بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-హష్ర్

سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ1

ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్నే స్తుతి స్తోంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడూను.

Syed Abul Aala Maudoodi

అల్-హష్ర్

هُوَ الَّذِي أَخْرَجَ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ مِن دِيَارِهِمْ لِأَوَّلِ الْحَشْرِ ۚ مَا ظَنَنتُمْ أَن يَخْرُجُوا ۖ وَظَنُّوا أَنَّهُم مَّانِعَتُهُمْ حُصُونُهُم مِّنَ اللَّهِ فَأَتَاهُمُ اللَّهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوا ۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ الرُّعْبَ ۚ يُخْرِبُونَ بُيُوتَهُم بِأَيْدِيهِمْ وَأَيْدِي الْمُؤْمِنِينَ فَاعْتَبِرُوا يَا أُولِي الْأَبْصَارِ2

ఆయనే గ్రంథ ప్రజలలోని తిరస్కారులను మొదటి దెబ్బలోనే వారి గృహాలనుండి గెంటివేశాడు. వారు వెళ్ళిపోతారని మీరు ఏమాత్రం ఊహించి ఉండలేదు. వారు కూడ తమను అల్లాహ్ నుండి తమ కోటలు రక్షిస్తాయని భావించారు. కాని అల్లాహ్ వారిపైకి వారు ఊహించని దిశనుండి వచ్చాడు. ఆయన వారి హృదయాలలో బెదురు పుట్టించాడు. తత్ఫలితంగా వారు తమ ఇళ్లను తమ చేతులారా కూడా నాశనం చేసుకున్నారు. విశ్వాసుల చేతుల ద్వారా కూడా నాశనం చేయించుకున్నారు. కనుక కళ్లున్న ప్రజలారా! గుణపాఠం నేర్చుకోండి.

Syed Abul Aala Maudoodi

అల్-హష్ర్

وَلَوْلَا أَن كَتَبَ اللَّهُ عَلَيْهِمُ الْجَلَاءَ لَعَذَّبَهُمْ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابُ النَّارِ3

ఒకవేళ అల్లాహ్ దేశబహిష్కార విషయాన్ని వారి నొసట వ్రాసి ఉండకపోతే, ప్రపంచంలోనే ఆయన వారిని శిక్షించి ఉండేవాడు. పరలోకంలో వారి కొరకు నరక శిక్ష ఉండనే ఉంది.

Syed Abul Aala Maudoodi

అల్-హష్ర్

ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّهَ وَرَسُولَهُ ۖ وَمَن يُشَاقِّ اللَّهَ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ4

వారు అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించి నందువల్లనే ఇదంతా జరిగింది. అల్లాహ్ ను ఎవడు వ్యతిరేకిం చినా, వాడిని అల్లాహ్ చాల కఠినంగా శిక్షిస్తాడు.

Syed Abul Aala Maudoodi

అల్-హష్ర్

مَا قَطَعْتُم مِّن لِّينَةٍ أَوْ تَرَكْتُمُوهَا قَائِمَةً عَلَىٰ أُصُولِهَا فَبِإِذْنِ اللَّهِ وَلِيُخْزِيَ الْفَاسِقِينَ5

మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో లేక ఏ ఖర్జూరపు చెట్లను వాటి వ్రేళ్లపై యథాతథంగా ఉండనిచ్చారో, ఇదంతా అల్లాహ్ ఆజ్ఞతోనే జరిగింది. (అల్లాహ్ ఈ ఆజ్ఞను) దుర్మార్గులను అవమానపరచేందుకు (ఇచ్చాడు).

