بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-కహ్ఫ్

الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنزَلَ عَلَىٰ عَبْدِهِ الْكِتَابَ وَلَمْ يَجْعَل لَّهُ عِوَجًا ۜ1

అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు అందులో ఏ విధమైన వక్రత్వాన్నీ ఉంచలేదు

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

قَيِّمًا لِّيُنذِرَ بَأْسًا شَدِيدًا مِّن لَّدُنْهُ وَيُبَشِّرَ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا حَسَنًا2

అది సూటిగా, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే గ్రంథం దాని ద్వారా అతను దేవుని కఠిన శిక్షను గురించి ప్రజలను హెచ్చరించాలని, విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి మంచి ప్రతిఫలం లభిస్తుంది అనే శుభవార్తనూ

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

مَّاكِثِينَ فِيهِ أَبَدًا3

అందులోనే వారు కలకాలం ఉంటారు అనే శుభవార్తనూ అందజేయాలని,

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا4

అల్లాహ్ ఎవరినో కుమారుడుగా వరించాడు అని పలికే ప్రజలను భయపెట్టాలని.

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا5

ఈ విషయం గురించి వారికిగానీ, వారి తాతముత్తాలకు గానీ ఏ జ్ఞానమూ లేదు. వారి నోట వెలువడే ఈ మాట అత్యంత దారుణమైనది. వారు కేవలం అబద్ధాన్ని మాత్రమే వాగుతున్నారు.

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

فَلَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ عَلَىٰ آثَارِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا بِهَـٰذَا الْحَدِيثِ أَسَفًا6

అయితే ప్రవక్తా! ఒకవేళ వారు ఈ ఉపదేశాన్ని విశ్వసించకపోతే, బహుశా నీవు వారి కోసం ద్ణుఖిస్తూ నీ ప్రాణాన్నే కోల్పోతావేమో!

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

إِنَّا جَعَلْنَا مَا عَلَى الْأَرْضِ زِينَةً لَّهَا لِنَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلًا7

నిజానికి, ప్రజలలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించాలని, భూమిపై ఉన్న వస్తు సామగ్రినంతటినీ మేము భూమికి అలంకారంగా చేశాము.

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

وَإِنَّا لَجَاعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًا جُرُزًا8

చివరకు మేము దీనినంతటినీ చదునైన మైదానంగా చేసివేయనున్నాము.

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا9

గుహవారు, శిలాఫలకం వారు మా సూచనలలో ఒక అద్భుతమైన సూచన అని మీరు భావిస్తున్నారా?

Syed Abul Aala Maudoodi

అల్-కహ్ఫ్

إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا10

ఆ గుహలో ఆశ్రయం పొందిన ఆ యువకులు ‘‘ప్రభూ! నీ ప్రత్యేక కారుణ్యాన్ని మాకు ప్రసాదించు మా వ్యవహారాన్ని చక్కబెట్టు!’’ అని వేడుకున్నారు.

Syed Abul Aala Maudoodi