بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
الْحَمْدُ لِلَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَلَهُ الْحَمْدُ فِي الْآخِرَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ1
కేవలం అల్లాహ్ యే స్తుతికిపాత్రుడు. ఆయన ఆకాశాలలోనూ, భూమి లోనూ ఉన్న ప్రతి వస్తువుకూ స్వామి. పరలోకంలో కూడా ఆయనే స్తోత్రానికి పాత్రుడు. ఆయన వివేచనకలవాడు, అన్నీ ఎరిగినవాడు,
Syed Abul Aala Maudoodi
يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۚ وَهُوَ الرَّحِيمُ الْغَفُورُ2
భూమిలోకి ప్రవేశిం చేదీ, దానినుండి వెలికి వచ్చేదీ, ఆకాశం నుండి దిగేదీ, దానిలోకి ఎక్కేదీ, ఇదంతా ఆయనకు తెలుసు. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడూను.
Syed Abul Aala Maudoodi
وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَأْتِينَا السَّاعَةُ ۖ قُلْ بَلَىٰ وَرَبِّي لَتَأْتِيَنَّكُمْ عَالِمِ الْغَيْبِ ۖ لَا يَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَلَا أَصْغَرُ مِن ذَٰلِكَ وَلَا أَكْبَرُ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ3
ఏదీ, ప్రళయం ఇంకా మా మీదకు రావటం లేదేమిటి? అని అవిశ్వాసులు అంటారు. వారితో ఇలా అను, ‘‘అగోచర విషయజ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా! అది మీ మీదకు తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువైనా సరే ఆయనకు ఆకాశాలలోనూ గోప్యంగా లేదు, భూమిపైనా గోప్యంగా లేదు. రవ్వకంటే పెద్దదైనా సరే దానికంటె చిన్నదైనా సరే అంతా ఒక స్పష్టమైన దస్త్రములో వ్రాయబడి ఉన్నది.’’
Syed Abul Aala Maudoodi
لِّيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۚ أُولَـٰئِكَ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ4
విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి అల్లాహ్ మంచి ప్రతిఫలం ఇవ్వటానికి ఈ ప్రళయం వస్తుంది, వారికి క్షమాభిక్ష లభిస్తుంది, గౌరవప్రదమైన ఉపాధి సిద్ధిస్తుంది.
Syed Abul Aala Maudoodi
وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَـٰئِكَ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ5
మా వాక్యాలను అగౌరవ పరచటానికి విశ్వప్రయత్నాలు చేసినవారికి తీవ్రమైన, బాధాకరమైన శిక్షపడు తుంది.
Syed Abul Aala Maudoodi
وَيَرَى الَّذِينَ أُوتُوا الْعِلْمَ الَّذِي أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ هُوَ الْحَقَّ وَيَهْدِي إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ6
ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుండి ఏదైతే నీపై అవతరించిందో, అది పూర్తిగా సత్యమనీ, శక్తిమంతుడూ, స్తవనీయుడూ అయిన దేవుని మార్గం చూపుతుందనీ జ్ఞానులు బాగా గ్రహిస్తారు.
Syed Abul Aala Maudoodi
وَقَالَ الَّذِينَ كَفَرُوا هَلْ نَدُلُّكُمْ عَلَىٰ رَجُلٍ يُنَبِّئُكُمْ إِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ إِنَّكُمْ لَفِي خَلْقٍ جَدِيدٍ7
అవిశ్వాసులు ప్రజలతో ఇలా అంటారు: ‘‘మీ శరీరంలోని అణువణువు చెల్లాచెదరై పోయినప్పుడు మీరు మళ్లీ కొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని మీకు చూపమంటారా?
Syed Abul Aala Maudoodi
أَفْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَم بِهِ جِنَّةٌ ۗ بَلِ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ فِي الْعَذَابِ وَالضَّلَالِ الْبَعِيدِ8
ఈ వ్యక్తి అల్లాహ్ పేరుతో అబద్ధాలు కల్పిస్తున్నాడో లేక ఇతనికి పిచ్చి ఏమైనా పట్టిందో తెలియటం లేదు.’’కాదు. వాస్తవానికి పరలోకాన్ని విశ్వసించినవారే యాతనకు గురి అయ్యేవారు, వారే ఘోరంగా మార్గం తప్పినవారు.
Syed Abul Aala Maudoodi
أَفَلَمْ يَرَوْا إِلَىٰ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ إِن نَّشَأْ نَخْسِفْ بِهِمُ الْأَرْضَ أَوْ نُسْقِطْ عَلَيْهِمْ كِسَفًا مِّنَ السَّمَاءِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّكُلِّ عَبْدٍ مُّنِيبٍ9
వారిని ముందునుంచీ, వెనకనుంచీ చుట్టుముట్టి ఉన్న భూమ్యాకాశాలను వారు ఎన్నడూ చూడలేదా? మేము కోరితే వారిని భూమిలోకి కూరుకుపోయేలా చేయగలము లేదా ఆకాశ ఖండాలను కొన్నింటిని వారి మీద పడవేయగలము. నిజంగానే దేవుని వైపునకు మరలే ప్రతి దాసుని కొరకు ఇందులో ఒక సూచన ఉన్నది.
Syed Abul Aala Maudoodi
۞ وَلَقَدْ آتَيْنَا دَاوُودَ مِنَّا فَضْلًا ۖ يَا جِبَالُ أَوِّبِي مَعَهُ وَالطَّيْرَ ۖ وَأَلَنَّا لَهُ الْحَدِيدَ10
మేము దావూద్‌కు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదిం చాము. (మేము ఇలా ఆజ్ఞాపించాము) పర్వతములారా! ఇతనితో కలిసి కీర్తన చేయండి. (ఇదే ఆజ్ఞను మేము) పక్షులకు కూడా ఇచ్చాము. మేము ఇనుమును అతని కొరకు మెత్తపడేటట్లుగా చేశాము.
Syed Abul Aala Maudoodi