بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-అంకబూత్

الم1

అలిఫ్‌, లామ్‌, మీమ్‌.

Syed Abul Aala Maudoodi

అల్-అంకబూత్

أَحَسِبَ النَّاسُ أَن يُتْرَكُوا أَن يَقُولُوا آمَنَّا وَهُمْ لَا يُفْتَنُونَ2

కేవలం ‘‘మేము విశ్వసించాము’’ అని అన్నంత మాత్రాన్నే వారిని వదలివేయటం జరుగుతుందనీ, వారిని పరీక్షించటం జరగదనీ ప్రజలు భావిస్తున్నారా?

Syed Abul Aala Maudoodi

అల్-అంకబూత్

وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ3

వాస్తవానికి మేము వారికి పూర్వం గతించిన వారందరినీ పరీక్షించాము, అల్లాహ్ కు సత్యవాదులెవరో, అసత్యవాదులెవరో తప్పనిసరిగా చూడవలసి ఉన్నది.

Syed Abul Aala Maudoodi

అల్-అంకబూత్

أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ أَن يَسْبِقُونَا ۚ سَاءَ مَا يَحْكُمُونَ4

చెడు చేష్టలు చేస్తున్నవారు మమ్మల్ని మీరి పోగలమని అనుకుంటున్నారా? వారి నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం.

Syed Abul Aala Maudoodi

అల్-అంకబూత్

مَن كَانَ يَرْجُو لِقَاءَ اللَّهِ فَإِنَّ أَجَلَ اللَّهِ لَآتٍ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ5

ఎవడైనా అల్లాహ్ ను కలిసే ఆశను కలిగి ఉంటే, (అతడు తెలుసు కోవాలి) అల్లాహ్ నిర్ణయించిన సమయం త్వరలోనే రానున్నదనీ, అల్లాహ్ అన్నీ వింటాడనీ, అన్నీ ఎరుగుననీ.

Syed Abul Aala Maudoodi

అల్-అంకబూత్

وَمَن جَاهَدَ فَإِنَّمَا يُجَاهِدُ لِنَفْسِهِ ۚ إِنَّ اللَّهَ لَغَنِيٌّ عَنِ الْعَالَمِينَ6

ఏ వ్యక్తి అయినా అల్లాహ్ మార్గంలో తీవ్రంగా పరిశ్రమిస్తే అతడు తన మేలు కొరకే అలా చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సకల లోకాలలోని వారి అక్కర ఎంతమాత్రం లేనివాడు.

Syed Abul Aala Maudoodi

అల్-అంకబూత్

وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ الَّذِي كَانُوا يَعْمَلُونَ7

విశ్వసించి మంచి పనులు చేసేవారి పాపాలను మేము వారినుండి తొలగిస్తాము, వారికి తాము చేసిన ఉత్తమ కర్మలకు ప్రతిఫలం ఇస్తాము.

Syed Abul Aala Maudoodi

అల్-అంకబూత్

وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حُسْنًا ۖ وَإِن جَاهَدَاكَ لِتُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۚ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ8

తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగుమని మేము మానవునికి ఉపదేశించాము. కాని ఒకవేళ వారు నా భాగస్వామిగా నీవు ఎరుగని వానిని (ఆరాధ్యుణ్ణి) నాకు భాగస్వామిగా చేయమని నిన్ను బలవంతపెడితే, అప్పుడు వారి యెడల విధేయత చూపకు. నా వైపునకే మీరందరూ మరలిరావలసి ఉంది. అప్పుడు నేను మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాము.

Syed Abul Aala Maudoodi

అల్-అంకబూత్

وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُدْخِلَنَّهُمْ فِي الصَّالِحِينَ9

ఎవరైనా విశ్వసించి మంచిపనులు చేసి ఉన్నట్లయితే, వారిని మేము తప్పకుండా సజ్జనులలో కలుపుతాము.

Syed Abul Aala Maudoodi

అల్-అంకబూత్

وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّهِ فَإِذَا أُوذِيَ فِي اللَّهِ جَعَلَ فِتْنَةَ النَّاسِ كَعَذَابِ اللَّهِ وَلَئِن جَاءَ نَصْرٌ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ10

ప్రజలలో, ‘‘మేము అల్లాహ్ ను విశ్వసించాము’’ అని అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, కాని అతడు అల్లాహ్ మార్గంలో హింసించబడినప్పుడు, లోకులు పెట్టిన పరీక్షను అల్లాహ్ విధించిన శిక్షగా భావిస్తాడు, ఇప్పుడు ఒకవేళ నీ ప్రభువు తరఫు నుండి సహాయం, విజయం వచ్చినట్లయితే, ఈ వ్యక్తియే, ‘‘మేము మీతోనే ఉన్నాము’’ అని అంటాడు. భూలోకవాసుల హృద యాల స్థితి అల్లాహ్ కు బాగా తెలియదా?

Syed Abul Aala Maudoodi