بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة ص

ص ۚ وَالْقُرْآنِ ذِي الذِّكْرِ1

సాద్‌. హితబోధతో నిండి ఉన్న ఖుర్‌ఆన్‌ సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

سورة ص

بَلِ الَّذِينَ كَفَرُوا فِي عِزَّةٍ وَشِقَاقٍ2

అసలు విషయం ఏమిటంటే విశ్వసించటానికి తిరస్కరించిన ఈ ప్రజలే దురహంకారులు, పరమమూర్ఖులు, వా

Syed Abul Aala Maudoodi

سورة ص

كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ فَنَادَوا وَّلَاتَ حِينَ مَنَاصٍ3

వారికి పూర్వం మేము ఇటువంటి ఎన్నో జాతులను నాశనం చేశాము. (వారికి పోగాలము దాపురించగా) అపుడు వారు హాహాకారాలు చేశారు. కాని అది తప్పించుకునే సమయం కాదు కదా!

Syed Abul Aala Maudoodi

سورة ص

وَعَجِبُوا أَن جَاءَهُم مُّنذِرٌ مِّنْهُمْ ۖ وَقَالَ الْكَافِرُونَ هَـٰذَا سَاحِرٌ كَذَّابٌ4

భయపెట్టేవాడొకడు స్వయంగా తమనుండే వచ్చాడని వారు ఆశ్చర్యపడ్డారు. సత్యతిరస్కారులు ఇలా అనసాగారు, ‘‘ఇతడు మంత్రవాది, అసత్యవాది,

Syed Abul Aala Maudoodi

سورة ص

أَجَعَلَ الْآلِهَةَ إِلَـٰهًا وَاحِدًا ۖ إِنَّ هَـٰذَا لَشَيْءٌ عُجَابٌ5

సమస్త దైవాల స్థానంలో కేవలం ఒకే ఒక దైవాన్ని నిలబెట్టాడేమిటి? ఇది ఎంతో విచిత్రమైన విషయం.’’

Syed Abul Aala Maudoodi

سورة ص

وَانطَلَقَ الْمَلَأُ مِنْهُمْ أَنِ امْشُوا وَاصْبِرُوا عَلَىٰ آلِهَتِكُمْ ۖ إِنَّ هَـٰذَا لَشَيْءٌ يُرَادُ6

జాతి నాయకులు ఇలా అంటూ వెళ్ళిపోయారు, ‘‘పదండి మీ దైవాల ఆరాధన పట్ల స్థిరంగా ఉండండి. ఈ విషయం ఒక ప్రయోజనం కోరి చెప్పబడుతోంది.

Syed Abul Aala Maudoodi

سورة ص

مَا سَمِعْنَا بِهَـٰذَا فِي الْمِلَّةِ الْآخِرَةِ إِنْ هَـٰذَا إِلَّا اخْتِلَاقٌ7

ఈ విషయాన్ని మేము ఇటీవలి కాలపు సమాజంలో ఎవరినోటా వినలేదు. ఇది కల్పిత విషయం తప్ప మరేమీ కాదు.

Syed Abul Aala Maudoodi

سورة ص

أَأُنزِلَ عَلَيْهِ الذِّكْرُ مِن بَيْنِنَا ۚ بَلْ هُمْ فِي شَكٍّ مِّن ذِكْرِي ۖ بَل لَّمَّا يَذُوقُوا عَذَابِ8

మన అందరిలోనూ కేవలం ఇతడొక్కడే అర్హుడా ఇతని మీదనే అల్లాహ్ యొక్క ‘హితోపదేశం’ అవతరించటానికి?’’అసలు విషయం ఏమిటంటే, వారు నా ‘‘జిక్ర్‌’’ (గ్రంథం) గురించి సంశయగ్రస్తులయ్యారు. వారు నా శిక్షను రుచి చూడలేదు కాబట్టి ఈ మాటలన్నీ అంటున్నారు.

Syed Abul Aala Maudoodi

سورة ص

أَمْ عِندَهُمْ خَزَائِنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِيزِ الْوَهَّابِ9

ప్రబలుడు, ప్రదాత అయిన నీ ప్రభువు కారుణ్య నిధులు వారి అధీనంలో ఉన్నాయా?

Syed Abul Aala Maudoodi

سورة ص

أَمْ لَهُم مُّلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ فَلْيَرْتَقُوا فِي الْأَسْبَابِ10

ఆకాశాలకూ, భూమికీ, వాటికి మధ్య ఉన్న వస్తువులకూ వారు యజమానులా? అలా అయితే, ప్రాపంచిక సాధనాల శిఖరాలకు చేరి చూడమనండి.

Syed Abul Aala Maudoodi