بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ جَاعِلِ الْمَلَائِكَةِ رُسُلًا أُولِي أَجْنِحَةٍ مَّثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۚ يَزِيدُ فِي الْخَلْقِ مَا يَشَاءُ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ1
అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన ఆకాశాలనూ, భూమినీ సృష్టించాడు. ఆయన దైవదూతలను సందేశహరులుగా నియమిస్తాడు. (ఎటువంటి దైవదూతలంటే) వారికి రెండేసి, మూడేసి, నాలుగేసి బాహువులు ఉంటాయి. ఆయన తన సృష్టి స్వరూపాన్ని తన ఇష్ట ప్రకారం పెంచుతాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
Syed Abul Aala Maudoodi
مَّا يَفْتَحِ اللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُ مِن بَعْدِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ2
అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్యద్వారాన్ని తెరిచినా, దానిని అడ్డుకునే వాడెవ్వడూ లేడు. ఆయన మూసివేసిన దానిని అల్లాహ్ తరువాత మళ్ళీ తెరిచేవాడూ ఎవ్వడూ లేడు. ఆయన శక్తిమంతుడు, వివేచన కలవాడు.
Syed Abul Aala Maudoodi
يَا أَيُّهَا النَّاسُ اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ ۚ هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللَّهِ يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ3
మానవులారా! అల్లాహ్ మీకు చేసిన ఉపకారాలను జ్ఞాపకం ఉంచుకోండి. అల్లాహ్ కాక, భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధినిచ్చే మరొక సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా - ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవ్వడూ లేడు. అసలు మీరు ఎవని వల్ల మోసపోతున్నారు?
Syed Abul Aala Maudoodi
وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ4
ఇప్పుడు ఒకవేళ (ప్రవక్తా) వారు నిన్ను తిరస్కరిస్తున్నారు అంటే (ఇది క్రొత్త విషయమేమీ కాదు). నీకు పూర్వం కూడా చాలామంది దైవప్రవక్తలు తిరస్కరించబడ్డారు. వ్యవహారాలన్నీ చివరకు అల్లాహ్ వైపునకే మరలనున్నాయి.
Syed Abul Aala Maudoodi
يَا أَيُّهَا النَّاسُ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۖ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيَاةُ الدُّنْيَا ۖ وَلَا يَغُرَّنَّكُم بِاللَّهِ الْغَرُورُ5
మానవులారా! నిశ్చయముగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురిచేయకూడదు. ఆ మహావంచకుడు కూడా మిమ్మల్ని అల్లాహ్ విషయంలో మోసగించగలగకూడదు.
Syed Abul Aala Maudoodi
إِنَّ الشَّيْطَانَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوهُ عَدُوًّا ۚ إِنَّمَا يَدْعُو حِزْبَهُ لِيَكُونُوا مِنْ أَصْحَابِ السَّعِيرِ6
యథార్థానికి షైతాను మీకు శత్రువు. కనుక మీరు కూడా వాడు మీ శత్రువే అని భావించండి. వాడు, తన అనుచరులు నరక వాసులలో చేరిపోవాలని వారిని తన మార్గం వైపునకు పిలుస్తున్నాడు,
Syed Abul Aala Maudoodi
الَّذِينَ كَفَرُوا لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۖ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ7
అవిశ్వాసానికి పాల్పడే వారికి కఠిన శిక్ష పడుతుంది. విశ్వసించి మంచిపనులు చేసేవారికి క్షమాభిక్ష గొప్ప ప్రతిఫలం లభిస్తాయి.
Syed Abul Aala Maudoodi
أَفَمَن زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ فَرَآهُ حَسَنًا ۖ فَإِنَّ اللَّهَ يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۖ فَلَا تَذْهَبْ نَفْسُكَ عَلَيْهِمْ حَسَرَاتٍ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا يَصْنَعُونَ8
ఎవనికి తన దుష్కార్యం అందంగా కనిపించేలా చేయబడిరదో మరియు అతడు దానిని మేలైనదిగా భావిస్తున్నాడో (ఆ వ్యక్తి మార్గభ్రష్టత్వానికి అసలు హద్దు అంటూ ఏమైనా ఉందా?) యథార్థం ఏమిటంటే, అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురిచేస్తాడు. తాను కోరిన వారికి ఋజుమార్గం చూపుతాడు. కనుక (ప్రవక్తా) అనవసరంగా నీ ప్రాణం ఈ ప్రజలకోసం ద్ణుఖానికీ, బాధకూ గురిఅయి హరించిపోకూడదు. వారు చేస్తూ ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
Syed Abul Aala Maudoodi
وَاللَّهُ الَّذِي أَرْسَلَ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَسُقْنَاهُ إِلَىٰ بَلَدٍ مَّيِّتٍ فَأَحْيَيْنَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ كَذَٰلِكَ النُّشُورُ9
వాయువులను పంపేవాడు అల్లాహ్ యే. తరువాత అవి మేఘాన్ని లేపుతాయి, ఆ తరువాత మేము దానిని ఒక పాడుబడ్డ నేల వైపునకు తీసుకుపోతాము, దానిద్వారా చచ్చిపడివున్న ఆ నేలనే బ్రతికిస్తాము. మరణించిన మానవులు బ్రతికి లేవటం కూడా ఇలానే జరుగు తుంది.
Syed Abul Aala Maudoodi
مَن كَانَ يُرِيدُ الْعِزَّةَ فَلِلَّهِ الْعِزَّةُ جَمِيعًا ۚ إِلَيْهِ يَصْعَدُ الْكَلِمُ الطَّيِّبُ وَالْعَمَلُ الصَّالِحُ يَرْفَعُهُ ۚ وَالَّذِينَ يَمْكُرُونَ السَّيِّئَاتِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۖ وَمَكْرُ أُولَـٰئِكَ هُوَ يَبُورُ10
అల్లాహ్ మాత్రమే గౌరవానికి పూర్తిగా అర్హుడనే విషయాన్ని గౌరవాభిలాషి అయిన ప్రతివాడూ తెలుసుకోవాలి. ఆయన వద్దకు అధిరోహించే వస్తువు పరిశుద్ధ వాక్కు మాత్రమే, సత్కర్మ దానిని పైకి ఎక్కిస్తుంది. ఇక కుతంత్రాలు చేసేవారు, వారికైతే కఠిన శిక్ష పడుతుంది. వారి కుతంత్రం దానంతట అదే నాశనమై పోతుంది.
Syed Abul Aala Maudoodi