بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-కమర్

اقْتَرَبَتِ السَّاعَةُ وَانشَقَّ الْقَمَرُ1

ప్రళయ గడియ దగ్గరకు వచ్చేసింది.చంద్రుడు చీలిపోయాడు.

Syed Abul Aala Maudoodi

అల్-కమర్

وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُّسْتَمِرٌّ2

కాని వారి పరిస్థితి ఎలా ఉందంటే, వారు ఏ సూచనను చూచినా తమ ముఖాలను తిప్పుకుంటున్నారు. ఇది నడుస్తున్న మంత్రజాలమే అని అంటున్నారు.

Syed Abul Aala Maudoodi

అల్-కమర్

وَكَذَّبُوا وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ ۚ وَكُلُّ أَمْرٍ مُّسْتَقِرٌّ3

వారు (దీనిని కూడా) తిరస్కరించారు, తమ మనోవాంఛలను అనుసరించారు. ప్రతి వ్యవహారం చివరకు ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది.

Syed Abul Aala Maudoodi

అల్-కమర్

وَلَقَدْ جَاءَهُم مِّنَ الْأَنبَاءِ مَا فِيهِ مُزْدَجَرٌ4

వారి ముందుకు (పూర్వపు జాతుల స్థితిగతులు వచ్చాయి తలబిరుసు తనం నుండి వారిని దూరంగా ఉంచటానికి

Syed Abul Aala Maudoodi

అల్-కమర్

حِكْمَةٌ بَالِغَةٌ ۖ فَمَا تُغْنِ النُّذُرُ5

వాటిలో కావలసినంత గుణపాఠం ఉంది హితబోధ లక్ష్యం చాల వరకు నెరవేరటానికి కావలసిన వివేకమూ ఉంది. కాని హెచ్చరికలు వారి మీద పనిచేయటం లేదు.

Syed Abul Aala Maudoodi

అల్-కమర్

فَتَوَلَّ عَنْهُمْ ۘ يَوْمَ يَدْعُ الدَّاعِ إِلَىٰ شَيْءٍ نُّكُرٍ6

కనుక ప్రవక్తా! వారినుండి ముఖం త్రిప్పుకో. పిలిచేవాడు దుర్భరమైన, భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున,

Syed Abul Aala Maudoodi

అల్-కమర్

خُشَّعًا أَبْصَارُهُمْ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ كَأَنَّهُمْ جَرَادٌ مُّنتَشِرٌ7

ప్రజలు బిక్కచచ్చిన చూపులతో తమ సమాధుల నుండి, చెల్లా చెదరైపోయిన మిడుతల మాదిరిగా బయల్పడతారు

Syed Abul Aala Maudoodi

అల్-కమర్

مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَـٰذَا يَوْمٌ عَسِرٌ8

పిలిచే వాని వైపునకు పరుగెత్తుతూ ఉంటారు. (ఈ విషయాన్ని ప్రపంచంలో నిరాకరిస్తూ ఉండిన) తిరస్కారులే అప్పుడు, ‘‘ఈ రోజుమటుకు చాల కఠినమైన రోజు’’ అని అంటారు.

Syed Abul Aala Maudoodi

అల్-కమర్

۞ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ فَكَذَّبُوا عَبْدَنَا وَقَالُوا مَجْنُونٌ وَازْدُجِرَ9

వారికి పూర్వం నూహ్ జాతి వారు తిరస్కరించారు. వారు మా భక్తుణ్ణి అసత్యవాదిగా నిర్ణయించి, ఇతడు పిచ్చివాడు అని అన్నారు. అతను దారుణంగా కసిరికొట్టబడ్డాడు.

Syed Abul Aala Maudoodi

అల్-కమర్

فَدَعَا رَبَّهُ أَنِّي مَغْلُوبٌ فَانتَصِرْ10

చివరకు అతను తన ప్రభువును ఇలా వేడు కున్నాడు, ‘‘నేను ఓడిపోయాను. ఇక నీవే వారికి ప్రతీకారం చేయి.’’

Syed Abul Aala Maudoodi