بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة محمد

الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ أَضَلَّ أَعْمَالَهُمْ1

అవిశ్వాసానికి పాల్పడి, (ప్రజలను) అల్లాహ్ మార్గం వైపునకు పోకుండా నిరోధించిన వారి కర్మలను అల్లాహ్ నిరర్థకమైనవిగా చేశాడు.

Syed Abul Aala Maudoodi

سورة محمد

وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَآمَنُوا بِمَا نُزِّلَ عَلَىٰ مُحَمَّدٍ وَهُوَ الْحَقُّ مِن رَّبِّهِمْ ۙ كَفَّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَأَصْلَحَ بَالَهُمْ2

విశ్వసించి, మంచిపనులు చేసినటువంటి, ముహమ్మద్‌పై అవతరించినది - అది పూర్తిగా సత్యమేనని, అది వారి ప్రభువు వద్దనుండి వచ్చినదని - నమ్మినటువంటి వారి నుండి అల్లాహ్ వారి చెడుగులను దూరం చేసి, వారి స్థితిని చక్కబరిచాడు.

Syed Abul Aala Maudoodi

سورة محمد

ذَٰلِكَ بِأَنَّ الَّذِينَ كَفَرُوا اتَّبَعُوا الْبَاطِلَ وَأَنَّ الَّذِينَ آمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِن رَّبِّهِمْ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ لِلنَّاسِ أَمْثَالَهُمْ3

దానికి కారణం అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించుటయే. విశ్వాసులు ఈ విధంగా తమ ప్రభువు వద్దనుండి వచ్చిన సత్యాన్ని అనుసరించుటయే. అల్లాహ్, ప్రజలకు తమ నిజమైన స్థానం ఏమిటో తెలియజేస్తాడు.

Syed Abul Aala Maudoodi

سورة محمد

فَإِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا فَضَرْبَ الرِّقَابِ حَتَّىٰ إِذَا أَثْخَنتُمُوهُمْ فَشُدُّوا الْوَثَاقَ فَإِمَّا مَنًّا بَعْدُ وَإِمَّا فِدَاءً حَتَّىٰ تَضَعَ الْحَرْبُ أَوْزَارَهَا ۚ ذَٰلِكَ وَلَوْ يَشَاءُ اللَّهُ لَانتَصَرَ مِنْهُمْ وَلَـٰكِن لِّيَبْلُوَ بَعْضَكُم بِبَعْضٍ ۗ وَالَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ فَلَن يُضِلَّ أَعْمَالَهُمْ4

కనుక మీరు ఈ అవిశ్వాసులతో తలపడినప్పుడు, వారి మెడలను ఖండిరచటమే మీరు చేయవలసిన మొదటి పని. చివరకు మీరు వారిని పూర్తిగా అణచివేసిన తరువాత, ఖైదీలను గట్టిగా బంధించండి. ఆ తరువాత (మీకు ఇలా చేసే అధికారం ఉంది). వారికి మేలైనా చేయండి లేదా వారి నుండి పరిహారం (సొమ్ము) తీసుకొని వదలివేయండి. యుద్ధంలో తన ఆయుధాలు క్రిందపడవేసే వరకు (ఇలా జరగాలి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలచుకుంటే స్వయంగా ఆయనే వారిని ఎదుర్కొనేవాడు. అయితే మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఈ పద్ధతిని అవలంబించాడు). అల్లాహ్ తన మార్గంలో చంపబడిన వారి కర్మలను ఎంతమాత్రం వ్యర్థం చేయడు.

Syed Abul Aala Maudoodi

سورة محمد

سَيَهْدِيهِمْ وَيُصْلِحُ بَالَهُمْ5

ఆయన వారికి మార్గం చూపుతాడు, వారి స్థితిని చక్కబరుస్తాడు,

Syed Abul Aala Maudoodi

سورة محمد

وَيُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ6

తాను వారికి తెలియజేసిన స్వర్గంలో వారిని ప్రవేశింపజేస్తాడు.

Syed Abul Aala Maudoodi

سورة محمد

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تَنصُرُوا اللَّهَ يَنصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ7

విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు సహాయం చేస్తే, ఆయన మీకు సహాయం చేస్తాడు, మీ పాదాలను స్థిరంగా ఉంచుతాడు.

Syed Abul Aala Maudoodi

سورة محمد

وَالَّذِينَ كَفَرُوا فَتَعْسًا لَّهُمْ وَأَضَلَّ أَعْمَالَهُمْ8

ఇక అవిశ్వాసుల విషయానికి వస్తే, వారికి వినాశం తప్పదు. అల్లాహ్ వారి కర్మలను తోవ దప్పించాడు.

Syed Abul Aala Maudoodi

سورة محمد

ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ9

ఎందుకంటే వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అంగీక రించలేదు. కనుక అల్లాహ్ వారి కర్మలను వ్యర్థపరిచాడు.

Syed Abul Aala Maudoodi

سورة محمد

۞ أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ دَمَّرَ اللَّهُ عَلَيْهِمْ ۖ وَلِلْكَافِرِينَ أَمْثَالُهَا10

వారికి పూర్వం గతించిన ప్రజల పర్యవసానం ఎలా జరిగిందో చూసేందుకు వారు భూమిపై సంచరించలేదా? అల్లాహ్ వారిని సమూ లంగా తుడిచిపెట్టాడు. ఇటువంటి ఫలితాలే ఈ అవిశ్వాసులకు వ్రాసిపెట్టబడి ఉన్నాయి.

Syed Abul Aala Maudoodi