بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة الأنبياء

اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ1

మానవుల లెక్కల (పరిశీలన) సమయం సమీపించింది. అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు.

Syed Abul Aala Maudoodi

سورة الأنبياء

مَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّن رَّبِّهِم مُّحْدَثٍ إِلَّا اسْتَمَعُوهُ وَهُمْ يَلْعَبُونَ2

వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు ఏ తాజా ఉపదేశం వచ్చినా, దానిని వారు అనాసక్తితో వింటారు

Syed Abul Aala Maudoodi

سورة الأنبياء

لَاهِيَةً قُلُوبُهُمْ ۗ وَأَسَرُّوا النَّجْوَى الَّذِينَ ظَلَمُوا هَلْ هَـٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۖ أَفَتَأْتُونَ السِّحْرَ وَأَنتُمْ تُبْصِرُونَ3

ఆటలలో మునిగిపోయి ఉంటారు. వారి మనస్సులు (వేరే ఆలోచనలలో) లగ్నమై ఉన్నాయి.దుర్మార్గులు పరస్పరం ఇలా గుసగుసలాడుకుంటారు, ‘‘ఇంతకూ ఈ వ్యక్తి మీలాంటి ఒక మానవుడేకదా! అయినా మీరు చూస్తూ చూస్తూ మాంత్రిక వలయంలో చిక్కుకుపోతారా?’’

Syed Abul Aala Maudoodi

سورة الأنبياء

قَالَ رَبِّي يَعْلَمُ الْقَوْلَ فِي السَّمَاءِ وَالْأَرْضِ ۖ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ4

ప్రవక్త, ‘‘నా ప్రభువు ఆకాశంలోనూ, భూమిపైనా పలుకబడే ప్రతి మాటను ఎరుగును. ఆయన సర్వం వినేవాడూ, సర్వమూ తెలిసినవాడూను అని అన్నాడు.

Syed Abul Aala Maudoodi

سورة الأنبياء

بَلْ قَالُوا أَضْغَاثُ أَحْلَامٍ بَلِ افْتَرَاهُ بَلْ هُوَ شَاعِرٌ فَلْيَأْتِنَا بِآيَةٍ كَمَا أُرْسِلَ الْأَوَّلُونَ5

వారు ఇలా అన్నారు, ‘‘కాదు, ఇవి అస్పష్టములైన కలలు, కాదు, ఇది అతని కల్పన, కాదు ఇతను ఒక కవి. పూర్వకాలపు ప్రవక్తలు సూచనలతో పంపబడిన విధంగా ఇతన్ని కూడ ఏదైనా ఒక సూచనను తీసుకు రమ్మనండి.’’

Syed Abul Aala Maudoodi

سورة الأنبياء

مَا آمَنَتْ قَبْلَهُم مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا ۖ أَفَهُمْ يُؤْمِنُونَ6

యధార్థం ఏమిటంటే, వారికి పూర్వం మేము నాశనం చేసిన ఏ జనవాసం కూడా విశ్వసించలేదు. ఇక వీరు మాత్రం విశ్వసిస్తారా?

Syed Abul Aala Maudoodi

سورة الأنبياء

وَمَا أَرْسَلْنَا قَبْلَكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِمْ ۖ فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ7

ఓ ప్రవక్తా! నీకు పూర్వం కూడ మేము మానవులనే ప్రవక్తలుగా పంపాము. వారికి మేము వహీని అందజేశాము. ఒకవేళ మీకు ఇది తెలియకపోతే, గ్రంథ ప్రజలను అడగండి.

Syed Abul Aala Maudoodi

سورة الأنبياء

وَمَا جَعَلْنَاهُمْ جَسَدًا لَّا يَأْكُلُونَ الطَّعَامَ وَمَا كَانُوا خَالِدِينَ8

ఆ ప్రవక్తలకు మేము అన్నం తినే అవసరం లేని శరీరాలనూ ఇవ్వలేదు, వారు చిరంజీవులు కూడ కాదు.

Syed Abul Aala Maudoodi

سورة الأنبياء

ثُمَّ صَدَقْنَاهُمُ الْوَعْدَ فَأَنجَيْنَاهُمْ وَمَن نَّشَاءُ وَأَهْلَكْنَا الْمُسْرِفِينَ9

చూడు, చివరకు మేము వారికి చేసిన వాగ్దానాలను నెరవేర్చాము, వారినీ ఇంకా మేము ఇష్టపడిన వారినీ కాపాడాము హద్దులు మీరిన వారిని నాశనం చేశాము.

Syed Abul Aala Maudoodi

سورة الأنبياء

لَقَدْ أَنزَلْنَا إِلَيْكُمْ كِتَابًا فِيهِ ذِكْرُكُمْ ۖ أَفَلَا تَعْقِلُونَ10

ప్రజలారా! మేము మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాము, అందులో మీ ప్రస్తావనే ఉంది. అయినా మీరు అర్థం చేసుకోరేమిటీ?

Syed Abul Aala Maudoodi