بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا عَدُوِّي وَعَدُوَّكُمْ أَوْلِيَاءَ تُلْقُونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوا بِمَا جَاءَكُم مِّنَ الْحَقِّ يُخْرِجُونَ الرَّسُولَ وَإِيَّاكُمْ ۙ أَن تُؤْمِنُوا بِاللَّهِ رَبِّكُمْ إِن كُنتُمْ خَرَجْتُمْ جِهَادًا فِي سَبِيلِي وَابْتِغَاءَ مَرْضَاتِي ۚ تُسِرُّونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَأَنَا أَعْلَمُ بِمَا أَخْفَيْتُمْ وَمَا أَعْلَنتُمْ ۚ وَمَن يَفْعَلْهُ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ1
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గనక నా మార్గంలో జిహాద్ చేయటానికీ, నా ప్రసన్నతను పొందటానికీ (స్వస్థలాన్ని విడిచి ఇళ్లనుండి) బయలుదేరినపుడు నాకూ, మీకూ శత్రువులైన వారితో స్నేహం చేయకండి. అసలు మీరు వారితో స్నేహం ఎలా చేస్తారు మీ వద్దకు వచ్చిన సత్యాన్ని వారు విశ్వసించటానికి నిరాకరించారు కదా! కేవలం మీరు మీ ప్రభువైన అల్లాహ్ ను విశ్వసించారనే నేరంపై వారు దైవప్రవక్తనూ, స్వయంగా మిమ్మల్నీ దేశబహిష్కరణకు గురిచేశారు. ఇదీ వారి వైఖరి. ఇలాంటి వారికి మీరు రహస్యంగా స్నేహ సందేశం పంపుతారా? వాస్తవానికి మీరు రహస్యంగా చేసేది, బహిరంగంగా చేసేది అంతా నాకు బాగా తెలుసు. మీలో అలా ఎవరు చేసినా అతను నిశ్చయంగా ఋజుమార్గం తప్పిపోయినట్లే.
Syed Abul Aala Maudoodi
إِن يَثْقَفُوكُمْ يَكُونُوا لَكُمْ أَعْدَاءً وَيَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ وَأَلْسِنَتَهُم بِالسُّوءِ وَوَدُّوا لَوْ تَكْفُرُونَ2
వారి వైఖరి ఎలా ఉందంటే ఒకవేళ మీపై అదుపు సాధిస్తే, వారు మీకు విరోధులై పోయి, చేష్టలతో, మాటలతో మిమ్మల్ని వేధిస్తారు. మీరు ఎలాగైనా సరే అవిశ్వాసులై పోవాలని వారు కోరుతున్నారు.
Syed Abul Aala Maudoodi
لَن تَنفَعَكُمْ أَرْحَامُكُمْ وَلَا أَوْلَادُكُمْ ۚ يَوْمَ الْقِيَامَةِ يَفْصِلُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ3
ప్రళయం నాడు మీ బంధుత్వాలు గానీ, మీ సంతానం గానీ ఏ విధంగానూ పనికిరావు. ఆ రోజున అల్లాహ్ మీ మధ్య ఎడబాటు కలిగిస్తాడు ఆయనే మీ కర్మలను చూసేవాడు.
Syed Abul Aala Maudoodi
قَدْ كَانَتْ لَكُمْ أُسْوَةٌ حَسَنَةٌ فِي إِبْرَاهِيمَ وَالَّذِينَ مَعَهُ إِذْ قَالُوا لِقَوْمِهِمْ إِنَّا بُرَآءُ مِنكُمْ وَمِمَّا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَاءُ أَبَدًا حَتَّىٰ تُؤْمِنُوا بِاللَّهِ وَحْدَهُ إِلَّا قَوْلَ إِبْرَاهِيمَ لِأَبِيهِ لَأَسْتَغْفِرَنَّ لَكَ وَمَا أَمْلِكُ لَكَ مِنَ اللَّهِ مِن شَيْءٍ ۖ رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ4
ఇబ్రాహీమ్‌లో ఆయన సహచరులలో మీకై ఒక మంచి ఆదర్శం ఉన్నది. వారు తమ జాతివారితో స్పష్టంగా ఇలా అన్నారు, ‘‘మీపట్ల, దేవుణ్ణి వదలి మీరు పూజించే ఇతర దైవాల పట్ల మేము పూర్తిగా విసిగిపోయాము. మేము మిమ్మల్ని తిరస్కరించాము. మీరు ఏకైక ప్రభువైన అల్లాహ్ ను విశ్వసించనంతవరకు మాకూ మీకూ మధ్య విరోధ, విద్వేషాలు ఉండిపోతాయి. అయితే ఇబ్రాహీమ్ తన తండ్రితో ఇలా అనటం, ‘‘నేను మీ మన్నింపుకొరకు తప్పకుండా అల్లాహ్ కు విన్నవిస్తాను. మీ కొరకు అల్లాహ్నుండి మరేదీ పొందే అధికారం నాకు లేదు.’’ (ఈ విషయం దీనినుండి మినహాయించబడిరది). (ఇబ్రాహీమ్ మరియు అతని అనుయాయులు ఇలా ప్రార్థించారు), ‘‘మా ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాము, నీ వైపునకే మేము మరలాము, నీ సన్నిధికే మేము మరలిరావలసి ఉన్నది.
Syed Abul Aala Maudoodi
رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا ۖ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ5
ప్రభూ! మమ్మల్ని అవిశ్వాసుల కొరకు పరీక్షా విషయంగా చేయకు. ప్రభూ! మా తప్పులను మన్నించు, నిస్సందేహంగా నీవే మహాశక్తి సంపన్నుడవు, గొప్ప వివేకవంతుడవూను.’’
