بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-జుముఅ

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ1

ఆకాశాలలోని ప్రతివస్తువూ, భూమిలోని ప్రతి వస్తువూ అల్లాహ్ ను స్తుతి స్తోంది. ఆయన విశ్వసమ్రాట్టు, ఎంతో పరిశుద్ధుడు, అత్యంత శక్తిమంతుడు, వివేకవంతుడు.

Syed Abul Aala Maudoodi

అల్-జుముఅ

هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ2

ఆయనే నిరక్షరాస్యులలో (ఉమ్మీలు) ఒక ప్రవక్తను స్వయంగా వారి నుండే లేపాడు. ఆ ప్రవక్త వారికి ఆయన వాక్యాలను వినిపిస్తున్నాడు, వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్నీ బోధిస్తున్నాడు. వాస్తవానికి దీనికి పూర్వం వారు పూర్తిగా మార్గం తప్పి ఉన్నారు.

Syed Abul Aala Maudoodi

అల్-జుముఅ

وَآخَرِينَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوا بِهِمْ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ3

ఇంకా వారితో చేరని ఇతరుల కొరకు కూడ (ఈ ప్రవక్త ప్రభవించబడ్డాడు). అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు, వివేకవంతుడూను.

Syed Abul Aala Maudoodi

అల్-జుముఅ

ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ4

ఇది ఆయన అనుగ్రహం, తాను కోరినవారికి దానిని ప్రసాదిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహశాలి.

Syed Abul Aala Maudoodi

అల్-జుముఅ

مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا ۚ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ5

తౌరాత్‌ గ్రంథబాధ్యతా భారం మోపబడినప్పటికీ, దానిని మోయనివారు, పుస్తకాల బరువును మోసే గాడిదను పోలి ఉన్నారు. అల్లాహ్ వాక్యాలను తిరస్కరించిన వారి పోలిక దీనికంటె కూడ ఘోరమైనది. ఇటువంటి దుర్మార్గు లకు అల్లాహ్ సన్మార్గం చూపడు.

Syed Abul Aala Maudoodi

అల్-జుముఅ

قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِن زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّهِ مِن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ6

వారితో ఇలా అను, ‘‘యూదులై పోయిన ప్రజలారా! ఒకవేళ మిగతా ప్రజలందరికంటే మీరు మాత్రమే అల్లాహ్ కు ప్రియమైనవారు అనే గర్వం మీకు ఉంటే, చావును కోరుకోండి. మీరు పలికే ఈ ప్రగల్భాలు, నిజమేఅయితే, ఈ పని చెయ్యండి.’’

Syed Abul Aala Maudoodi

అల్-జుముఅ

وَلَا يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۚ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ7

కాని వారు తాము చేసుకున్న అకృత్యాల కారణంగా చావును ఎన్నటికీ కోరుకోరు. అల్లాహ్ ఈ దుర్మార్గులను బాగా ఎరుగును.

Syed Abul Aala Maudoodi

అల్-జుముఅ

قُلْ إِنَّ الْمَوْتَ الَّذِي تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُ مُلَاقِيكُمْ ۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ8

వారికి ఇలా చెప్పు: ‘‘ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో, అది మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆ తరువాత మీరు రహస్య విషయాలు, బహిరంగ విషయాలు అన్నింటినీ ఎరిగినవారి ముందు హాజరుపరచబడతారు. అప్పుడు ఆయన మీకు మీరేమేమి చేస్తూ ఉండేనారో అవన్నీ తెలుపుతాడు.’’

Syed Abul Aala Maudoodi

అల్-జుముఅ

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ9

విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి క్రయవిక్రయాలను వదలిపెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది.

Syed Abul Aala Maudoodi

అల్-జుముఅ

فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ10

ఆపై నమాజు ముగిసిన తరువాత భూమిపై వ్యాపించండి, అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి, బహుశా మీకు సాఫల్యభాగ్యం కలుగవచ్చు.

Syed Abul Aala Maudoodi