بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِينًا1
ప్రవక్తా! మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము,
Syed Abul Aala Maudoodi
لِّيَغْفِرَ لَكَ اللَّهُ مَا تَقَدَّمَ مِن ذَنبِكَ وَمَا تَأَخَّرَ وَيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكَ وَيَهْدِيَكَ صِرَاطًا مُّسْتَقِيمًا2
అల్లాహ్ నీ పూర్వపు పొరపాట్లను, భావికాలపు పొరపాట్లను మన్నించాలని, నీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయాలని, నీకు ఋజుమార్గం చూపాలని,
Syed Abul Aala Maudoodi
وَيَنصُرَكَ اللَّهُ نَصْرًا عَزِيزًا3
నీకు గొప్ప సహాయం చేయాలని.
Syed Abul Aala Maudoodi
هُوَ الَّذِي أَنزَلَ السَّكِينَةَ فِي قُلُوبِ الْمُؤْمِنِينَ لِيَزْدَادُوا إِيمَانًا مَّعَ إِيمَانِهِمْ ۗ وَلِلَّهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا4
ఆయనే విశ్వాసుల హృదయాలపై సకీనత్ (శాంతి సంతృప్తుల)ను అవతరింపజేశాడు, తమ విశ్వాసానికి వారు అదనంగా మరొక విశ్వాసాన్ని కలుపుకోవాలని. భూమిలోని, ఆకాశాలలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. ఆయన జ్ఞానీ మరియు వివేకి.
Syed Abul Aala Maudoodi
لِّيُدْخِلَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَيُكَفِّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ ۚ وَكَانَ ذَٰلِكَ عِندَ اللَّهِ فَوْزًا عَظِيمًا5
(ఆయన ఇలా ఎందుకు చేశాడంటే) విశ్వాసులైన పురుషులూ, స్త్రీలూ శాశ్వతంగా ఉండేటందుకు ఆయన వారిని క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేయాలని వారి పాపాలను వారి నుండి దూరం చేయాలని- అల్లాహ్ దృష్టిలో ఇది గొప్ప విజయం
Syed Abul Aala Maudoodi
وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا6
అల్లాహ్ విషయంలో కుశంకలు గల కపటులైన పురుషులను, స్త్రీలను మరియు బహుదైవోపాసకులైన పురుషులను, స్త్రీలను శిక్షించాలని. చెడుల వలయంలోకి స్వయంగా వారే వచ్చిపడ్డారు. అల్లాహ్ ఆగ్రహం వారిపై పడిరది, ఆయన వారిని శపించాడు, వారికై నరకాన్ని సిద్ధం చేశాడు. అది మహాచెడ్డ నివాసం.
Syed Abul Aala Maudoodi
وَلِلَّهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا7
భూమ్యాకాశాలలోని సైన్యాలు అన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. ఆయన శక్తిమంతుడు, వివేకవంతుడూను.
Syed Abul Aala Maudoodi
إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا8
ప్రవక్తా! మేము నిన్ను సాక్షి (షాహిద్) గాను, శుభవార్త అందజేసేవాని గానూ, హెచ్చరిక చేసేవానిగానూ చేసి పంపాము.
Syed Abul Aala Maudoodi
لِّتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ وَتُسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا9
ఎందుకంటే, ప్రజలారా! మీరు అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించాలని, (ప్రవక్తకు) సహకరిం చాలని, అతనిని గౌరవించాలని ఉదయం, సాయంత్రం అల్లాహ్ ను స్తుతించా లని.
Syed Abul Aala Maudoodi
إِنَّ الَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ اللَّهَ يَدُ اللَّهِ فَوْقَ أَيْدِيهِمْ ۚ فَمَن نَّكَثَ فَإِنَّمَا يَنكُثُ عَلَىٰ نَفْسِهِ ۖ وَمَنْ أَوْفَىٰ بِمَا عَاهَدَ عَلَيْهُ اللَّهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًا10
ప్రవక్తా! నీతో విధేయతా ప్రమాణం చేసినవారు నిజానికి అల్లాహ్తో విధేయతా ప్రమాణం చేశారు. వారి చేతులపై అల్లాహ్ హస్తం ఉన్నది. ఇప్పుడిక ఎవడు ఈ ప్రమాణాన్ని భంగపరుస్తాడో, అతడి ప్రమాణభంగం వల్ల కలిగే కీడు స్వయంగా అతడినే చుట్టుకుంటుంది. ఎవడు తాను అల్లాహ్తో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటాడో, అతనికి అల్లాహ్ త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Syed Abul Aala Maudoodi