بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-షూరా

حم1

హా. మీమ్‌.

Syed Abul Aala Maudoodi

అల్-షూరా

عسق2

ఐన్‌. సీన్‌. ఖాఫ్‌.

Syed Abul Aala Maudoodi

అల్-షూరా

كَذَٰلِكَ يُوحِي إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ3

ఇదేవిధంగా శక్తిమంతుడూ, వివేకవం తుడూ అయిన అల్లాహ్ నీ వైపునకూ, నీకు పూర్వం గతించిన (దైవప్రవక్తల) వైపునకూ వహీ ద్వారా సందేశం పంపుతూ వచ్చాడు.

Syed Abul Aala Maudoodi

అల్-షూరా

لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ4

ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా ఆయనదే. ఆయన మహోన్నతుడు, మహిమాన్వితుడు.

Syed Abul Aala Maudoodi

అల్-షూరా

تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ مِن فَوْقِهِنَّ ۚ وَالْمَلَائِكَةُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيَسْتَغْفِرُونَ لِمَن فِي الْأَرْضِ ۗ أَلَا إِنَّ اللَّهَ هُوَ الْغَفُورُ الرَّحِيمُ5

త్వరలోనే ఆకాశం పైనుంచి బ్రద్దలైపోతుంది. దైవదూతలు తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు, భూలోక వాసులను మన్నించమని విన్నపాలు చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించే వాడూను అని తెలుసుకో.

Syed Abul Aala Maudoodi

అల్-షూరా

وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ اللَّهُ حَفِيظٌ عَلَيْهِمْ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ6

ఆయనను త్రోసిరాజని ఇతరులను తమ సంరక్ష కులుగా చేసుకున్న వారిని అల్లాహ్ కనిపెట్టే ఉన్నాడు. నీవు వారికి కాపలా దారువు కావు.

Syed Abul Aala Maudoodi

అల్-షూరా

وَكَذَٰلِكَ أَوْحَيْنَا إِلَيْكَ قُرْآنًا عَرَبِيًّا لِّتُنذِرَ أُمَّ الْقُرَىٰ وَمَنْ حَوْلَهَا وَتُنذِرَ يَوْمَ الْجَمْعِ لَا رَيْبَ فِيهِ ۚ فَرِيقٌ فِي الْجَنَّةِ وَفَرِيقٌ فِي السَّعِيرِ7

అవును, ప్రవక్తా! ఇదేవిధంగా, ఈ అరబ్బీ ఖురాన్‌ను మేము నీ వైపునకు వహీ ద్వారా పంపాము, నీవు జనపదాల కేంద్రం (మక్కా నగరం) లోనూ దాని పరిసరాలలోనూ ఉండే ప్రజలను హెచ్చరించాలనీ, సమావేశదినం గురించి వారిని భయపెట్టాలనీ అది వచ్చే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక వర్గం వారు స్వర్గానికిపోతారు, మరొక వర్గం వారు నరకానికి పోతారు.

Syed Abul Aala Maudoodi

అల్-షూరా

وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَهُمْ أُمَّةً وَاحِدَةً وَلَـٰكِن يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمُونَ مَا لَهُم مِّن وَلِيٍّ وَلَا نَصِيرٍ8

అల్లాహ్ కోరి ఉంటే, వారందరినీ ఒకే సంఘంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని తమ కృపకు పాత్రులను చేస్తాడు. దుర్మార్గు లను రక్షించేవాడుగానీ, వారికి సహాయపడే వాడు గానీ ఎవ్వడూ లేడు.

Syed Abul Aala Maudoodi

అల్-షూరా

أَمِ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۖ فَاللَّهُ هُوَ الْوَلِيُّ وَهُوَ يُحْيِي الْمَوْتَىٰ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ9

వారు (ఎంతటి అవివేకులు) ఆయనను కాదని ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారు? సంరక్షకుడు ఒక్క అల్లాహ్ మాత్రమే. ఆయనే మృతులను బ్రతికిస్తాడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలవాడు.

Syed Abul Aala Maudoodi

అల్-షూరా

وَمَا اخْتَلَفْتُمْ فِيهِ مِن شَيْءٍ فَحُكْمُهُ إِلَى اللَّهِ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبِّي عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ10

మీ మధ్య ఏ విషయంలో అభిప్రాయభేదం తలెత్తినా, దానిని గురించి తీర్పు చెప్పటం అల్లాహ్ పని. ఆ అల్లాహ్ యే నా ప్రభువు, ఆయననే నేను నమ్ముకున్నాను, ఆయన దెసకే నేను (పశ్చాత్తాపంతో) మరలుతాను.

Syed Abul Aala Maudoodi