بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

లుక్మాన్

الم1

అలిఫ్‌. లామ్‌. మీమ్‌.

Syed Abul Aala Maudoodi

లుక్మాన్

تِلْكَ آيَاتُ الْكِتَابِ الْحَكِيمِ2

ఇవి వివేచనగల గ్రంథంలోని వాక్యాలు,

Syed Abul Aala Maudoodi

లుక్మాన్

هُدًى وَرَحْمَةً لِّلْمُحْسِنِينَ3

సజ్జనులకు మార్గమును చూపేది మరియు కారుణ్యమూను.

Syed Abul Aala Maudoodi

లుక్మాన్

الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ4

వారు నమాజును స్థాపిస్తారు. జకాత్‌ ఇస్తారు. పరలోకం పట్ల దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు.

Syed Abul Aala Maudoodi

లుక్మాన్

أُولَـٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ5

ఇటువంటి వారే తమ ప్రభువు తరఫు నుండి లభించిన ఋజుమార్గంలో ఉన్నారు. వారే సాఫల్యం పొందేవారు.

Syed Abul Aala Maudoodi

లుక్మాన్

وَمِنَ النَّاسِ مَن يَشْتَرِي لَهْوَ الْحَدِيثِ لِيُضِلَّ عَن سَبِيلِ اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّخِذَهَا هُزُوًا ۚ أُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ6

జ్ఞానం లేకుండానే ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించటానికీ, ఈ మార్గం వైపునకు పిలిచే పిలుపును ఎగతాళి చేయటానికీ మానవులలోనే మనస్సును రంజింపజేసే ప్రసంగాన్ని కొనుక్కొని తీసుకువచ్చేవాడు కూడా ఒకడు ఉంటాడు అటువంటి వారికి తీవ్ర అవమానకరమైన శిక్ష పడుతుంది,

Syed Abul Aala Maudoodi

లుక్మాన్

وَإِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا وَلَّىٰ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا كَأَنَّ فِي أُذُنَيْهِ وَقْرًا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ7

అతనికి మా వాక్యాలు వినిపించినపుడు, అతను వాటిని అసలు విననేలేద న్నట్లుగా, అతని చెవులలో చెవుడు ఉన్నట్లుగా అహంకారంతో తన ముఖాన్ని తిప్పుకుంటాడు. సరే మంచిది, అతి బాధాకరమైన ఒక శిక్ష ఉన్నది - అనే శుభవార్తను అతనికి వినిపించు.

Syed Abul Aala Maudoodi

లుక్మాన్

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتُ النَّعِيمِ8

అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికి వరాలతో నిండియున్న ఉద్యానవనాలు ఉన్నాయి.

Syed Abul Aala Maudoodi

లుక్మాన్

خَالِدِينَ فِيهَا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ9

వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది అల్లాహ్ చేసిన సత్య వాగ్దానం. ఆయన శక్తిమంతుడు మరియు వివేకవంతుడు.

Syed Abul Aala Maudoodi

లుక్మాన్

خَلَقَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِكُمْ وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ ۚ وَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ10

ఆయన, ఆకాశాలను నీవు చూడగలిగే స్తంభాలు లేకుండానే సృష్టించాడు, ఆయన భూమిలో పర్వతాలను అమర్చాడు, మీతో పాటు దొర్లి పోకుండా ఉండేటందుకు. ఆయన అన్ని రకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు. ఆకాశం నుండి నీళ్లను కురిపించాడు. భూమిలో రకరకాల శ్రేష్ఠమైన పదార్థాలను పండిరచాడు.

Syed Abul Aala Maudoodi