بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ1
ఈ గ్రంథం మహాశక్తి సంపన్నుడూ, మహా వివేకవంతుడూ అయిన అల్లాహ్ తరఫునుండి అవతరించింది.
Syed Abul Aala Maudoodi
إِنَّا أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَّهُ الدِّينَ2
(ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని సత్యంతో నీపై అవతరింపజేశాము. కనుక నీవు ధర్మాన్ని అల్లాహ్కే ప్రత్యేకిస్తూ అల్లాహ్ కు మాత్రమే దాస్యం చెయ్యి.
Syed Abul Aala Maudoodi
أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ3
జాగ్రత్త! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే. ఇక ఆయనను వదలివేసి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నవారు, (తమ ఈ చర్యకు కారణంగా) ‘‘వారు మమ్మల్ని అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము’’ అని అంటారు. అల్లాహ్ నిశ్చయంగా వారి మధ్యన వారు విభేదిస్తున్న అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. అసత్యవాదీ, సత్యధిక్కారీ అయిన ఏ వ్యక్తికీ అల్లాహ్ సన్మార్గం చూపడు.
Syed Abul Aala Maudoodi
لَّوْ أَرَادَ اللَّهُ أَن يَتَّخِذَ وَلَدًا لَّاصْطَفَىٰ مِمَّا يَخْلُقُ مَا يَشَاءُ ۚ سُبْحَانَهُ ۖ هُوَ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ4
ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోదలిస్తే, తన సృష్టిలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు. ఆయన పరిశుద్ధుడు. (ఆయనకు కుమారుడు ఉంటాడు అనే విషయానికి) అతీతుడు. ఆయన అల్లాహ్ ఒక్కడే, అందరిపై ఆధిక్యం కలవాడు.
Syed Abul Aala Maudoodi
خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ يُكَوِّرُ اللَّيْلَ عَلَى النَّهَارِ وَيُكَوِّرُ النَّهَارَ عَلَى اللَّيْلِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۗ أَلَا هُوَ الْعَزِيزُ الْغَفَّارُ5
ఆయన ఆకాశాలనూ, భూమినీ సత్యంతో సృష్టించాడు. ఆయనే పగటిని రేయితోనూ, రేయిని పగటితోనూ చుట్టివేస్తాడు. ఆయనే సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతి ఒక్కటీ ఒక నిర్ణీతకాలం వరకు సంచరిస్తూ వుంటుంది. తెలుసు కోండి, ఆయన మహాశక్తిమంతుడు మరియు మన్నించేవాడూను.
Syed Abul Aala Maudoodi
خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ الْأَنْعَامِ ثَمَانِيَةَ أَزْوَاجٍ ۚ يَخْلُقُكُمْ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ خَلْقًا مِّن بَعْدِ خَلْقٍ فِي ظُلُمَاتٍ ثَلَاثٍ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۖ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ6
మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే, తిరిగి ఆయనే ఆ ప్రాణి నుండి దాని జంటను సృజించాడు. ఇంకా ఆయనే మీ కొరకు పశువులలో ఎనిమిది మగ, ఆడ జాతులను సృష్టించాడు. ఆయన మీ తల్లుల గర్భాలలో మూడేసి చీకటి తెరలలో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూపోతు న్నాడు. (ఈ కార్యాలు నిర్వహించే) ఈ దేవుడే మీ ప్రభువు, సృష్టి సామ్రాజ్యం ఆయనదే. ఆయన తప్ప మరొక దేవుడు ఎవ్వడూ లేడు. అలాంటప్పుడు మీరు ఎలా మరలింప బడుతున్నారు?
Syed Abul Aala Maudoodi
إِن تَكْفُرُوا فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنكُمْ ۖ وَلَا يَرْضَىٰ لِعِبَادِهِ الْكُفْرَ ۖ وَإِن تَشْكُرُوا يَرْضَهُ لَكُمْ ۗ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ7
ఒకవేళ మీరు తిరస్కార వైఖరిని అవలంబిస్తే అల్లాహ్ మీ అక్కర ఎంత మాత్రం లేనివాడు. కాని ఆయన తన దాసులు తిరస్కార వైఖరిని అవలంబిం చటాన్ని ఇష్టపడడు. ఒకవేళ మీరు కృతజ్ఞతలు తెలిపితే, దాన్ని ఆయన మీ కొరకు ఇష్టపడతాడు. బరువు మోసేవాడెవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరందరూ మీ ప్రభువు వైపునకే మరలవలసి ఉంది. అప్పుడు ఆయన మీకు మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో తెలుపుతాడు. ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును.
Syed Abul Aala Maudoodi
۞ وَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَا رَبَّهُ مُنِيبًا إِلَيْهِ ثُمَّ إِذَا خَوَّلَهُ نِعْمَةً مِّنْهُ نَسِيَ مَا كَانَ يَدْعُو إِلَيْهِ مِن قَبْلُ وَجَعَلَ لِلَّهِ أَندَادًا لِّيُضِلَّ عَن سَبِيلِهِ ۚ قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِيلًا ۖ إِنَّكَ مِنْ أَصْحَابِ النَّارِ8
మనిషిపైకి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చిపడితే, అతడు తన ప్రభువు వైపునకు మరలి ఆయనకు మొఱ పెట్టుకుంటాడు. తరువాత అతడి ప్రభువు అతడికి తన అనుగ్రహాన్ని ప్రసాదించినపుడు, అతడు గతంలో ఏ ఆపదను గురించి మొఱపెట్టుకున్నాడో, ఆ ఆపదను మరచి పోయి, ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెడతాడు. ఈ విధంగా అతడు (ప్రజలను కూడా) అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తాడు. (ఓ ప్రవక్తా!) అతడితో, ‘‘కొన్నాళ్ళపాటు నీ తిరస్కార వైఖరి ద్వారా ఆనందాన్ని అనుభవించు. చివరకు నీవు తప్పకుండా నరకానికి పోయేవాడివే’’ అని చెప్పు.
Syed Abul Aala Maudoodi
أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ ۗ قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ9
(ఈ వ్యక్తి వైఖరి మంచిదా లేక ఆ వ్యక్తి వైఖరి మంచిదా) ఎవడైతే విధేయుడో, రాత్రి గడియలలో (నమాజు చేస్తూ) నిలబడతాడో, సజ్‌దాలు చేస్తాడో, పరలోకానికి భయ పడతాడో, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తాడో? వీరిని అడుగు, తెలిసినవారూ, తెలియని వారూ ఇద్దరూ ఎప్పుడైనా సమానులు కాగలరా? బుద్ధిమంతులు మాత్రమే హితబోధను స్వీకరిస్తారు.
Syed Abul Aala Maudoodi
قُلْ يَا عِبَادِ الَّذِينَ آمَنُوا اتَّقُوا رَبَّكُمْ ۚ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَـٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۗ وَأَرْضُ اللَّهِ وَاسِعَةٌ ۗ إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ10
(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు, ‘‘విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువునకు భయపడండి. ఈ లోకంలో సద్వర్తనను అవలంబించే వారికి మేలు జరుగు తుంది. దేవుని భూమి విశాలమైనటువంటిది. ఓర్పు వహించేవారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది.’’
Syed Abul Aala Maudoodi