بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-ఆరాఫ్

المص1

అలిఫ్‌ లామ్‌ మీమ్‌ సాద్‌.

Syed Abul Aala Maudoodi

అల్-ఆరాఫ్

كِتَابٌ أُنزِلَ إِلَيْكَ فَلَا يَكُن فِي صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنذِرَ بِهِ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ2

ఇది ఒక గ్రంథం, నీ వైపునకు అవతరింపచెయ్యబడిరది. కనుక ప్రవక్తా! దీనిని గురించి నీ మనస్సులో ఏ సంకోచమూ ఉండకూడదు. దీని అవతరణ ఉద్దేశ్యం - నీవు దీనిద్వారా (తిరస్కారులను) భయపెట్టాలనీ, ఇది విశ్వాసులకు హితోపదేశం కావాలనీ.

Syed Abul Aala Maudoodi

అల్-ఆరాఫ్

اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ3

ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపచెయ్యబడిన దానిని అనుసరించండి. మీ ప్రభువును త్రోసిరాజని ఇతర సంరక్షకులను అనుసరించకండి - కాని మీరు హితబోధను స్వీకరించటం అరుదు.

Syed Abul Aala Maudoodi

అల్-ఆరాఫ్

وَكَم مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا فَجَاءَهَا بَأْسُنَا بَيَاتًا أَوْ هُمْ قَائِلُونَ4

మేము నాశనం చేసిన నగరాలు ఎన్నో ఉన్నాయి. వాటిపై మా శిక్ష రాత్రి సమయంలో హఠాత్తుగా విరుచుకుపడిరది లేక పట్టపగలు వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వచ్చిపడిరది.

Syed Abul Aala Maudoodi

అల్-ఆరాఫ్

فَمَا كَانَ دَعْوَاهُمْ إِذْ جَاءَهُم بَأْسُنَا إِلَّا أَن قَالُوا إِنَّا كُنَّا ظَالِمِينَ5

వారిపై మా శిక్ష వచ్చిపడినప్పుడు, ‘‘మేము నిజంగానే దుర్మార్గులం’’ అనే రోదన తప్ప వారి నోటినుండి మరేమీ రాలేదు.

Syed Abul Aala Maudoodi

అల్-ఆరాఫ్

فَلَنَسْأَلَنَّ الَّذِينَ أُرْسِلَ إِلَيْهِمْ وَلَنَسْأَلَنَّ الْمُرْسَلِينَ6

కనుక ఇది తప్పకుండా జరుగవలసి ఉంది: మేము ఎవరి వద్దకు ప్రవక్తలను పంపామో, వారిని మేము లెక్క అడుగుతాము. ఇంకా ప్రవక్తలను కూడా అడుగుతాము (వారు సందేశాన్ని అందజేసే తమ విధిని ఎంతవరకు నిర్వహించారు అనీ, దానికి లభించిన సమాధానం ఏమిటీ అనీ).

Syed Abul Aala Maudoodi

అల్-ఆరాఫ్

فَلَنَقُصَّنَّ عَلَيْهِم بِعِلْمٍ ۖ وَمَا كُنَّا غَائِبِينَ7

తరువాత స్వయంగా మేమే జరిగిన మొత్తం గాధను పూర్తి జ్ఞానంతో వారి ముందు పెడతాము. అసలు మేము ఎక్కడా లేకుండా ఉండలేదుగదా!

Syed Abul Aala Maudoodi

అల్-ఆరాఫ్

وَالْوَزْنُ يَوْمَئِذٍ الْحَقُّ ۚ فَمَن ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ8

బరువు ఆ రోజున సత్యమే అవుతుంది. ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందేవారు.

Syed Abul Aala Maudoodi

అల్-ఆరాఫ్

وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَـٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُم بِمَا كَانُوا بِآيَاتِنَا يَظْلِمُونَ9

ఎవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో వారే తమను తాము నష్టానికి గురిచేసుకునేవారు. ఎందుకంటే, వారు ఆయతుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉండేవారు.

Syed Abul Aala Maudoodi

అల్-ఆరాఫ్

وَلَقَدْ مَكَّنَّاكُمْ فِي الْأَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ ۗ قَلِيلًا مَّا تَشْكُرُونَ10

మేము మిమ్మల్ని ధరణిపై అధికారాలతో వసింపజేశాము. ఇక్కడ మీకొరకు ఉపాధి వసతులను ఏర్పాటు చేశాము. కాని మీరు కృతజ్ఞులు కావటం అనేది అరుదు.

Syed Abul Aala Maudoodi