بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
الم1
అలిఫ్. లామ్. మీమ్.
Syed Abul Aala Maudoodi
غُلِبَتِ الرُّومُ2
రోమన్ ప్రజలు పొరుగు భూభాగంలో పరాజితు లయ్యారు
Syed Abul Aala Maudoodi
فِي أَدْنَى الْأَرْضِ وَهُم مِّن بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ3
తమ ఈ పరాజయం తరువాత కొన్ని సంవత్సరాలలోనే వారు విజేతలవుతారు.
Syed Abul Aala Maudoodi
فِي بِضْعِ سِنِينَ ۗ لِلَّهِ الْأَمْرُ مِن قَبْلُ وَمِن بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ الْمُؤْمِنُونَ4
ముందయినా తరువాత అయినా అధికారం మట్టుకు అల్లాహ్దే. ఆ రోజున అల్లాహ్ ప్రసాదించిన విజయానికి విశ్వాసులు వేడుకలు జరుపుకుంటారు.
Syed Abul Aala Maudoodi
بِنَصْرِ اللَّهِ ۚ يَنصُرُ مَن يَشَاءُ ۖ وَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ5
అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి సహాయపడతాడు. అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు మరియు అనంతకరుణామయుడు,
Syed Abul Aala Maudoodi
وَعْدَ اللَّهِ ۖ لَا يُخْلِفُ اللَّهُ وَعْدَهُ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ6
ఈ వాగ్దానం అల్లాహ్ చేసిన వాగ్దానం. అల్లాహ్ ఎన్నడూ తన వాగ్దానాన్ని భంగపరచడు. కాని ఈ విషయాన్ని చాలామంది ఎరుగరు.
Syed Abul Aala Maudoodi
يَعْلَمُونَ ظَاهِرًا مِّنَ الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ عَنِ الْآخِرَةِ هُمْ غَافِلُونَ7
ప్రజలు ప్రాపంచిక జీవితపు బాహ్యరూపాన్ని మాత్రమే ఎరుగుదురు పరలోకం గురించి స్వయంగా వారే ఉపేక్షాభావంతో ఉన్నారు.
Syed Abul Aala Maudoodi
أَوَلَمْ يَتَفَكَّرُوا فِي أَنفُسِهِم ۗ مَّا خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ بِلِقَاءِ رَبِّهِمْ لَكَافِرُونَ8
వారు తమను గురించి తాము ఎన్నడూ ఆలోచించలేదా? అల్లాహ్ భూమినీ, ఆకాశాలనూ, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులనూ సత్యంతో, ఒక నిర్ణీత గడువు వరకు మాత్రమే సృష్టించాడు. కాని చాలామంది తమ ప్రభువుతో సమావేశం కావలసి ఉన్నది అనే విషయాన్ని తిరస్కరిస్తున్నారు.
Syed Abul Aala Maudoodi
أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا الْأَرْضَ وَعَمَرُوهَا أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ9
వారు భూమిపై ఎన్నడూ ప్రయాణం చేసి ఉండలేదా? తమకు పూర్వం గతించిన ప్రజల ముగింపును వారు చూడగలందులకు? వారు (పూర్వీకులు) వీరికంటే ఎక్కువ బలవంతులు. వారు భూమిని బాగా త్రవ్వారు. వారు దానిని వీరు చేసిన దానికంటే ఎక్కువగా వసింపచేశారు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు. ఇంకా అల్లాహ్ వారికి అన్యాయం చేసేవాడు కాదు, కాని స్వయంగా వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండినారు.
Syed Abul Aala Maudoodi
ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِينَ أَسَاءُوا السُّوأَىٰ أَن كَذَّبُوا بِآيَاتِ اللَّهِ وَكَانُوا بِهَا يَسْتَهْزِئُونَ10
చివరకు చెడు పనులు చేసిన వారి ముగింపు చాలా చెడ్డగా జరిగింది. ఎందుకంటే, వారు అల్లాహ్ వాక్యాలను తిరస్కరించారు వాటిని ఎగతాళి చేశారు.
Syed Abul Aala Maudoodi