بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా!
Syed Abul Aala Maudoodi
سورة الزخرف
إِنَّا جَعَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ3
మీరు అర్థం చేసుకోవాలని మేము దీనిని అరబ్బీ భాషలో ఖురానుగా చేశాము.
Syed Abul Aala Maudoodi
سورة الزخرف
وَإِنَّهُ فِي أُمِّ الْكِتَابِ لَدَيْنَا لَعَلِيٌّ حَكِيمٌ4
వాస్తవానికి ఇది మా వద్ద ఉన్న మాతృగ్రంథం (ఉమ్ముల్ కితాబ్)లో లిఖించబడి ఉన్నది మహో న్నతమైన స్థానం గల వివేకంతో నిండిన గ్రంథం అది.
Syed Abul Aala Maudoodi
سورة الزخرف
أَفَنَضْرِبُ عَنكُمُ الذِّكْرَ صَفْحًا أَن كُنتُمْ قَوْمًا مُّسْرِفِينَ5
ఇప్పుడు మేము మీతో విసిగిపోయి (కేవలం మీరు హద్దులు మీరి పోయారనే కారణంగా) ఈ హితబోధను మీ వద్దకు పంపటం మానెయ్యాలా?
Syed Abul Aala Maudoodi
سورة الزخرف
وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِيٍّ فِي الْأَوَّلِينَ6
పూర్వం గతించిన జాతుల వద్దకు కూడ మేము ఎంతోమంది ప్రవక్తలను పంపాము,
Syed Abul Aala Maudoodi
سورة الزخرف
وَمَا يَأْتِيهِم مِّن نَّبِيٍّ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ7
దైవప్రవక్త ఎవరైనా వారి వద్దకు రావటం, వారు అతనిని ఎగతాళి చేయకుండా ఉండటం అనేది ఎన్నడూ జరగలేదు.
Syed Abul Aala Maudoodi
سورة الزخرف
فَأَهْلَكْنَا أَشَدَّ مِنْهُم بَطْشًا وَمَضَىٰ مَثَلُ الْأَوَّلِينَ8
కనుక వీరికంటె ఎన్నోరెట్లు ఎక్కువ శక్తిమంతులైన వారిని మేము నాశనం చేశాము. పూర్వపు జాతుల దృష్టాంతాలు కాలగర్భంలో కలిసిపోయాయి.
Syed Abul Aala Maudoodi
سورة الزخرف
وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ9
ఒకవేళ నీవు వారిని, ‘‘భూమినీ, ఆకాశాలనూ ఎవడు సృష్టించాడు?’’ అని అడిగితే, స్వయంగా వారే, ‘‘వాటిని ఆ మహాబలవంతుడే, ఆ మహా జ్ఞానియే సృష్టించాడు’’ అని అంటారు.
Syed Abul Aala Maudoodi
سورة الزخرف
الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْدًا وَجَعَلَ لَكُمْ فِيهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ10
మీ కొరకు ఈ భూమిని ఊయలగా చేసినవాడూ, అందులో మీకై మార్గాలను ఏర్పరచినవాడూ - మీరు మీ గమ్యస్థానానికి చేరే మార్గం పొందాలని
Syed Abul Aala Maudoodi