بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
ق ۚ وَالْقُرْآنِ الْمَجِيدِ1
ఖాఫ్. మహోన్నతమైన ఖురాన్ సాక్షిగా-
Syed Abul Aala Maudoodi
بَلْ عَجِبُوا أَن جَاءَهُم مُّنذِرٌ مِّنْهُمْ فَقَالَ الْكَافِرُونَ هَـٰذَا شَيْءٌ عَجِيبٌ2
అయితే, హెచ్చరిక చేసేవాడు స్వయంగా వారిలో నుండే వారివద్దకు వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది.
Syed Abul Aala Maudoodi
أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ۖ ذَٰلِكَ رَجْعٌ بَعِيدٌ3
తరువాత సత్య తిరస్కారులు ఇలా అనసాగారు, ‘‘మేము మరణించి మట్టిగా మారిపోయినప్పటికీ, (మళ్లీ బ్రతికింపబడతామా?) ఇది చాల విచిత్రంగా ఉంది.ఈ తిరుగు ప్రయాణం అనేది బుద్ధికి అందని విషయం.
Syed Abul Aala Maudoodi
قَدْ عَلِمْنَا مَا تَنقُصُ الْأَرْضُ مِنْهُمْ ۖ وَعِندَنَا كِتَابٌ حَفِيظٌ4
(వాస్తవానికి) వారి శరీరాలలో నుండి భూమి తినేదంతా మాకు తెలుసు. మా వద్ద ఒక గ్రంథం ఉన్నది, అందులో అంతా సురక్షితంగా ఉన్నది.
Syed Abul Aala Maudoodi
بَلْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ فَهُمْ فِي أَمْرٍ مَّرِيجٍ5
కాని వారు, సత్యం వారి వద్దకు వచ్చినప్పుడే దానిని బాహాటంగా తిరస్క రించారు. ఈ కారణంవల్లనే వారు ఇప్పుడు చిక్కులలో పడిపోయారు.
Syed Abul Aala Maudoodi
أَفَلَمْ يَنظُرُوا إِلَى السَّمَاءِ فَوْقَهُمْ كَيْفَ بَنَيْنَاهَا وَزَيَّنَّاهَا وَمَا لَهَا مِن فُرُوجٍ6
సరే, అయితే వారు తమపై ఉన్న ఆకాశం వైపు ఎన్నడూ చూడలేదా? మేము దానిని ఎలా నిర్మించి, అలంకరించామో? అందులో ఎలాంటి పగుళ్లూ లేవు.
Syed Abul Aala Maudoodi
وَالْأَرْضَ مَدَدْنَاهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَاسِيَ وَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ بَهِيجٍ7
మేము భూమిని పరిచాము, అందులో పర్వతాలను స్థిరపరచాము. అందులో మనోహరమైన అన్నిరకాల వృక్షజాతులను మొలకెత్తించాము.
Syed Abul Aala Maudoodi
تَبْصِرَةً وَذِكْرَىٰ لِكُلِّ عَبْدٍ مُّنِيبٍ8
(సత్యం వైపునకు) మరలే ప్రతి దాసునికి ఇవన్నీ కళ్లు తెరిపించేవీ, గుణపాఠం నేర్పేవీ అయిన విషయాలు.
Syed Abul Aala Maudoodi
وَنَزَّلْنَا مِنَ السَّمَاءِ مَاءً مُّبَارَكًا فَأَنبَتْنَا بِهِ جَنَّاتٍ وَحَبَّ الْحَصِيدِ9
ఆకాశం నుండి మేము శుభవంతమైన నీటిని అవతరింపజేశాము. తరువాత దానిద్వారా తోటలనూ, పంట ధాన్యాలనూ,
Syed Abul Aala Maudoodi
وَالنَّخْلَ بَاسِقَاتٍ لَّهَا طَلْعٌ نَّضِيدٌ10
ఎంతో పొడవైన ఖర్జూరపు వృక్షాలనూ పుట్టించాము. వాటికి పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి.
Syed Abul Aala Maudoodi