بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-ముల్క్

تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ1

ఎవరి చేతులలో విశ్వసామ్రాజ్యం ఉన్నదో, ఆయన ఎంతో శుభకరుడు, ఎంతో మహోన్నతుడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు.

Syed Abul Aala Maudoodi

అల్-ముల్క్

الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۚ وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ2

మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆయన చావు బ్రతుకులను సృష్టించాడు. ఆయన అత్యంత శక్తిసంపన్నుడు, అత్యధికంగా మన్నించేవాడూను.

Syed Abul Aala Maudoodi

అల్-ముల్క్

الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا ۖ مَّا تَرَىٰ فِي خَلْقِ الرَّحْمَـٰنِ مِن تَفَاوُتٍ ۖ فَارْجِعِ الْبَصَرَ هَلْ تَرَىٰ مِن فُطُورٍ3

ఆయన ఒక దానిపై నొకటి ఏడు ఆకాశాలను సృజించాడు. నీవు కరుణామయుని సృష్టిలో ఎలాంటి క్రమరాహిత్యాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు, అందులో నీకేమైనా లోపం కనిపిస్తున్నదా?

Syed Abul Aala Maudoodi

అల్-ముల్క్

ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ الْبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ4

మళ్లీ మళ్లీ చూడు, నీ చూపులు అలసిపోయి విఫలమై వెనుకకు తిరిగి వస్తాయి.

Syed Abul Aala Maudoodi

అల్-ముల్క్

وَلَقَدْ زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَجَعَلْنَاهَا رُجُومًا لِّلشَّيَاطِينِ ۖ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيرِ5

మేము మీకు దగ్గరగా ఉన్న ఆకాశాన్ని మహోజ్వలమైన దీపాలతో అలంకరిం చాము, వాటిని, షైతానులను తరిమికొట్టే సాధనాలుగా చేశాము. ఈ షైతానుల కొరకు మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.

Syed Abul Aala Maudoodi

అల్-ముల్క్

وَلِلَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ الْمَصِيرُ6

తమ ప్రభువును తిరస్కరించిన ప్రజలకు నరక శిక్ష పడుతుంది : అది చాలా చెడ్డ నివాస స్థలం.

Syed Abul Aala Maudoodi

అల్-ముల్క్

إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ7

వారిని అందులోకి విసిరివేసినప్పుడు, వారికి భయంకరమైన దాని గర్జన ధ్వని వినిపిస్తుంది.

Syed Abul Aala Maudoodi

అల్-ముల్క్

تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ ۖ كُلَّمَا أُلْقِيَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ8

అది అప్పుడు ఉద్రేకంతో ఉడికిపోతూ ఉంటుంది, తీవ్రమైన ఆగ్రహంతో బ్రద్దలవుతూ ఉంటుంది. ఏదైనా ఒక గుంపును అందులో వేసిన ప్రతిసారీ, దాని కాపలాదారులు, ‘‘మీ వద్దకు హెచ్చరించేవారు రాలేదా?’’ అని వారిని అడుగుతారు.

Syed Abul Aala Maudoodi

అల్-ముల్క్

قَالُوا بَلَىٰ قَدْ جَاءَنَا نَذِيرٌ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللَّهُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ كَبِيرٍ9

దానికి వారు ఇలా జవాబు ఇస్తారు, ‘‘వచ్చాడు, హెచ్చరిక చేసే అతను మా వద్దకు వచ్చాడు. కాని మేము అతనిని తిరస్కరించాము. అల్లాహ్ దేన్నీ అవతరింప జేయలేదు, నీవు మార్గభ్రష్టుడవైపోయావు అని మేము అతనితో అన్నాము.’’

Syed Abul Aala Maudoodi

అల్-ముల్క్

وَقَالُوا لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِي أَصْحَابِ السَّعِيرِ10

ఇంకా వారు ఇలా అంటారు, ‘‘అయ్యో! మేము గనక (ఆనాడు) విని ఉంటే, లేదా గ్రహించి ఉంటే, ఈనాడు ఇలా మండే నరకాగ్ని శిక్షకు గురిఅయిన వారిలో చేరి ఉండేవారము కాదుకదా!’’

Syed Abul Aala Maudoodi