాము.

Syed Abul Aala Maudoodi

అల్-ఇస్రా

فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَّنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ ۚ وَكَانَ وَعْدًا مَّفْعُولًا5

చివరకు వారిలో మొదటిసారి దురహంకారం వ్యక్తమైనప్పుడు, ఇస్రాయీలు సంతతి ప్రజలారా! మిమ్మల్ని ఎదుర్కోవటానికి మేము మహాబలాఢ్యులైన మా దాసులను లేపాము. వారు మీ దేశంలో చొరబడి అన్ని వైపులా వ్యాపించారు. ఇదొక వాగ్దానం. అది తప్పనిసరిగా నెరవేర్చబడవలసి ఉండిరది.

Syed Abul Aala Maudoodi

అల్-ఇస్రా

ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَأَمْدَدْنَاكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَجَعَلْنَاكُمْ أَكْثَرَ نَفِيرًا6

దాని తరువాత మేము మీకు వారిపై ప్రాబల్యం వహించే అవకాశాన్ని కలిగించాము. సంపదతోనూ సంతానంతోనూ మీకు సహాయపడ్డాము. మీ సంఖ్యాబలాన్ని ఇదివరకటికంటె పెంచాము.

Syed Abul Aala Maudoodi

అల్-ఇస్రా

إِنْ أَحْسَنتُمْ أَحْسَنتُمْ لِأَنفُسِكُمْ ۖ وَإِنْ أَسَأْتُمْ فَلَهَا ۚ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوءُوا وُجُوهَكُمْ وَلِيَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وَلِيُتَبِّرُوا مَا عَلَوْا تَتْبِيرًا7

చూడండి, మీరు మంచిని చేస్తే అది మీకే మీరు మంచిని చేసుకున్నట్లు. చెడును చేస్తే అది మీకు మీరే చెడును చేసు కున్నట్లు. రెండో వాగ్దానం నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మేము ఇతర శత్రువులను మీపైకి పంపాము, వారు మీ ముఖాలను వికృతం చెయ్యటానికి, మసీదు (బైతుల్‌ మఖ్దిస్‌)లోకి పూర్వం శత్రువులు చొరబడిన విధంగా చొరబడటానికి, వారి చేతికందిన ప్రతిదానినీ ధ్వంసం చేసెయ్యటానికి.

Syed Abul Aala Maudoodi

అల్-ఇస్రా

عَسَىٰ رَبُّكُمْ أَن يَرْحَمَكُمْ ۚ وَإِنْ عُدتُّمْ عُدْنَا ۘ وَجَعَلْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ حَصِيرًا8

బహుశా మీ ప్రభువు మీపై ఇప్పుడు కరుణ చూపవచ్చు. కాని ఒకవేళ మీరు మీ పాతవైఖరిని తిరిగి అవలంబిస్తే మేము కూడా మా శిక్షను తిరిగి విధిస్తాము. అనుగ్రహాలను పొంది కృతఘ్నులైన ప్రజలకు మేము నరకాన్ని కారాగారంగా చేసివుంచాము.

Syed Abul Aala Maudoodi

అల్-ఇస్రా

إِنَّ هَـٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا9

యథార్థం ఏమిటంటే ఈ ఖురాను పూర్తిగా సరళమైన సవ్యమైన మార్గాన్ని చూపుతోంది. తనను విశ్వసించి మంచి పనులు చేసేవారికి గొప్ప ప్రతిఫలం ఉంది అనే శుభవార్తను అందజేస్తోంది.

Syed Abul Aala Maudoodi

అల్-ఇస్రా

وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا10

పరలోకాన్ని విశ్వసించని వారికి మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము అనే వార్తను వినిపిస్తోంది.

Syed Abul Aala Maudoodi