Syed Abul Aala Maudoodi
لَقَدْ كَانَ لَكُمْ فِيهِمْ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ ۚ وَمَن يَتَوَلَّ فَإِنَّ اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ6
వారి జీవన సరళిలోనే మీకూ, అల్లాహ్నూ అంతిమదినాన్నీ నమ్ముకున్న ప్రతి వ్యక్తికీ గొప్ప ఆదర్శం ఉన్నది. ఎవడైనా దీనికి విముఖుడైతే, అల్లాహ్ ఏ అవసరమూ లేనివాడు, స్వతహాగా ప్రశంసనీయుడు (అని వారు తెలుసు కోవాలి).
Syed Abul Aala Maudoodi
۞ عَسَى اللَّهُ أَن يَجْعَلَ بَيْنَكُمْ وَبَيْنَ الَّذِينَ عَادَيْتُم مِّنْهُم مَّوَدَّةً ۚ وَاللَّهُ قَدِيرٌ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ7
మీరు ఈనాడు ఎవరితో విరోధం కొని తెచ్చుకున్నారో, వారికీ మీకూ మధ్య ఎప్పుడో ఒకప్పుడు అల్లాహ్, ప్రేమను కలిగించటం అసంభవమేమీ కాదు. అల్లాహ్ సర్వశక్తిమంతుడు ఇంకా ఆయన క్షమించేవాడు, కరుణించేవాడూను.
Syed Abul Aala Maudoodi
لَّا يَنْهَاكُمُ اللَّهُ عَنِ الَّذِينَ لَمْ يُقَاتِلُوكُمْ فِي الدِّينِ وَلَمْ يُخْرِجُوكُم مِّن دِيَارِكُمْ أَن تَبَرُّوهُمْ وَتُقْسِطُوا إِلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ8
ఎవరైతే ధర్మం విషయంలో మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్లనుండి వెళ్లగొట్టలేదో, వారిపట్ల మీరు మంచితనంతో, న్యాయంతో వ్యవహ రించటాన్ని అల్లాహ్ నిరోధించడు. అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు.
Syed Abul Aala Maudoodi
إِنَّمَا يَنْهَاكُمُ اللَّهُ عَنِ الَّذِينَ قَاتَلُوكُمْ فِي الدِّينِ وَأَخْرَجُوكُم مِّن دِيَارِكُمْ وَظَاهَرُوا عَلَىٰ إِخْرَاجِكُمْ أَن تَوَلَّوْهُمْ ۚ وَمَن يَتَوَلَّهُمْ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ9
ఎవరు మీతో ధర్మం విషయంలో యుద్ధం చేశారో, మిమ్మల్ని మీ ఇళ్లనుండి బహిష్కరించారో, మిమ్మల్ని బహిష్కరించటంలో పరస్పరం సహకరించు కున్నారో, వారితో మీరు స్నేహం చేయటాన్ని మాత్రం అల్లాహ్ వారిస్తున్నాడు. అటువంటి వారితో స్నేహం చేసేవారే దుర్మార్గులు.
Syed Abul Aala Maudoodi
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا جَاءَكُمُ الْمُؤْمِنَاتُ مُهَاجِرَاتٍ فَامْتَحِنُوهُنَّ ۖ اللَّهُ أَعْلَمُ بِإِيمَانِهِنَّ ۖ فَإِنْ عَلِمْتُمُوهُنَّ مُؤْمِنَاتٍ فَلَا تَرْجِعُوهُنَّ إِلَى الْكُفَّارِ ۖ لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ يَحِلُّونَ لَهُنَّ ۖ وَآتُوهُم مَّا أَنفَقُوا ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ أَن تَنكِحُوهُنَّ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ ۚ وَلَا تُمْسِكُوا بِعِصَمِ الْكَوَافِرِ وَاسْأَلُوا مَا أَنفَقْتُمْ وَلْيَسْأَلُوا مَا أَنفَقُوا ۚ ذَٰلِكُمْ حُكْمُ اللَّهِ ۖ يَحْكُمُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ10
విశ్వసించిన ప్రజలారా! విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలసవచ్చి నప్పుడు (వారు విశ్వసించిన వారవునో కాదో) పరీక్షించి తెలుసుకోండి. వారి విశ్వాసం ఎంత వాస్తవమైనదో అల్లాహ్ యే బాగా ఎరుగును. తరువాత, వారు విశ్వసించినవారే అని మీకు తెలిస్తే, వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. వారూ అవిశ్వాసులకు ధర్మసమ్మతం కారు, అవిశ్వాసులూ వారికి ధర్మసమ్మతం కారు, అవిశ్వాసులైన వారి భర్తలు వారికిచ్చిన ‘మహర్’ను వారికి తిరిగి ఇచ్చివెయ్యండి. మీరు వారికి ఇవ్వవలసిన మహర్‌ను వారికి ఇచ్చివేస్తే, అప్పుడు మీరు వారిని వివాహమాడటంలో దోషం లేదు. స్వయంగా మీరు కూడ అవిశ్వాసులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఆపివుంచకండి. అవిశ్వాసులైన మీ భార్యలకు మీరు ఇచ్చిన మహర్‌ను అడిగి వెనక్కి తీసుకోండి. అలాగే అవిశ్వాసులు విశ్వాసినులైన తమ భార్యలకు ఇచ్చిన మహర్‌ను వారు తిరిగి తీసుకోవచ్చు. ఇది అల్లాహ్ ఆజ్ఞ. ఆయన మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. ఆయన సర్వమూ తెలిసినవాడు వివేకవంతుడూను.
Syed Abul Aala Maudoodi