بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-హదీద్

سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ1

భూమిలోనూ, ఆకాశాలలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే శక్తిమంతుడు, వివేకవంతుడూను.

Syed Abul Aala Maudoodi

అల్-హదీద్

لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ2

భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు ఆయనే. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, మరణాన్ని కలిగిస్తున్నాడు, ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు.

Syed Abul Aala Maudoodi

అల్-హదీద్

هُوَ الْأَوَّلُ وَالْآخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ3

ఆయనే ఆరంభమూ, ఆయనే అంతమూ ఆయనే బాహ్యమూ, ఆయనే గూఢమూ. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు.

Syed Abul Aala Maudoodi

అల్-హదీద్

هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ4

ఆయనే ఆకాశాలనూ, భూమినీ, ఆరు దినాలలో సృష్టించాడు, తరువాత అధికార పీఠాన్ని అధిష్టించాడు. భూమి లోపలకు పోయేదీ, అందులో నుండి వెలుపలకు వచ్చేదీ, ఆకాశం నుండి దిగేదీ, దాని లోపలకు ఎక్కేదీ, అంతా ఆయన జ్ఞాన పరిధిలో ఉన్నది. మీరు ఎక్కడ ఉన్నా ఆయన మీతో ఉన్నాడు. మీరు ఏ పని చేస్తూ ఉన్నా, దానిని ఆయన చూస్తున్నాడు.

Syed Abul Aala Maudoodi

అల్-హదీద్

لَّهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ5

ఆయనే భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి. సమస్త వ్యవహారాలు నిర్ణయ నిమిత్తం ఆయన వైపునకే తీసుకుపోబడతాయి.

Syed Abul Aala Maudoodi

అల్-హదీద్

يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۚ وَهُوَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ6

ఆయనే రాత్రిని పగలులోకి పగలును రాత్రిలోకి ప్రవేశింపజేస్తాడు. హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఆయన ఎరుగును.

Syed Abul Aala Maudoodi

అల్-హదీద్

آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَأَنفِقُوا مِمَّا جَعَلَكُم مُّسْتَخْلَفِينَ فِيهِ ۖ فَالَّذِينَ آمَنُوا مِنكُمْ وَأَنفَقُوا لَهُمْ أَجْرٌ كَبِيرٌ7

అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించండి. ఆయన మిమ్మల్ని ఏ వస్తువులపై ఖలీఫా (ప్రతినిధి)గా నియమించాడో, వాటిలో నుండి ఖర్చు పెట్టండి. మీలో విశ్వసించి ధనం ఖర్చుపెట్టే వారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది.

Syed Abul Aala Maudoodi

అల్-హదీద్

وَمَا لَكُمْ لَا تُؤْمِنُونَ بِاللَّهِ ۙ وَالرَّسُولُ يَدْعُوكُمْ لِتُؤْمِنُوا بِرَبِّكُمْ وَقَدْ أَخَذَ مِيثَاقَكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ8

మీకు ఏమయింది, అల్లాహ్ ను మీరు విశ్వసించరు? వాస్తవానికి ప్రవక్త, మీ ప్రభువును విశ్వసించండని మీకు పిలుపునిస్తున్నాడు, ఆయన మీచేత ప్రమాణం చేయించుకున్నాడు,

Syed Abul Aala Maudoodi

అల్-హదీద్

هُوَ الَّذِي يُنَزِّلُ عَلَىٰ عَبْدِهِ آيَاتٍ بَيِّنَاتٍ لِّيُخْرِجَكُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَإِنَّ اللَّهَ بِكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ9

మీరు నిజమైన విశ్వాసులే అయితే. తన దాసునిపై స్పష్టమైన వాక్యాలను అవతరింపజేస్తూ ఉన్నవాడు అల్లాహ్ యే. ఆయన వాటి ద్వారా మిమ్మల్ని చీకట్ల నుండి వెలుగులోకి తీసుకురాదలచుకున్నాడు. యథార్థం ఏమిటంటే, అల్లాహ్ కు మీరంటే ఎంతో వాత్సల్యం, ఎంతో దయ ఉన్నాయి.

Syed Abul Aala Maudoodi

అల్-హదీద్

وَمَا لَكُمْ أَلَّا تُنفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا يَسْتَوِي مِنكُم مَّنْ أَنفَقَ مِن قَبْلِ الْفَتْحِ وَقَاتَلَ ۚ أُولَـٰئِكَ أَعْظَمُ دَرَجَةً مِّنَ الَّذِينَ أَنفَقُوا مِن بَعْدُ وَقَاتَلُوا ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ10

అసలు మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టకపోవటానికి కారణం ఏమిటి? వాస్తవానికి భూమీ, ఆకాశముల వారసత్వం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మీలో విజయం తరువాత ఖర్చు పెట్టినవారు, జిహాద్‌ చేసినవారు, విజయానికి పూర్వం ఖర్చుపెట్టిన వారితో, జిహాద్‌ చేసిన వారితో ఎన్నటికీ సమానులు కాలేరు. వారి అంతస్తు, తరువాత ఖర్చుపెట్టిన వారికంటే, జిహాద్‌ చేసినవారి కంటే గొప్పది. అయినా అల్లాహ్ ఉభయులకూ మంచివాగ్దానాలు చేసి ఉన్నాడు. మీరు చేసిన దానిని అల్లాహ్ బాగా ఎరుగును.

Syed Abul Aala Maudoodi