بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-ఫుర్కాన్

تَبَارَكَ الَّذِي نَزَّلَ الْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا1

ఎనలేని శుభాలవాడు ఈ గీటురాయిని తన దాసునిపై అవతరింప జేశాడు. సకల విశ్వవాసులకు హెచ్చరిక చేసేదిగా ఉండేటందుకు.

Syed Abul Aala Maudoodi

అల్-ఫుర్కాన్

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُن لَّهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا2

ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు.ఆయన ఎవరినీ కొడుకుగా చేసుకో లేదు. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. ఆయన ప్రతి దానినీ సృష్టించాడు. తరువాత దానికి ఒక విధినీ నిర్ణయించాడు.

Syed Abul Aala Maudoodi

అల్-ఫుర్కాన్

وَاتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً لَّا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ ضَرًّا وَلَا نَفْعًا وَلَا يَمْلِكُونَ مَوْتًا وَلَا حَيَاةً وَلَا نُشُورًا3

ప్రజలు ఆయనను కాదని కల్పించుకున్నట్టి దేవుళ్లు ఏ వస్తువునూ సృష్టించలేరు, కాని వారే సృష్టింపబడతారు. వారు స్వయంగా తమ కొరకైనా ఏ లాభనష్టాల అధికారాన్నీ కలిగిలేరు. వారు చంపనూలేరు, బ్రతికించనూలేరు, మరణించిన వాణ్ణి మళ్లీ లేపనూ లేరు.

Syed Abul Aala Maudoodi

అల్-ఫుర్కాన్

وَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَـٰذَا إِلَّا إِفْكٌ افْتَرَاهُ وَأَعَانَهُ عَلَيْهِ قَوْمٌ آخَرُونَ ۖ فَقَدْ جَاءُوا ظُلْمًا وَزُورًا4

దైవప్రవక్త మాటను విశ్వసించటానికి నిరాకరించిన వారు ఇలా అంటారు, ‘‘ఈ గీటురాయి ఒక కల్పన, దానిని ఇతనే స్వయంగా కల్పించాడు. ఇతరులు కొందరు ఈ పనిలో అతనికి సాయపడ్డారు.’’ వారు ఘోర అన్యాయా నికి, పరమ అబద్ధానికి ఒడిగట్టారు.

Syed Abul Aala Maudoodi

అల్-ఫుర్కాన్

وَقَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ اكْتَتَبَهَا فَهِيَ تُمْلَىٰ عَلَيْهِ بُكْرَةً وَأَصِيلًا5

ఇంకా ఇలా అంటారు, ‘‘ఇవి పూర్వకాలం నాటి వారు వ్రాసిన విషయాలు, వాటికి ఇతను నకలు వ్రాయిస్తున్నాడు. అవి ఇతనికి ఉదయం సాయంత్రం వినిపించబడతాయి.’’

Syed Abul Aala Maudoodi

అల్-ఫుర్కాన్

قُلْ أَنزَلَهُ الَّذِي يَعْلَمُ السِّرَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّهُ كَانَ غَفُورًا رَّحِيمًا6

ప్రవక్తా! వారితో, ‘‘భూమియొక్క ఆకాశముల యొక్క రహస్యాన్ని ఎరిగినవాడు, దానిని అవతరింపజేశాడు’’ అని అను. యధార్థమేమిటంటే, ఆయన ఎక్కువగా క్షమించేవాడు, కరుణించేవాడూను.

Syed Abul Aala Maudoodi

అల్-ఫుర్కాన్

وَقَالُوا مَالِ هَـٰذَا الرَّسُولِ يَأْكُلُ الطَّعَامَ وَيَمْشِي فِي الْأَسْوَاقِ ۙ لَوْلَا أُنزِلَ إِلَيْهِ مَلَكٌ فَيَكُونَ مَعَهُ نَذِيرًا7

వారు ఇలా అంటారు, ‘‘ఇతనేమి ప్రవక్త, అన్నం తింటాడు, బజారులో తిరుగుతూ ఉంటాడు? ఇతని వద్దకు ఒక దైవదూత అయినా ఎందుకు పంపబడలేదు, ఇతనితో ఉంటూ (విశ్వసించని వారిని) బెదిరించటానికి?

Syed Abul Aala Maudoodi

అల్-ఫుర్కాన్

أَوْ يُلْقَىٰ إِلَيْهِ كَنزٌ أَوْ تَكُونُ لَهُ جَنَّةٌ يَأْكُلُ مِنْهَا ۚ وَقَالَ الظَّالِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَّسْحُورًا8

లేదా ఏదిలేకపోయినా కనీసం ఇతని కొరకు ఒక నిధి అయినా ఎందుకు దించబడలేదు? లేదా ఇతనికి ఒక తోట అయినా ఎందుకు లేదు, దాని ద్వారా ఇతను (నిశ్చింతగా) ఉపాధిని పొందటానికి?’’ ఇంకా ఆ దుర్మార్గులు, ‘‘మీరు చేతబడి చేయబడిన ఒక మనిషి వెంట నడుస్తున్నారు’’ అని అంటారు.

Syed Abul Aala Maudoodi

అల్-ఫుర్కాన్

انظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا9

చూడు, ఎటువంటి విచిత్రమైన వాదాలను నీ ముందు పెడుతున్నారో! వారు ఎంతగా మార్గం తప్పిపోయారంటే, స్థిరమైన మాట అనేది వారికసలు తోచదు.

Syed Abul Aala Maudoodi

అల్-ఫుర్కాన్

تَبَارَكَ الَّذِي إِن شَاءَ جَعَلَ لَكَ خَيْرًا مِّن ذَٰلِكَ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ وَيَجْعَل لَّكَ قُصُورًا10

శుభప్రదుడైన ఆయన తాను కోరితే, వారు ప్రతిపాదించిన వస్తువుల కంటే ఎంతో ఎక్కువగా నీకు ఇవ్వగలుగుతాడు. (ఒకటి కాదు) క్రింద కాలువలు ప్రవహించే ఎన్నో తోటలు, పెద్ద పెద్ద భవనాలు.

Syed Abul Aala Maudoodi