بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-హుజురాత్

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ1

విశ్వాసులారా! అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ ముందు నడవకండి. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ సమస్తమూ వినేవాడు, సర్వమూ ఎరిగినవాడూను.

Syed Abul Aala Maudoodi

అల్-హుజురాత్

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ2

విశ్వాసులారా! మీ కంఠస్వరాన్ని ప్రవక్త కంఠస్వరం కంటే పెంచకండి. మీరు పరస్పరం మాట్లాడుకునే విధంగా ప్రవక్తతో బిగ్గరగా మాట్లాడకండి, దానివల్ల, బహుశా మీరు చేసినదంతా మీకు తెలియకుండానే వ్యర్థమైపోవచ్చు.

Syed Abul Aala Maudoodi

అల్-హుజురాత్

إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِندَ رَسُولِ اللَّهِ أُولَـٰئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ3

ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియకపోవచ్చు. ప్రవక్త సన్నిధిలో తమ కంఠస్వరాన్ని తగ్గించి మాట్లాడేవారి హృదయాలనే వాస్తవానికి భయభక్తుల విషయంలో అల్లాహ్ పరీక్షించాడు. వారికి క్షమాభిక్ష, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి.

Syed Abul Aala Maudoodi

అల్-హుజురాత్

إِنَّ الَّذِينَ يُنَادُونَكَ مِن وَرَاءِ الْحُجُرَاتِ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ4

ప్రవక్తా! నిన్ను నీ గృహాల బయటినుండి బిగ్గరగా పిలిచేవారిలో అనేకులు బుద్ధిహీనులు.

Syed Abul Aala Maudoodi

అల్-హుజురాత్

وَلَوْ أَنَّهُمْ صَبَرُوا حَتَّىٰ تَخْرُجَ إِلَيْهِمْ لَكَانَ خَيْرًا لَّهُمْ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ5

వారు గనక నీవు బయటకు వచ్చేవరకు ఓపికపట్టి ఉంటే, అది వారికే శ్రేయస్కరముగా ఉండేది. అల్లాహ్ మన్నించేవాడు, కరుణామయుడూను.

Syed Abul Aala Maudoodi

అల్-హుజురాత్

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن جَاءَكُمْ فَاسِقٌ بِنَبَإٍ فَتَبَيَّنُوا أَن تُصِيبُوا قَوْمًا بِجَهَالَةٍ فَتُصْبِحُوا عَلَىٰ مَا فَعَلْتُمْ نَادِمِينَ6

విశ్వాసులారా! ఎవడైనా దుర్మార్గుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే, నిజానిజాలు విచారించి తెలుసుకోండి. లేకపోతే మీకు తెలియకుండానే మీరు ఏదైనా వర్గానికి నష్టం కలిగించవచ్చు, తరువాత చేసినదానికి పశ్చాత్తాపపడవలసి రావచ్చు.

Syed Abul Aala Maudoodi

అల్-హుజురాత్

وَاعْلَمُوا أَنَّ فِيكُمْ رَسُولَ اللَّهِ ۚ لَوْ يُطِيعُكُمْ فِي كَثِيرٍ مِّنَ الْأَمْرِ لَعَنِتُّمْ وَلَـٰكِنَّ اللَّهَ حَبَّبَ إِلَيْكُمُ الْإِيمَانَ وَزَيَّنَهُ فِي قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَـٰئِكَ هُمُ الرَّاشِدُونَ7

మీ మధ్య అల్లాహ్ ప్రవక్త ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తు ఉంచుకోండి, ఒకవేళ ప్రవక్త గనక అనేక వ్యవహారాలలో మీ మాట విన్నట్లయితే, మీరే స్వయంగా కష్టాలలో పడిపోతారు. కాని అల్లాహ్ మీలో విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేశాడు, దానిని మీకు మనోరంజకమైనదిగా చేశాడు. అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతలపట్ల మీకు వెగటు కలిగేలా చేశాడు.

Syed Abul Aala Maudoodi

అల్-హుజురాత్

فَضْلًا مِّنَ اللَّهِ وَنِعْمَةً ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ8

అటువంటి ప్రజలే అల్లాహ్ అనుగ్రహం వల్ల, ఆయన మహోపకారం వల్ల సన్మార్గగాములయ్యారు. అల్లాహ్ సర్వజ్ఞాని, మహావివేకీను.

Syed Abul Aala Maudoodi

అల్-హుజురాత్

وَإِن طَائِفَتَانِ مِنَ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا ۖ فَإِن بَغَتْ إِحْدَاهُمَا عَلَى الْأُخْرَىٰ فَقَاتِلُوا الَّتِي تَبْغِي حَتَّىٰ تَفِيءَ إِلَىٰ أَمْرِ اللَّهِ ۚ فَإِن فَاءَتْ فَأَصْلِحُوا بَيْنَهُمَا بِالْعَدْلِ وَأَقْسِطُوا ۖ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ9

ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాలవారు పరస్పరం పోట్లాడుకుంటే, వారి మధ్య రాజీ కుదిరించండి. తరువాత, ఒకవేళ వారిలో ఒక వర్గం వారు రెండో వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసినవారు అల్లాహ్ ఆజ్ఞ వైపునకు మరలేవరకు వారికి వ్యతిరేకంగా పోరాడండి. తరువాత వారు గనక మరలివస్తే, వారి మధ్య రాజీ కుదర్చండి. న్యాయం చేయండి, ఎందుకంటే అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు.

Syed Abul Aala Maudoodi

అల్-హుజురాత్

إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ10

విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి. అల్లాహ్ కు భయపడండి, మీపై దయచూపటం జరగవచ్చు.

Syed Abul Aala Maudoodi