Syed Abul Aala Maudoodi

అల్-హష్ర్

وَمَا أَفَاءَ اللَّهُ عَلَىٰ رَسُولِهِ مِنْهُمْ فَمَا أَوْجَفْتُمْ عَلَيْهِ مِنْ خَيْلٍ وَلَا رِكَابٍ وَلَـٰكِنَّ اللَّهَ يُسَلِّطُ رُسُلَهُ عَلَىٰ مَن يَشَاءُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ6

ఏ ఆస్తులను అల్లాహ్, వారి అధీనంలో నుండి తీసుకుని తన ప్రవక్త వైపునకు తరలించాడో, అవి మీరు మీ గుర్రాలనూ, ఒంటెలనూ పరుగెత్తించగా లభించినటువంటి ఆస్తులు కావు. అల్లాహ్ తన ప్రవక్తలకు తాను కోరిన వారిపై ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నాడు.

Syed Abul Aala Maudoodi

అల్-హష్ర్

مَّا أَفَاءَ اللَّهُ عَلَىٰ رَسُولِهِ مِنْ أَهْلِ الْقُرَىٰ فَلِلَّهِ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ كَيْ لَا يَكُونَ دُولَةً بَيْنَ الْأَغْنِيَاءِ مِنكُمْ ۚ وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ7

అల్లాహ్ ఇతర వాడల ప్రజల నుండి దేనినయితే తన ప్రవక్త వైపునకు మరలిస్తాడో, అందులో అల్లాహ్ కు, ప్రవక్తకు, బంధువులకు, అనాధులకు, నిరుపేదలకు, బాటసారులకు హక్కు ఉన్నది. అది మీ ధనికుల మధ్యనే తిరగకుండా ఉండేందుకు ఇలా నిర్ణయించబడిరది. దైవప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికిపోకండి. అల్లాహ్ కు భయపడండి, అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.

Syed Abul Aala Maudoodi

అల్-హష్ర్

لِلْفُقَرَاءِ الْمُهَاجِرِينَ الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأَمْوَالِهِمْ يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا وَيَنصُرُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَـٰئِكَ هُمُ الصَّادِقُونَ8

(ఇంకా ఆ ఆస్తులలో) తమ ఇళ్లనుండీ, తమ ఆస్తిపాస్తుల నుండీ తరిమివేయబడిన నిరుపేద శరణార్ధులకు కూడ హక్కు ఉంది. వారు అల్లాహ్ అనుగ్రహాన్నీ, ఆయన ప్రసన్నతనూ కోరుకుంటున్నారు. ఇంకా వారు అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ సహాయ పడేందుకు సదా సంసిద్ధంగా ఉంటారు. వారే ఋజువర్తనులు.

Syed Abul Aala Maudoodi

అల్-హష్ర్

وَالَّذِينَ تَبَوَّءُوا الدَّارَ وَالْإِيمَانَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمْ حَاجَةً مِّمَّا أُوتُوا وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ9

(ఇంకా ఆ ఆస్తులలో) ఈ శరణార్థుల రాకకు పూర్వమే, విశ్వసించి వలస కేంద్రంలో స్థిరపడిన వారికి కూడ హక్కు ఉంది. వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. వారికి ఏది ఇవ్వబడినా, దాని అవసరం సైతం ఉన్నట్లుగా వారు తమ మనస్సులలో భావించరు. వారు స్వయంగా అగత్యం కలవారైనప్పటికీ, తమకంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వాస్తవానికి హృదయ లోభత్వం నుండి రక్షింపబడినవారే సాఫల్యం పొందేవారు.

Syed Abul Aala Maudoodi

అల్-హష్ర్

وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ10

(ఇంకా ఆ ఆస్తులలో) వారి తరువాత వచ్చిన వారికి కూడ హక్కు ఉంది. వారు ఇలా అంటారు, ‘‘ఓ ప్రభూ! మమ్మల్నీ, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులంద రినీ, క్షమించు, మా హృదయాలలో విశ్వాసులపట్ల ఎలాంటి ద్వేషాన్నీ కలిగిం చకు. మా ప్రభూ! నీవు చాలా కనికరించేవాడవు, కరుణామయుడవూను.’’

Syed Abul Aala Maudoodi