بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَوْفُوا بِالْعُقُودِ ۚ أُحِلَّتْ لَكُم بَهِيمَةُ الْأَنْعَامِ إِلَّا مَا يُتْلَىٰ عَلَيْكُمْ غَيْرَ مُحِلِّي الصَّيْدِ وَأَنتُمْ حُرُمٌ ۗ إِنَّ اللَّهَ يَحْكُمُ مَا يُرِيدُ1
విశ్వాసులారా! కట్టుబాట్లను పూర్తిగా పాటించండి. మీ కొరకు పశువులను పోలిన జంతువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చెయ్యబడ్డాయి - ముందు మీకు తెలుపబడబోయేవి తప్ప. కాని ఇహ్రామ్ స్థితిలో వేటను మీ కొరకు ధర్మసమ్మతం చేసుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ తాను కోరిన ఆజ్ఞను జారీ చేస్తాడు.
Syed Abul Aala Maudoodi
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحِلُّوا شَعَائِرَ اللَّهِ وَلَا الشَّهْرَ الْحَرَامَ وَلَا الْهَدْيَ وَلَا الْقَلَائِدَ وَلَا آمِّينَ الْبَيْتَ الْحَرَامَ يَبْتَغُونَ فَضْلًا مِّن رَّبِّهِمْ وَرِضْوَانًا ۚ وَإِذَا حَلَلْتُمْ فَاصْطَادُوا ۚ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ أَن صَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ أَن تَعْتَدُوا ۘ وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ2
విశ్వసించిన ప్రజలారా! దైవభక్తి చిహ్నాలను అగౌరవపరచకండి-నిషిద్ధ మాసాలలో ఏ మాసాన్నీ ధర్మ సమ్మతం చేసుకోకండి. ఖుర్బానీ పశువులపై చెయ్యి చేసుకోకండి. అల్లాహ్ మొక్కుబడికి సూచనగా మెడలలో పట్టెడలు కలిగివున్న జంతువులను ముట్టుకోకండి. తమ ప్రభువు అనుగ్రహాన్ని, ఆయన సంతోషాన్ని అన్వేషిస్తూ పవిత్ర మందిరం (కాబా) వైపునకు పోయేవారి జోలికి పోకండి. అయితే ఇహ్రామ్ స్థితి సమాప్తమయిన తరువాత మీరు వేటాడవచ్చు - చూడండి! మిమ్మల్ని మస్జిదె హరామ్కు పోనియ్యకుండా ఒక వర్గంవారు నిరోధించారని వారిపై ఆగ్రహించి, ఆవేశంలో మీరూ వారిపై అనుచితమైన దౌర్జన్యానికి పాల్పడకండి. కాని మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరి తోనూ సహకరించండి. పాప కార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. అల్లాహ్ కు భయపడండి. ఆయన శిక్ష బహు కఠినమైనది.
Syed Abul Aala Maudoodi
حُرِّمَتْ عَلَيْكُمُ الْمَيْتَةُ وَالدَّمُ وَلَحْمُ الْخِنزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ وَالْمُنْخَنِقَةُ وَالْمَوْقُوذَةُ وَالْمُتَرَدِّيَةُ وَالنَّطِيحَةُ وَمَا أَكَلَ السَّبُعُ إِلَّا مَا ذَكَّيْتُمْ وَمَا ذُبِحَ عَلَى النُّصُبِ وَأَن تَسْتَقْسِمُوا بِالْأَزْلَامِ ۚ ذَٰلِكُمْ فِسْقٌ ۗ الْيَوْمَ يَئِسَ الَّذِينَ كَفَرُوا مِن دِينِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ ۚ الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا ۚ فَمَنِ اضْطُرَّ فِي مَخْمَصَةٍ غَيْرَ مُتَجَانِفٍ لِّإِثْمٍ ۙ فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ3
మీకు ఇవి నిషేధించబడినాయి - మృత పశువు, రక్తము, పంది మాంసము, అల్లాహ్ పేరుతో కాక మరెవరి పేరుతోనైనా ‘జిబప్ా’ చెయ్యబడిన పశువు, ఊపిరాడక లేక దెబ్బతిని, ఎత్తు ప్రదేశం నుండి పడి లేక దేన్నయినా ఢీకొని లేక అడవి మృగం చీల్చగా మరణించిన జంతువు - సజీవంగా ఉండి మీరు ‘జిబప్ా’ చేసినది తప్ప - బలిపీఠంపై వధింపబడినది. ఇంకా పాచికల ద్వారా అదృష్టం తెలుసు కోవటం కూడ మీకు నిషేధించబడిరది. ఇవన్నీ పాపకృత్యాలు. ఈనాడు అవిశ్వాసులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులుకున్నారు. కనుక మీరు వారికి భయపడకండి. నాకు భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీకొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. మీ కొరకు ఇస్లామ్ను మీ ధర్మంగా అంగీకరించాను. (కనుక మీకు విధించబడిన హరామ్, హలాల్ నియమాలను పాటించండి) అయితే, ఎవరైనా ఆకలివల్ల గత్యంతరం లేని పరిస్థితిలో, పాపం వైపునకు మొగ్గకుండా వీటిలోని ఏ వస్తువునైనా తిన్నట్లయితే, అల్లాహ్ క్షమించేవాడూ, కరుణించేవాడూను.
