بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
అల్-బఖరహ్
ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ2
ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం
Syed Abul Aala Maudoodi
అల్-బఖరహ్
الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ3
వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము ప్రసాదించిన దానినుండి (మా మార్గంలో) ఖర్చుచేస్తారు.
Syed Abul Aala Maudoodi
అల్-బఖరహ్
وَالَّذِينَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ وَبِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ4
మేము నీపై అవతరింపచేసిన గ్రంథాన్నీ (ఖురాను), నీకు పూర్వం అవతరింపచేసిన గ్రంథాలనూ విశ్వసిస్తారు. పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు.
Syed Abul Aala Maudoodi
అల్-బఖరహ్
أُولَـٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ5
ఇలాంటి వారు తమ ప్రభువు తరఫునుండి రుజుమార్గంలో ఉన్నారు. సాఫల్యం పొందేవారు వారే.
Syed Abul Aala Maudoodi
అల్-బఖరహ్
إِنَّ الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ6
(ఈ విషయాలను) తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించినా, హెచ్చరించకపోయినా ఒకటే. వారు విశ్వసించేవారు కారు.
Syed Abul Aala Maudoodi
అల్-బఖరహ్
خَتَمَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰ أَبْصَارِهِمْ غِشَاوَةٌ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ7
అల్లాహ్ వారి హృదయాలకూ, వారి చెవులకూ ముద్రవేశాడు. వారి కన్నులపై తెరపడిరది. వారు కఠిన శిక్షకు అర్హులు.
Syed Abul Aala Maudoodi
అల్-బఖరహ్
وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّهِ وَبِالْيَوْمِ الْآخِرِ وَمَا هُم بِمُؤْمِنِينَ8
‘‘అల్లాహ్ ను, అంతిమదినాన్ని మేము విశ్వసించాము’’ అని అనేవారు కూడా కొందరు ఉన్నారు. కాని వాస్తవంగా వారు విశ్వాసులు కారు.
Syed Abul Aala Maudoodi
అల్-బఖరహ్
يُخَادِعُونَ اللَّهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ9
అల్లాహ్ ను, విశ్వాసులనూ వారు మోసం చేస్తున్నారు. కాని యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరినీ మోసం చెయ్యటం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు.
Syed Abul Aala Maudoodi
అల్-బఖరహ్
فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ10
వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికిగాను, వారికి వ్యధాభరితమయిన శిక్ష పడుతుంది.
Syed Abul Aala Maudoodi