بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-హజ్

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ1

మానవులారా! మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించు కోండి. యధార్థం ఏమిటంటే, ప్రళయం నాటి భూకంపం మహా (భయంకర మైన) విషయం.

Syed Abul Aala Maudoodi

అల్-హజ్

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَـٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ2

దానిని మీరు చూచినప్పుడు దాని స్థితి ఎలా ఉంటుందంటే పాలు పట్టే ప్రతి స్త్రీ పాలు త్రాగే తన పాపను మరచిపోతుంది, ప్రతి గర్భిణి యొక్క గర్భం పడిపోతుంది, ప్రజలు మీకు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు, వాస్తవానికి వారు త్రాగి ఉండరు. కాని అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది.

Syed Abul Aala Maudoodi

అల్-హజ్

وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّبِعُ كُلَّ شَيْطَانٍ مَّرِيدٍ3

ప్రజలలో కొందరు జ్ఞానం లేకపోయినా అల్లాహ్ ను గురించి వాదిస్తారు. తిరగబడిన ప్రతి షైతాన్‌ను అనుసరిస్తారు.

Syed Abul Aala Maudoodi

అల్-హజ్

كُتِبَ عَلَيْهِ أَنَّهُ مَن تَوَلَّاهُ فَأَنَّهُ يُضِلُّهُ وَيَهْدِيهِ إِلَىٰ عَذَابِ السَّعِيرِ4

వాస్తవానికి అతడి అదృష్టం ఇలా వ్రాయబడి ఉంది : వాడిని స్నేహితుడుగా చేసుకునే మనిషిని వాడు మార్గం తప్పించి మరీ వదలిపెడతాడు, నరకయాతన వైపునకు మార్గం చూపుతాడు.

Syed Abul Aala Maudoodi

అల్-హజ్

يَا أَيُّهَا النَّاسُ إِن كُنتُمْ فِي رَيْبٍ مِّنَ الْبَعْثِ فَإِنَّا خَلَقْنَاكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِن مُّضْغَةٍ مُّخَلَّقَةٍ وَغَيْرِ مُخَلَّقَةٍ لِّنُبَيِّنَ لَكُمْ ۚ وَنُقِرُّ فِي الْأَرْحَامِ مَا نَشَاءُ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ۖ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْلَا يَعْلَمَ مِن بَعْدِ عِلْمٍ شَيْئًا ۚ وَتَرَى الْأَرْضَ هَامِدَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ وَأَنبَتَتْ مِن كُلِّ زَوْجٍ بَهِيجٍ5

మానవులారా! ఒకవేళ మీకు మరణానంతర జీవితం గురించి ఏదైనా సందేహం ఉంటే, మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి: మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్య బిందువుతో, ఆ తరువాత నెత్తుటి గడ్డతో, ఆపై మాంసపు కండతో అది రూపం కలదిగానూ, రూపం లేనిది గానూ ఉంటుంది. (మేము ఈ విషయాన్ని) మీకు యధార్థం ఏమిటో స్పష్టం చెయ్యాలని (తెలుపుతున్నాము). మేము కోరిన (వీర్య బిందువును) దానిని ఒక ప్రత్యేక కాలం వరకు మాతృగర్భాలలో నిలిపి ఉంచుతాము. తరువాత మిమ్మల్ని ఒక శిశువు రూపంలో బయటికి తీస్తాము. (ఆ తరువాత మీకు పెట్టి పోషిస్తాము) మీరు నిండు యౌవన దశకు చేరటానికి. మీలో ఒకడు ముందుగానే వెనుకకు పిలుచుకోబడతాడు, మరొకడు అతి నికృష్టమైన వయస్సు వైపునకు మరలింపబడతాడు, అంతా తెలిసిన తరువాత కూడ ఏమీ తెలియకుండా ఉండటానికి. ఎండిపోయిన నేలను మీరు చూస్తున్నారు, తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే, అకస్మాత్తుగా అది పులక రిస్తుంది మరియు ఉబుకుతుంది, ఇంకా అది అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తించటం ప్రారంభిస్తుంది.

Syed Abul Aala Maudoodi

అల్-హజ్

ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّهُ يُحْيِي الْمَوْتَىٰ وَأَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ6

దీనికంతటికీ కారణం, అల్లాహ్ యే సత్యం కావటం, ఆయన మృతులను బ్రతికించటం మరియు ప్రతిదానిపై అధికారం కలిగి ఉండటం

Syed Abul Aala Maudoodi

అల్-హజ్

وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَّا رَيْبَ فِيهَا وَأَنَّ اللَّهَ يَبْعَثُ مَن فِي الْقُبُورِ7

(ఇది మరొక విషయానిక్కూడ నిదర్శనమే) ఏమిటంటే, ప్రళయఘడియ తప్పకుండా వచ్చి తీరుతుంది, ఇందులో ఏ అనుమానానికీ ఆస్కారం లేదు, గోరీలలోకి వెళ్ళిపోయినవారిని అల్లాహ్ తప్పకుండా లేపుతాడు.

Syed Abul Aala Maudoodi

అల్-హజ్

وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَلَا هُدًى وَلَا كِتَابٍ مُّنِيرٍ8

మానవులలో ఇంకా కొందరు ఏ జ్ఞానమూ లేకపోయినా, ఏ మార్గదర్శకత్వమూ లేకపోయినా, జ్యోతిని ప్రసాదించే ఏ గ్రంథమూ లేకుండానే, తలబిరుసుతనంతో అల్లాహ్ ను గురించి తగవులాడుతారు. తద్ద్వారా వారు ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పింపజూస్తారు.

Syed Abul Aala Maudoodi

అల్-హజ్

ثَانِيَ عِطْفِهِ لِيُضِلَّ عَن سَبِيلِ اللَّهِ ۖ لَهُ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَنُذِيقُهُ يَوْمَ الْقِيَامَةِ عَذَابَ الْحَرِيقِ9

తద్ద్వారా వారు ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పింపజూస్తారు. అలాంటి వ్యక్తి ప్రపం చంలో అవమానం పాలవుతాడు, ప్రళయంనాడు మేము అతనికి అగ్ని బాధను రుచి చూపిస్తాము -

Syed Abul Aala Maudoodi

అల్-హజ్

ذَٰلِكَ بِمَا قَدَّمَتْ يَدَاكَ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ10

ఇది నీ భవిష్యత్తు దానిని స్వయంగా నీ చేతులే నీకై సిద్ధపరచి ఉంచాయి. నిజానికి అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.

Syed Abul Aala Maudoodi