بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

ఆల్-ఇమ్రాన్

الم1

అలిఫ్‌ లామ్‌ మీమ్‌.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

اللَّهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ2

అల్లాహ్ - సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడు.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

نَزَّلَ عَلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَأَنزَلَ التَّوْرَاةَ وَالْإِنجِيلَ3

ప్రవక్తా! ఆయన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు. అది సత్యాన్ని తీసుకువచ్చింది. మునుపు అవతరించిన గ్రంథాలను ధృవపరుస్తుంది. దీనికి పూర్వం ఆయన మానవులకు రుజుమార్గం చూపటానికి తౌరాతు, ఇన్‌జీలు గ్రంథాలను అవతరింపజేశాడు.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

مِن قَبْلُ هُدًى لِّلنَّاسِ وَأَنزَلَ الْفُرْقَانَ ۗ إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انتِقَامٍ4

ఇంకా (సత్యాసత్యాలను వేరుచేసి చూపే) గీటురాయిని అవతరింపజేశాడు. ఇకనుండి అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠినశిక్ష పడటం నిశ్చయం. అల్లాహ్ మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడూను.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

إِنَّ اللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ5

భూమ్యాకాశాలలోని ఏ వస్తువూ అల్లాహ్ కు గోప్యంగా లేదు.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

هُوَ الَّذِي يُصَوِّرُكُمْ فِي الْأَرْحَامِ كَيْفَ يَشَاءُ ۚ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ6

మాతృగర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దేది ఆయనే కదా! మహాశక్తిశాలీ, మహా వివేకీ అయిన ఆయన తప్ప మరొక దేవుడు లేడు.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

هُوَ الَّذِي أَنزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُّحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ ۗ وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ7

ప్రవక్తా! నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆ దేవుడే! ఈ గ్రంథంలో రెండు రకాల ఆయతులు ఉన్నాయి. మొదటివి, ముహ్కమాత్‌ (స్పష్టమైనవి). అవి గ్రంథానికి పునాదుల వంటివి. రెండోవి, ముతషాబిహాత్‌ (అస్పష్టమైనవి). వక్ర మనస్కులు కలతలను రేపేందుకు ఎల్లప్పుడూ ‘ముతషాబిహాత్‌’ వెంటపడి వాటికి అర్థాలు తొడిగే ప్రయత్నం చేస్తారు. కాని వాటి అసలు అర్థాన్ని అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఎరుగరు. దీనికి భిన్నంగా, పరిపక్వ జ్ఞానం కలవారు ఇలా అంటారు: ‘‘వాటిని మేము విశ్వసించాము. ఇవన్నీ మా ప్రభువు నుండి వచ్చినవే.’’ యథార్థం ఏమిటంటే, ఏ విషయాన్నుండైనా విజ్ఞతగలవారే గుణపాఠం నేర్చుకుంటారు.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ8

వారు అల్లాహ్ ను ఇలా ప్రార్థిస్తారు : ‘‘ప్రభూ! నీవు మాకు సరియైన మార్గాన్ని చూపావు. ఇక మా మనస్సులను వక్రమార్గం వైపునకు మళ్ళించకు. నీ కారుణ్య నిధినుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిజమైనదాతవు నీవే.

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ ۚ إِنَّ اللَّهَ لَا يُخْلِفُ الْمِيعَادَ9

ప్రభూ! నీవు నిశ్చయంగా మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు. ఆ రోజు రావటంలో ఏమాత్రం సందేహం లేదు. నీవు ఎన్నటికీ ఆడిన మాట తప్పేవాడవు కావు.’’

Syed Abul Aala Maudoodi

ఆల్-ఇమ్రాన్

إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَـٰئِكَ هُمْ وَقُودُ النَّارِ10

అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి, వారి ఐశ్వర్యబలంకాని, సంతానబలంకాని అల్లాహ్ కు ప్రతికూలంగా ఉపయోగపడవు. వారు నరకానికి ఇంధనం అయి తీరుతారు.

Syed Abul Aala Maudoodi