Syed Abul Aala Maudoodi
يَسْأَلُونَكَ مَاذَا أُحِلَّ لَهُمْ ۖ قُلْ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۙ وَمَا عَلَّمْتُم مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِينَ تُعَلِّمُونَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللَّهُ ۖ فَكُلُوا مِمَّا أَمْسَكْنَ عَلَيْكُمْ وَاذْكُرُوا اسْمَ اللَّهِ عَلَيْهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ4
ప్రజలు తమ కొరకు ఏది హలాల్ చెయ్యబడిరది అని అడుగుతారు. ఇలా బోధించు : పరిశుభ్రమైన వస్తువులన్నీ మీ కొరకు హలాల్ చెయ్యబడ్డాయి. మీరు తర్ఫీదు ఇచ్చిన వేట జంతువులు - దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మీరు వేటాడే తర్ఫీదును ఇచ్చినవి - అవి మీ కొరకు పట్టిన జంతువును కూడ మీరు తినవచ్చు. కాని దానిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. అల్లాహ్ శాసనాన్ని ఉల్లంఘించేందుకు భయపడండి. లెక్క తీసుకోవాలంటే అల్లాహ్ కు ఎంతోసేపు పట్టదు.
Syed Abul Aala Maudoodi
الْيَوْمَ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۖ وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَّكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَّهُمْ ۖ وَالْمُحْصَنَاتُ مِنَ الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ وَلَا مُتَّخِذِي أَخْدَانٍ ۗ وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ5
ఈనాడు మీ కొరకు పరిశుభ్రమైన వస్తువులన్నీ హలాల్ చెయ్యబడ్డాయి. గ్రంథ ప్రజల భోజనం మీకు హలాల్ మీ భోజనం వారికి హలాల్. సుచరితలైన స్త్రీలు కూడ మీకు హలాల్, వారు విశ్వాసుల వర్గానికి చెందినవారైనా సరే లేక మీకు పూర్వం గ్రంథం పొందిన జాతులకు చెందినవారైనా సరే. కాని మీరు వారి మహరును చెల్లించి వివాహం చేసుకుని వారికి రక్షకులు కావాలి. అంతేగాని, వారితో స్వేచ్ఛా కామక్రీడలకు పాల్పడటంగాని లేక దొంగచాటు సంబంధాలను పెంచుకోవటంగాని చెయ్యరాదు. విశ్వాస వైఖరిని అవలంబించటానికి తిరస్కరించేవాడు తన జీవితంలో సాధించినదంతా వ్యర్థం అవుతుంది. ఇంకా అతడు పరలోకంలో దివాలా తీస్తాడు.
Syed Abul Aala Maudoodi
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ ۚ مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَـٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ6
విశ్వసించిన ప్రజలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు, మీ ముఖాలను, చేతులను మోచేతుల వరకు ప్రక్షాళనం చేసుకోండి తలపై చేతులతో రాయండి, కాళ్ళను చీలమండ వరకు కడుక్కోండి. మీరు అపరిశుద్ధంగా ఉంటే, స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. మీరు గనక అస్వస్థులైతే లేక ప్రయాణస్థితిలో ఉంటే లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలను ముట్టుకుంటే, అప్పుడు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో విధిని నిర్వహించండి దానిపై చేతులతో కొట్టి మీ ముఖాలపై, చేతులపై రాయండి. మీకు జీవితాన్ని కష్టతరం చేయటం అల్లాహ్ అభిమతం కాదు. కాని ఆయన మిమ్మల్ని పరిశుద్ధం చేయగోరుతున్నాడు, మీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయగోరుతున్నాడు మీరు కృతజ్ఞులవుతారేమో అని.
Syed Abul Aala Maudoodi
وَاذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ وَمِيثَاقَهُ الَّذِي وَاثَقَكُم بِهِ إِذْ قُلْتُمْ سَمِعْنَا وَأَطَعْنَا ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ7
అల్లాహ్ మీకు ప్రసాదించిన వరాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మీనుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని మరువకండి. అంటే, మీరు ఇలా అన్నారు : ‘‘మేము విన్నాము, విధేయత చూపటానికి అంగీకరించాము.’’ అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ కు హృదయాలలో ఉన్న మర్మాలు కూడా తెలుసు.
Syed Abul Aala Maudoodi
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ لِلَّهِ شُهَدَاءَ بِالْقِسْطِ ۖ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ عَلَىٰ أَلَّا تَعْدِلُوا ۚ اعْدِلُوا هُوَ أَقْرَبُ لِلتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ8
విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. (ఏదైనా) వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయి న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చెయ్యండి. ఇది దైవభక్తికి సరిసమానమైనది. అల్లాహ్ కు భయపడుతూ వ్యవహరించండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు పూర్తిగా తెలుసు.
Syed Abul Aala Maudoodi
وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۙ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ9
విశ్వసించి మంచిపనులు చేసేవారికి అల్లాహ్ వాగ్దానం చేశాడు, వారి పాపాలకు క్షమాభిక్ష, వారికి గొప్ప బహుమానం లభిస్తాయని.
Syed Abul Aala Maudoodi
وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ10
ఇక అవిశ్వాసానికి పాల్పడేవారు, అల్లాహ్ ఆయతులను నిరాకరించేవారు నరకానికి పోతారు.
Syed Abul Aala Maudoodi