بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అద్-దుఖాన్

حم1

హా. మీమ్‌.

Syed Abul Aala Maudoodi

అద్-దుఖాన్

وَالْكِتَابِ الْمُبِينِ2

స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అద్-దుఖాన్

إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ3

మేము దానిని ఎంతో మేలైన, అత్యంత శుభవంతమైన రాత్రివేళ అవతరింపజేశాము. ఎందుకంటే మేము ప్రజలను హెచ్చరించదలచాము.

Syed Abul Aala Maudoodi

అద్-దుఖాన్

فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ4

ఈ రాత్రే ప్రతి విషయానికీ సంబం ధించిన వివేకవంతమైన నిర్ణయం మా ఆజ్ఞానుసారం జారీ అవుతుంది.

Syed Abul Aala Maudoodi

అద్-దుఖాన్

أَمْرًا مِّنْ عِندِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ5

మేము ఒక ప్రవక్తను నీ ప్రభువు కారుణ్యంగా పంపాలనుకున్నాము.

Syed Abul Aala Maudoodi

అద్-దుఖాన్

رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ6

నిశ్చ యంగా ఆయన మాత్రమే అన్నీ వినేవాడు, అన్నీ ఎరిగినవాడు,

Syed Abul Aala Maudoodi

అద్-దుఖాన్

رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ7

ఆకాశాలకూ భూమికీ ప్రభువు, భూమ్యాకాశాల మధ్య ఉన్న ప్రతి వస్తువునకూ ప్రభువు - మీరు నిజంగా విశ్వాసులే అయితే (ఈ విషయాన్ని గ్రహించండి).

Syed Abul Aala Maudoodi

అద్-దుఖాన్

لَا إِلَـٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ8

ఆయన తప్ప ఆరాధ్యదైవం ఎవ్వడూ లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు, ఆయనే మరణాన్నీ ఇస్తాడు. ఆయనే మీ ప్రభువు, గతించిన మీ పూర్వికుల ప్రభువు.

Syed Abul Aala Maudoodi

అద్-దుఖాన్

بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ9

(కాని వాస్తవంగా వారికి నమ్మకం లేదు) అయితే వారు శంకతో ఆడుకుం టున్నారు.

Syed Abul Aala Maudoodi

అద్-దుఖాన్

فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُّبِينٍ10

సరే, స్పష్టమైన పొగను ఆకాశం తీసుకుని వచ్చే దినం కొరకు నిరీక్షించండి.

Syed Abul Aala Maudoodi