بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة الصف

سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ1

ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్నే స్తుతిస్తోంది. ఆయన ఆధిక్యత కలవాడు, వివేకవంతుడూను.

Syed Abul Aala Maudoodi

سورة الصف

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِمَ تَقُولُونَ مَا لَا تَفْعَلُونَ2

విశ్వాసులారా! మీరు చేయని విషయాన్ని చేస్తాము అని చెబుతారెం దుకు?

Syed Abul Aala Maudoodi

سورة الصف

كَبُرَ مَقْتًا عِندَ اللَّهِ أَن تَقُولُوا مَا لَا تَفْعَلُونَ3

మీరు చేయని దానిని చేస్తాము అని చెప్పటం అల్లాహ్ దృష్టిలో అత్యంత అప్రియమైన విషయం.

Syed Abul Aala Maudoodi

سورة الصف

إِنَّ اللَّهَ يُحِبُّ الَّذِينَ يُقَاتِلُونَ فِي سَبِيلِهِ صَفًّا كَأَنَّهُم بُنْيَانٌ مَّرْصُوصٌ4

అసలు అల్లాహ్ కు ఆయన మార్గంలో సీసంతో పోసిన గోడవలె దృఢమైనబారులు తీరి నిలబడి పోరాడే వారంటేనే ఇష్టం.

Syed Abul Aala Maudoodi

سورة الصف

وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ لِمَ تُؤْذُونَنِي وَقَد تَّعْلَمُونَ أَنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ ۖ فَلَمَّا زَاغُوا أَزَاغَ اللَّهُ قُلُوبَهُمْ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ5

మూసా తన జాతివారితో అన్న ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో ‘‘ఓ నాజాతి ప్రజలారా! మీరు నన్ను ఎందుకు వేధిస్తున్నారు? నేను మీ వద్దకు అల్లాహ్చే పంపబడిన ప్రవక్తనని మీకు తెలుసుకదా!’’ ఆ తరువాత వారు వక్రమార్గాన్ని అవలంబించినప్పుడు, అల్లాహ్ కూడా వారి హృదయాలను వక్రీకరించాడు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.

Syed Abul Aala Maudoodi

سورة الصف

وَإِذْ قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ يَا بَنِي إِسْرَائِيلَ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُم مُّصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَمُبَشِّرًا بِرَسُولٍ يَأْتِي مِن بَعْدِي اسْمُهُ أَحْمَدُ ۖ فَلَمَّا جَاءَهُم بِالْبَيِّنَاتِ قَالُوا هَـٰذَا سِحْرٌ مُّبِينٌ6

మర్యమ్‌ కుమారుడు ఈసా అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో, ‘‘ఓ ఇస్రాయీల్‌ సంతతి వారలారా! నేను మీ వద్దకు అల్లాహ్చే పంపబడిన సందేశహరుణ్ణి నాకు పూర్వం వచ్చిన తౌరాత్‌ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను నా తరువాత అహ్మద్‌ అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను. అయితే ఆయన (ముహమ్మద్‌ - సఅసమ్‌) వారి వద్దకు స్పష్టమైన సూచనలను తెచ్చినప్పుడు, వారు ఇది పూర్తిగా మోసమే అని అన్నారు,

Syed Abul Aala Maudoodi

سورة الصف

وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُوَ يُدْعَىٰ إِلَى الْإِسْلَامِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ7

ఇక ఇస్లామ్‌ (అల్లాహ్ కు తనను తాను సమర్పించుకోవటం) సందేశం అందజేయబడుతున్నప్పటికీ, అల్లాహ్ పై అపనిందలు మోపేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.

Syed Abul Aala Maudoodi

سورة الصف

يُرِيدُونَ لِيُطْفِئُوا نُورَ اللَّهِ بِأَفْوَاهِهِمْ وَاللَّهُ مُتِمُّ نُورِهِ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ8

వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పగోరుతున్నారు. కాని అవిశ్వాసు లకు ఎంత అనిష్టంగా ఉన్నాసరే అల్లాహ్ తన జ్యోతిని పూర్తిగా వ్యాపింపజేయ టానికే నిర్ణయించుకున్నాడు.

Syed Abul Aala Maudoodi

سورة الصف

هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ9

ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపాడు. దానిని సకల ధర్మాలపై ఆధిక్యం వహించే ధర్మంగా చేయటానికి ఇది బహుదైవారాధకులకు ఎంత అనిష్టమైనాసరే.

Syed Abul Aala Maudoodi

سورة الصف

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا هَلْ أَدُلُّكُمْ عَلَىٰ تِجَارَةٍ تُنجِيكُم مِّنْ عَذَابٍ أَلِيمٍ10

విశ్వసించిన ఓ ప్రజలారా! మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వ్యాపారమేమిటో నేను మీకు తెలుపనా?

Syed Abul Aala Maudoodi