بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అన్-నిసా

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا1

మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతోమంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. ఏ దేవుని పేరు చెప్పుకుని మీరు పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో, ఆ దేవునికి భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటం మానుకోండి. అల్లాహ్ మిమ్మల్ని పరికిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَآتُوا الْيَتَامَىٰ أَمْوَالَهُمْ ۖ وَلَا تَتَبَدَّلُوا الْخَبِيثَ بِالطَّيِّبِ ۖ وَلَا تَأْكُلُوا أَمْوَالَهُمْ إِلَىٰ أَمْوَالِكُمْ ۚ إِنَّهُ كَانَ حُوبًا كَبِيرًا2

అనాథుల ఆస్తిని వారికి తిరిగి ఇవ్వండి. వారి మంచి వస్తువులను మీ చెడ్డ వస్తువులతో మార్చకండి. వారి ఆస్తిని మీ ఆస్తితో కలిపి కబళించకండి. ఇది మహాపాపం.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَإِنْ خِفْتُمْ أَلَّا تُقْسِطُوا فِي الْيَتَامَىٰ فَانكِحُوا مَا طَابَ لَكُم مِّنَ النِّسَاءِ مَثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا تَعْدِلُوا فَوَاحِدَةً أَوْ مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَلَّا تَعُولُوا3

అనాథులకు న్యాయం చెయ్యలేమనే భయం మీకు కలిగితే, మీకు నచ్చిన స్త్రీలను ఇద్దరేసిగాని, ముగ్గురేసిగాని, నలుగురేసిగాని వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకుంటే, అప్పుడు ఒకామెనే చేసుకోండి లేదా మీ స్వాధీనంలోకి వచ్చిన స్త్రీలను దాంపత్యంలోకి తీసుకోండి. అన్యాయానికి దూరంగా ఉండేందుకు ఇది ఉత్తమ మార్గం.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَآتُوا النِّسَاءَ صَدُقَاتِهِنَّ نِحْلَةً ۚ فَإِن طِبْنَ لَكُمْ عَن شَيْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوهُ هَنِيئًا مَّرِيئًا4

స్త్రీలకు వారి మహర్‌ను సంతోషంగా (విధిగా భావిస్తూ) చెల్లించండి. అయితే వారు తమంత తాము మహర్‌లో కొంత భాగాన్ని తమ ఇష్టపూర్వకంగా విడిచిపెడితే, దానిని మీరు సంతోషంగా అనుభవించండి.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَلَا تُؤْتُوا السُّفَهَاءَ أَمْوَالَكُمُ الَّتِي جَعَلَ اللَّهُ لَكُمْ قِيَامًا وَارْزُقُوهُمْ فِيهَا وَاكْسُوهُمْ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا5

అల్లాహ్ మీకు జీవనాధారంగా చేసిన సంపదను అవివేకులకు అప్పగించకండి. అయితే దానినుండి వారికి అన్న వస్త్రాలు కల్పించండి. వారికి హితబోధ చెయ్యండి.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَابْتَلُوا الْيَتَامَىٰ حَتَّىٰ إِذَا بَلَغُوا النِّكَاحَ فَإِنْ آنَسْتُم مِّنْهُمْ رُشْدًا فَادْفَعُوا إِلَيْهِمْ أَمْوَالَهُمْ ۖ وَلَا تَأْكُلُوهَا إِسْرَافًا وَبِدَارًا أَن يَكْبَرُوا ۚ وَمَن كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ ۖ وَمَن كَانَ فَقِيرًا فَلْيَأْكُلْ بِالْمَعْرُوفِ ۚ فَإِذَا دَفَعْتُمْ إِلَيْهِمْ أَمْوَالَهُمْ فَأَشْهِدُوا عَلَيْهِمْ ۚ وَكَفَىٰ بِاللَّهِ حَسِيبًا6

అనాథులకు పెళ్ళి ఈడు వచ్చేవరకు వారిని అజమాయిషీ చేస్తూ ఉండండి. వారిలో మీకు యోగ్యత కనిపించినపుడు వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారై తమ హక్కును కోరు తారేమో అని భయపడి వారి ఆస్తిని న్యాయసీమలను అతిక్రమించి తొందర తొందరగా ఎన్నడూ తినకండి. అనాథుల సంరక్షకుడు సంపన్నుడైతే, అతడు వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. ఒకవేళ అతడు పేదవాడైతే దాన్ని ధర్మసమ్మతంగా అనుభవించాలి. తరువాత వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి ఇతరులను సాక్షులుగా పెట్టండి. లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًا مَّفْرُوضًا7

తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది - అది తక్కువైనా సరే లేక ఎక్కువైనా సరే. ఈ భాగం (అల్లాహ్చే) నిర్ణయించబడిరది.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَإِذَا حَضَرَ الْقِسْمَةَ أُولُو الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينُ فَارْزُقُوهُم مِّنْهُ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا8

ఆస్తి పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు, అనాథులు, నిరుపేదలు వస్తే, ఆ ఆస్తినుండి వారికి కూడ కొంత ఇవ్వండి. వారిని మంచిమాటలతో పలుకరించండి.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

وَلْيَخْشَ الَّذِينَ لَوْ تَرَكُوا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعَافًا خَافُوا عَلَيْهِمْ فَلْيَتَّقُوا اللَّهَ وَلْيَقُولُوا قَوْلًا سَدِيدًا9

ప్రజలు ఈ విషయాన్ని గురించి ఆలోచించి భయపడాలి : ఒకవేళ వారే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపెట్టి వెళ్ళవలసివస్తే మరణ సమయంలో వారు ఆ పిల్లలను గురించి ఎంతగా ఆందోళన చెందేవారో! కనుక వారు అల్లాహ్ కు భయపడాలి. న్యాయం పలకాలి.

Syed Abul Aala Maudoodi

అన్-నిసా

إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ الْيَتَامَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًا10

అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు.

Syed Abul Aala Maudoodi