بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة السجدة

الم1

అలిఫ్‌. లామ్‌. మీమ్‌.

Syed Abul Aala Maudoodi

سورة السجدة

تَنزِيلُ الْكِتَابِ لَا رَيْبَ فِيهِ مِن رَّبِّ الْعَالَمِينَ2

నిస్సందేహంగా ఈ గ్రంథం సకల లోకాల ప్రభువు తరఫునుండి అవతరించింది.

Syed Abul Aala Maudoodi

سورة السجدة

أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۚ بَلْ هُوَ الْحَقُّ مِن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّا أَتَاهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَهْتَدُونَ3

దీనిని స్వయంగా ఈ వ్యక్తియే కల్పిం చాడని వారు అంటున్నారా? కాదు, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం నీకు పూర్వం హెచ్చరించేవారెవరూ రాని జాతికి నీవు హెచ్చరిక చేసేందుకు, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమో అని.

Syed Abul Aala Maudoodi

سورة السجدة

اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ مَا لَكُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا شَفِيعٍ ۚ أَفَلَا تَتَذَكَّرُونَ4

ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులనూ ఆరు రోజులలో సృష్టించినవాడు, దాని తరువాత అధికార పీఠాన్ని అధిష్ఠించినవాడు అల్లాహ్ యే, ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడూ, మీకు సహాయం చేసేవాడూ ఎవడూ లేడు, ఆయన సమక్షంలో సిఫారసు చేసేవాడు కూడా ఎవడూ లేడు. అలాంటప్పుడు మీరు ఆలోచించరెందుకని?

Syed Abul Aala Maudoodi

سورة السجدة

يُدَبِّرُ الْأَمْرَ مِنَ السَّمَاءِ إِلَى الْأَرْضِ ثُمَّ يَعْرُجُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ أَلْفَ سَنَةٍ مِّمَّا تَعُدُّونَ5

ఆయన ఆకాశం నుండి భూమి వరకు గల ప్రపంచ వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహణా నివేదిక ఒక రోజున పైకి ఆయన సమ్ముఖానికి చేరుతుంది. ఆ రోజు పరిమాణం మీ అంచనా ప్రకారం వేయి సంవత్సరాలు.

Syed Abul Aala Maudoodi

سورة السجدة

ذَٰلِكَ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الرَّحِيمُ6

గోప్యంగాను, బహిరంగంగాను ఉన్న ప్రతిదానిని ఎరిగినవాడూ, శక్తిమంతుడూ, కరుణా మయుడూ

Syed Abul Aala Maudoodi

سورة السجدة

الَّذِي أَحْسَنَ كُلَّ شَيْءٍ خَلَقَهُ ۖ وَبَدَأَ خَلْقَ الْإِنسَانِ مِن طِينٍ7

ఆయనే, ఆయన ఏ వస్తువును చేసినా చక్కగానే చేశాడు. ఆయన మానవ సృష్టి ప్రారంభాన్ని మట్టితో చేశాడు.

Syed Abul Aala Maudoodi

سورة السجدة

ثُمَّ جَعَلَ نَسْلَهُ مِن سُلَالَةٍ مِّن مَّاءٍ مَّهِينٍ8

తరువాత అతని సంతతిని తుచ్ఛమైన ద్రవపదార్థం వంటి ఒక సారంతో కొనసాగించాడు.

Syed Abul Aala Maudoodi

سورة السجدة

ثُمَّ سَوَّاهُ وَنَفَخَ فِيهِ مِن رُّوحِهِ ۖ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۚ قَلِيلًا مَّا تَشْكُرُونَ9

ఆ తరువాత అతనిని నఖశిఖ పర్యంతం తీర్చిదిద్దాడు. అతనిలోనికి తన ఆత్మను ఊదాడు. మీకు చెవులిచ్చాడు, కళ్ళిచ్చాడు, హృదయాలిచ్చాడు. అయినా మీరు కృతజ్ఞతలు తెలపటం చాలా తక్కువ.

Syed Abul Aala Maudoodi

سورة السجدة

وَقَالُوا أَإِذَا ضَلَلْنَا فِي الْأَرْضِ أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۚ بَلْ هُم بِلِقَاءِ رَبِّهِمْ كَافِرُونَ10

ఈ ప్రజలు ఇలా అంటారు ‘‘మేము మట్టిలో కలిసి నశించి పోయినా, మళ్లీ మేము క్రొత్తగా సృష్టించబడతామా? అసలు విషయం ఏమిటంటే వారు తమ ప్రభువును కలుసుకోవటాన్ని తిరస్కరిస్తారు.

Syed Abul Aala Maudoodi