بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
حم1
హా. మీమ్.
Syed Abul Aala Maudoodi
تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْعَلِيمِ2
గ్రంథం అల్లాహ్ తరఫు నుండి అవతరించింది. ఆయన మహాశక్తిమంతుడు, మహాజ్ఞాని,
Syed Abul Aala Maudoodi
غَافِرِ الذَّنبِ وَقَابِلِ التَّوْبِ شَدِيدِ الْعِقَابِ ذِي الطَّوْلِ ۖ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ إِلَيْهِ الْمَصِيرُ3
పాపాలను క్షమించేవాడూ, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడూను కఠినంగా శిక్షించేవాడూ, ఘనంగా కరుణించేవాడూను. ఆయన తప్ప ఆరాధ్య దైవం మరెవ్వడూ లేడు. ఆయన వైపునకే అందరూ తిరిగి పోవలసి ఉన్నది.
Syed Abul Aala Maudoodi
مَا يُجَادِلُ فِي آيَاتِ اللَّهِ إِلَّا الَّذِينَ كَفَرُوا فَلَا يَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِي الْبِلَادِ4
ఒక్క అవిశ్వాసులు తప్ప మరెవ్వరూ అల్లాహ్ వాక్యాలను గురించి వివాదపడరు. కనుక ప్రపంచ దేశాలలోని వారు అట్టహాసంగా తిరగటాన్ని చూచి మీరు మోసపోకూడదు.
Syed Abul Aala Maudoodi
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَالْأَحْزَابُ مِن بَعْدِهِمْ ۖ وَهَمَّتْ كُلُّ أُمَّةٍ بِرَسُولِهِمْ لِيَأْخُذُوهُ ۖ وَجَادَلُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ فَأَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ عِقَابِ5
వారికి పూర్వం నూహ్ జాతి కూడ తిరస్కరించింది. దాని తరువాత ఎన్నో ఇతర వర్గాలు కూడ ఇలానే చేశాయి. ప్రతి జాతీ తన ప్రవక్తను నిర్బంధించేందుకు అతనిపై విరుచుకుపడిరది. వారందరూ కలిసి అసత్యమనే ఆయుధంతో సత్యాన్ని ఓడిరచటానికి ప్రయత్నిం చారు. కాని చివరకు నేను వారిని పట్టుకున్నాను. చూడండి, నా శిక్ష ఎంత కఠినమో.
Syed Abul Aala Maudoodi
وَكَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ أَصْحَابُ النَّارِ6
ఇదేవిధంగా అవిశ్వాసానికి పాల్పడిన వారందరిని గురించి, వారు నరకంలో ప్రవేశిస్తారని నీ ప్రభువు చేసిన తీర్పు కూడా నెరవేరింది.
Syed Abul Aala Maudoodi
الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ7
దైవ సింహాసనాన్ని మోసే దైవదూతలూ, ఆ సింహాసనం చుట్టూ ఉండే దైవదూతలూ, అందరూ తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయనను విశ్వసిస్తున్నారు, విశ్వసించేవారిని క్షమించు అని ప్రార్థనలు చేస్తున్నారు. వారు ఇలా అంటారు, ‘‘ప్రభూ! నీవు నీ కారుణ్యంతో, నీ జ్ఞానంతో ప్రతి వస్తువుపై వ్యాపించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలినవారిని, నీ మార్గాన్ని అనుసరించినవారిని క్షమించు. వారిని నరకయాతన నుండి కాపాడు,
Syed Abul Aala Maudoodi
رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ8
ప్రభూ! ఇంకా, వారిని శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలో ప్రవేశింపజెయ్యి వాటిని గురించి నీవు వారికి వాగ్దానం చేసి ఉన్నావు. వారి తల్లిదండ్రులలో, వారి భార్యలలో, వారి సంతానంలో సజ్జనులైన వారిని కూడ (వారితో పాటే అక్కడకు చేర్చు). నిస్సందేహంగా నీవు మహాశక్తిసంపన్నుడవు, మహా వివేకవంతుడవూను.
Syed Abul Aala Maudoodi
وَقِهِمُ السَّيِّئَاتِ ۚ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ9
వారిని చెడుల నుండి కాపాడు. ప్రళయం నాడు నీవు చెడుల నుండి కాపాడేవాడిని నీవు ఎంతో కరుణించావన్నమాట. ఇదే గొప్ప సాఫల్యం.
Syed Abul Aala Maudoodi
إِنَّ الَّذِينَ كَفَرُوا يُنَادَوْنَ لَمَقْتُ اللَّهِ أَكْبَرُ مِن مَّقْتِكُمْ أَنفُسَكُمْ إِذْ تُدْعَوْنَ إِلَى الْإِيمَانِ فَتَكْفُرُونَ10
అవిశ్వాసానికి పాల్పడిన వారిని ప్రళయం నాడు పిలిచి, ‘‘ఈనాడు మీకు మీ పట్ల ఎంత తీవ్రమైన కోపం వచ్చిందో, మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలువగా, మీరు నిరాకరించిననాడు అల్లాహ్ కు మీ పట్ల అంతకంటే తీవ్రంగానే కోపం వచ్చింది’’ అని అనటం జరుగుతుంది.
Syed Abul Aala Maudoodi