بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
طسم1
తా-సీన్-మీమ్.
Syed Abul Aala Maudoodi
تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ2
ఇవి స్పష్టమైన గ్రంథంలోని వాక్యాలు.
Syed Abul Aala Maudoodi
نَتْلُو عَلَيْكَ مِن نَّبَإِ مُوسَىٰ وَفِرْعَوْنَ بِالْحَقِّ لِقَوْمٍ يُؤْمِنُونَ3
మేము మూసా, ఫిరౌనుల కొంత వృత్తాంతాన్ని విశ్వసించే వారి ప్రయోజనం కోసం జరిగింది జరిగినట్లుగా మీకు వినిపిస్తున్నాము.
Syed Abul Aala Maudoodi
إِنَّ فِرْعَوْنَ عَلَا فِي الْأَرْضِ وَجَعَلَ أَهْلَهَا شِيَعًا يَسْتَضْعِفُ طَائِفَةً مِّنْهُمْ يُذَبِّحُ أَبْنَاءَهُمْ وَيَسْتَحْيِي نِسَاءَهُمْ ۚ إِنَّهُ كَانَ مِنَ الْمُفْسِدِينَ4
అసలు విషయం ఏమిటంటే, ఫిరౌను భూమి మీద తిరుగుబాటు వైఖరిని అవలంబించాడు. దాని ప్రజలను వర్గాలుగా విభజించాడు. వారిలోని ఒక వర్గాన్ని అతడు నీచపరచేవాడు. వారి బాలురను హతమార్చేవాడు వారి బాలికలను మాత్రం బ్రతుకనిచ్చేవాడు. నిశ్చయంగా అతడు దుష్టులలోని వాడు.
Syed Abul Aala Maudoodi
وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى الَّذِينَ اسْتُضْعِفُوا فِي الْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُ الْوَارِثِينَ5
భూమిలో అణచివేయబడిన వారిని కనికరించాలనీ, వారిని నాయకులుగా చేయాలనీ, వారినే వారసులుగా చేయాలనీ,
Syed Abul Aala Maudoodi
وَنُمَكِّنَ لَهُمْ فِي الْأَرْضِ وَنُرِيَ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا مِنْهُم مَّا كَانُوا يَحْذَرُونَ6
భూమిలో వారికి అధికారాన్ని ప్రసాదించాలనీ, వారి ద్వారా ఫిరౌను, హామానులకూ, వారి సైన్యాలకూ తాము భయపడుతూ వచ్చిన దానినే చూపాలనీ మేము కోరాము.
Syed Abul Aala Maudoodi
وَأَوْحَيْنَا إِلَىٰ أُمِّ مُوسَىٰ أَنْ أَرْضِعِيهِ ۖ فَإِذَا خِفْتِ عَلَيْهِ فَأَلْقِيهِ فِي الْيَمِّ وَلَا تَخَافِي وَلَا تَحْزَنِي ۖ إِنَّا رَادُّوهُ إِلَيْكِ وَجَاعِلُوهُ مِنَ الْمُرْسَلِينَ7
మేము మూసా తల్లికి ఇలా సూచించాము, ‘‘అతనికి పాలుపట్టు, అతని ప్రాణానికి ప్రమాదముందని నీకు అనిపిస్తే అపుడు అతనిని నదిలో విడిచిపెట్టు, ఏమాత్రం భయపడకు, బాధపడకు, మేము అతనిని నీ వద్దకే తిరిగి తీసుకువస్తాము, అతనిని ప్రవక్తలలో ఒకడుగా చేస్తాము.’’
Syed Abul Aala Maudoodi
فَالْتَقَطَهُ آلُ فِرْعَوْنَ لِيَكُونَ لَهُمْ عَدُوًّا وَحَزَنًا ۗ إِنَّ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا كَانُوا خَاطِئِينَ8
చివరకు ఫిరౌను ఇంటివారు అతనిని (నదిలో నుండి) బయటికి తీశారు, అతను వారికి శత్రువై శోక కారణం అవటానికి. నిజంగానే ఫిరౌను, హామాను, వారి సైన్యాలు (తమ వ్యూహాల రీత్యా) ఎంతో పాపిష్ఠులు.
Syed Abul Aala Maudoodi
وَقَالَتِ امْرَأَتُ فِرْعَوْنَ قُرَّتُ عَيْنٍ لِّي وَلَكَ ۖ لَا تَقْتُلُوهُ عَسَىٰ أَن يَنفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا وَهُمْ لَا يَشْعُرُونَ9
ఫిరౌను భార్య (అతడితో) ఇలా అన్నది, ‘‘ఇతడు నీకూ నాకూ కంటి చలువ. ఇతనిని చంపకు. బహుశా ఇతడు మనకు ఉపయోగపడవచ్చు లేదా మనం ఇతనిని కుమారునిగానైనా చేసుకోవచ్చు.’’ కాని వారికి (పర్యవసానం) తెలియదు.
Syed Abul Aala Maudoodi
وَأَصْبَحَ فُؤَادُ أُمِّ مُوسَىٰ فَارِغًا ۖ إِن كَادَتْ لَتُبْدِي بِهِ لَوْلَا أَن رَّبَطْنَا عَلَىٰ قَلْبِهَا لِتَكُونَ مِنَ الْمُؤْمِنِينَ10
అటు మూసా తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. ఆమె (మా వాగ్దానం ఆధారంగా) విశ్వసించే వారిలో ఉండిపోవాలని, మేము ఆమె హృదయాన్ని ధైర్యంతో నింపాము. లేకపోతే, ఆమె అతని రహస్యాన్ని బయటపెట్టి ఉండేదే.
Syed Abul Aala Maudoodi