بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-తలాక్

يَا أَيُّهَا النَّبِيُّ إِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحْصُوا الْعِدَّةَ ۖ وَاتَّقُوا اللَّهَ رَبَّكُمْ ۖ لَا تُخْرِجُوهُنَّ مِن بُيُوتِهِنَّ وَلَا يَخْرُجْنَ إِلَّا أَن يَأْتِينَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَتِلْكَ حُدُودُ اللَّهِ ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ اللَّهِ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ لَا تَدْرِي لَعَلَّ اللَّهَ يُحْدِثُ بَعْدَ ذَٰلِكَ أَمْرًا1

ఓ ప్రవక్తా! మీరు గనక స్త్రీలకు విడాకులివ్వవలసి వస్తే, వారి నిర్ణీత గడువు (ఇద్దత్‌) కొరకు విడాకులివ్వండి, మరియు నిర్ణీత గడువు కాలాన్ని కచ్చితంగా లెక్కపెట్టండి మీ ప్రభువైన అల్లాహ్ కు భయపడండి. (ఆ గడువు కాలంలో) వారేదైనా స్పష్టమైన చెడుకు పాల్పడితే తప్ప, మీరూ వారిని వారి ఇళ్లనుండి వెళ్లగొట్టకూడదు, స్వయంగా వారు కూడ పోకూడదు. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. ఎవడు అల్లాహ్ నిర్ణయించిన హద్దులను అతిక్రమిస్తాడో, అతడు స్వయంగా తనకు తానే అన్యాయం చేసుకుంటాడు. మీకు తెలియదు, బహుశా దీని తరువాత అల్లాహ్ ఏదైనా అనుకూల మార్గం చూపించవచ్చు.

Syed Abul Aala Maudoodi

అల్-తలాక్

فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ فَارِقُوهُنَّ بِمَعْرُوفٍ وَأَشْهِدُوا ذَوَيْ عَدْلٍ مِّنكُمْ وَأَقِيمُوا الشَّهَادَةَ لِلَّهِ ۚ ذَٰلِكُمْ يُوعَظُ بِهِ مَن كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَمَن يَتَّقِ اللَّهَ يَجْعَل لَّهُ مَخْرَجًا2

తరువాత వారి నిర్ణీత గడువు కాలం ముగిసినప్పుడు, వారిని ఉత్తమమైన రీతిలో (మీ వివాహబంధంలో) ఆపి వుంచండి లేదా ఉత్తమమైన రీతిలో వారి నుంచి విడిపొండి. మీలో న్యాయశీలురైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి. (ఓ సాక్షులారా) అల్లాహ్ కొరకు ఉన్నది ఉన్నట్లుగా సాక్ష్యం చెప్పండి.అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తున్న ప్రతివానికి ఈ విషయాలు బోధించబడుతున్నాయి. ఎవడు అల్లాహ్ కు భయపడుతూ పనిచేస్తాడో, అతనికి అల్లాహ్ కష్టాల నుండి గట్టెక్కే మార్గం చూపుతాడు.

Syed Abul Aala Maudoodi

అల్-తలాక్

وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ۚ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ ۚ إِنَّ اللَّهَ بَالِغُ أَمْرِهِ ۚ قَدْ جَعَلَ اللَّهُ لِكُلِّ شَيْءٍ قَدْرًا3

ఇంకా అతని ఊహకు కూడ అందనటువంటి మార్గం ద్వారా, అతనికి ఉపాధి ప్రసాదిస్తాడు. అల్లాహ్ ను నమ్ముకున్నవానికి అల్లాహ్ యే చాలు. అల్లాహ్ తన పనిని పూర్తి చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతిదానికి ఒక విధి నిర్ణయించి ఉంచాడు.

Syed Abul Aala Maudoodi

అల్-తలాక్

وَاللَّائِي يَئِسْنَ مِنَ الْمَحِيضِ مِن نِّسَائِكُمْ إِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلَاثَةُ أَشْهُرٍ وَاللَّائِي لَمْ يَحِضْنَ ۚ وَأُولَاتُ الْأَحْمَالِ أَجَلُهُنَّ أَن يَضَعْنَ حَمْلَهُنَّ ۚ وَمَن يَتَّقِ اللَّهَ يَجْعَل لَّهُ مِنْ أَمْرِهِ يُسْرًا4

మీ స్త్రీలలో ఎవరైనా ఋతుక్రమం విషయంలో ఆశ వదలుకుంటే వారి విషయంలో మీకేదైనా అనుమానం కలిగితే, అప్పుడు వారి నిర్ణీత గడువు మూడు మాసాలు (అని మీరు తెలుసుకోండి). ఇదే ఆజ్ఞ ఇంకా ఋతుక్రమం ప్రారంభం కాని వారికి కూడ వర్తిస్తుంది. గర్భిణీ స్త్రీల నిర్ణీత గడువు వారి కాన్పు అయ్యేవరకు ఉంటుంది. ఎవడు అల్లాహ్ కు భయ పడతాడో, అతని వ్యవహారంలో అల్లాహ్ సౌలభ్యం కలుగజేస్తాడు.

