بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

తాహా

طه1

తా హా

Syed Abul Aala Maudoodi

తాహా

مَا أَنزَلْنَا عَلَيْكَ الْقُرْآنَ لِتَشْقَىٰ2

మేము ఈ ఖుర్‌ఆన్‌ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురిచేయటానికి మాత్రం కాదు.

Syed Abul Aala Maudoodi

తాహా

إِلَّا تَذْكِرَةً لِّمَن يَخْشَىٰ3

ఇది భయపడే ప్రతి వ్యక్తికీ ఒక జ్ఞాపిక.

Syed Abul Aala Maudoodi

తాహా

تَنزِيلًا مِّمَّنْ خَلَقَ الْأَرْضَ وَالسَّمَاوَاتِ الْعُلَى4

భూమినీ, ఎత్తైన ఆకాశాలనూ సృష్టించిన వాని తరఫు నుండి ఇది అవతరింప జేయబడింది

Syed Abul Aala Maudoodi

తాహా

الرَّحْمَـٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ5

ఆ కరుణామయుడు (సృష్టి) సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు

Syed Abul Aala Maudoodi

తాహా

لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَمَا تَحْتَ الثَّرَىٰ6

ఆకాశాలలో, భూమిలో మరియు భూమ్యాకాశాల మధ్య, ఇంకా నేలక్రింద ఉన్న వాటినన్నింటికీ ఆయన యజమాని.

Syed Abul Aala Maudoodi

తాహా

وَإِن تَجْهَرْ بِالْقَوْلِ فَإِنَّهُ يَعْلَمُ السِّرَّ وَأَخْفَى7

నీవు నీ మాటను బిగ్గరగా పలికినా పరవాలేదు. ఆయన మెల్లగా పలికిన మాటను మాత్రమే కాదు, దానికంటే అతి గోప్యమైన మాటను సైతమూ ఎరుగును.

Syed Abul Aala Maudoodi

తాహా

اللَّهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ8

ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరొక దేవుడే లేడు. ఆయనకు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి.

Syed Abul Aala Maudoodi

తాహా

وَهَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ9

మూసా వృత్తాంతం కూడ నీకేమైనా అందిందా?

Syed Abul Aala Maudoodi

తాహా

إِذْ رَأَىٰ نَارًا فَقَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَّعَلِّي آتِيكُم مِّنْهَا بِقَبَسٍ أَوْ أَجِدُ عَلَى النَّارِ هُدًى10

అప్పుడు అతను ఒక మంటను చూసి తన ఆలుబిడ్డలతో ఇలా అన్నాడు, ‘‘కొంచెం ఆగండి, నేను ఒక మంటను చూశాను. బహుశా మీ కోసం కాస్త నిప్పును తీసుకురాగల నేమో లేదా ఆ మంట వద్ద నాకేదైనా (దారికి సంబంధించిన) మార్గదర్శకత్వం లభిస్తుందేమో.’’

Syed Abul Aala Maudoodi