Syed Abul Aala Maudoodi

అల్-తలాక్

ذَٰلِكَ أَمْرُ اللَّهِ أَنزَلَهُ إِلَيْكُمْ ۚ وَمَن يَتَّقِ اللَّهَ يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُعْظِمْ لَهُ أَجْرًا5

ఇది అల్లాహ్ ఆజ్ఞ, దానిని ఆయన మీపై అవతరింపజేశాడు. ఎవడు అల్లాహ్ కు భయ పడతాడో, అల్లాహ్ అతని పాపాలను అతని నుండి దూరం చేస్తాడు అతనికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు.

Syed Abul Aala Maudoodi

అల్-తలాక్

أَسْكِنُوهُنَّ مِنْ حَيْثُ سَكَنتُم مِّن وُجْدِكُمْ وَلَا تُضَارُّوهُنَّ لِتُضَيِّقُوا عَلَيْهِنَّ ۚ وَإِن كُنَّ أُولَاتِ حَمْلٍ فَأَنفِقُوا عَلَيْهِنَّ حَتَّىٰ يَضَعْنَ حَمْلَهُنَّ ۚ فَإِنْ أَرْضَعْنَ لَكُمْ فَآتُوهُنَّ أُجُورَهُنَّ ۖ وَأْتَمِرُوا بَيْنَكُم بِمَعْرُوفٍ ۖ وَإِن تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهُ أُخْرَىٰ6

వారిని (నిర్ణీత గడువు కాలంలో) మీరు నివసించే చోటనే ఉంచండి, మీకు ఎలాంటి చోటు లభించినా సరే. వారిని ఇబ్బందులపాలు చేయటానికి వేధించకండి.ఒకవేళ వారు గర్భవతులైతే, వారు ప్రసవించే వరకు వారి కోసం ఖర్చుచేస్తూ ఉండండి. తరువాత ఒకవేళ వారు మీకోసం (బిడ్డకు) పాలుపట్టే పక్షంలో, వారి ప్రతిఫలం వారికి ఇవ్వండి. ఉత్తమ రీతిలో (ప్రతిఫలం వ్యవహారాన్ని) పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ణయించుకోండి. కాని ఒకవేళ మీరు (ప్రతిఫల నిర్ణయంలో) ఒకరినొకరు ఇబ్బందుల పాల్జేసుకుంటే, బిడ్డకు మరొక స్త్రీ ఎవరైనా పాలుపట్టాలి.

Syed Abul Aala Maudoodi

అల్-తలాక్

لِيُنفِقْ ذُو سَعَةٍ مِّن سَعَتِهِ ۖ وَمَن قُدِرَ عَلَيْهِ رِزْقُهُ فَلْيُنفِقْ مِمَّا آتَاهُ اللَّهُ ۚ لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا مَا آتَاهَا ۚ سَيَجْعَلُ اللَّهُ بَعْدَ عُسْرٍ يُسْرًا7

సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమతను బట్టి ఖర్చుపెట్టాలి. తక్కువ ఉపాధి ఇవ్వబడిన వ్యక్తి, అల్లాహ్ తనకు ఇచ్చిన ధనం నుండే ఖర్చుపెట్టాలి. అల్లాహ్ ఎవరికి ఎంత ఇచ్చాడో, దానికి మించి ఆయన అతనిపై భారం వేయడు. అల్లాహ్, పేదరికం తరువాత సంపన్న స్థితిని ప్రసాదించకపోడు.

Syed Abul Aala Maudoodi

అల్-తలాక్

وَكَأَيِّن مِّن قَرْيَةٍ عَتَتْ عَنْ أَمْرِ رَبِّهَا وَرُسُلِهِ فَحَاسَبْنَاهَا حِسَابًا شَدِيدًا وَعَذَّبْنَاهَا عَذَابًا نُّكْرًا8

ఎన్నో పట్టణాలు తమ ప్రభువు ఆజ్ఞలను, ఆయన ప్రవక్తల ఆజ్ఞలను ధిక్కరించాయి. అప్పుడు మేము వాటి ప్రజల నుండి కఠినంగా లెక్కతీసుకుని, వారిని తీవ్రంగా శిక్షించాము.

Syed Abul Aala Maudoodi

అల్-తలాక్

فَذَاقَتْ وَبَالَ أَمْرِهَا وَكَانَ عَاقِبَةُ أَمْرِهَا خُسْرًا9

వారు తాము చేసిన కర్మలను రుచి చూశారు. వారి పర్యవసానం అంతా నష్టమే.

Syed Abul Aala Maudoodi

అల్-తలాక్

أَعَدَّ اللَّهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ فَاتَّقُوا اللَّهَ يَا أُولِي الْأَلْبَابِ الَّذِينَ آمَنُوا ۚ قَدْ أَنزَلَ اللَّهُ إِلَيْكُمْ ذِكْرًا10

అల్లాహ్ (పరలోకంలో) వారి కొరకు కఠిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. కనుక విశ్వాసులైన బుద్ధిమంతులారా! అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ మీ వద్దకు ఒక హితబోధను పంపాడు,

Syed Abul Aala Maudoodi