بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا1
ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి శ్రద్ధగా విని, ఆ తరువాత (తన జాతి ప్రజల వద్దకు పోయి) ఇలా అన్నట్లు నాకు వహీద్వారా తెలియజేయబడిరదని చెప్పు ‘‘మేము ఒక అద్భుతమైన ఖురాన్ విన్నాము,
Syed Abul Aala Maudoodi
يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا2
అది సన్మార్గం వైపునకు దారి చూపుతుంది, కనుక మేము దానిని విశ్వసిం చాము. ఇక ఎన్నడూ మేము మా ప్రభువునకు భాగస్వాములుగా మరెవ్వరినీ చేయము.’’
Syed Abul Aala Maudoodi
وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا3
ఇంకా ఇలా అన్నారు, ‘‘మా ప్రభువు వైభవం చాలా గొప్పది, ఘనమైనది. ఆయన ఎవరినీ భార్యగాగాని, కుమారునిగా గాని చేసుకోలేదు.’’
Syed Abul Aala Maudoodi
وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا4
ఇంకా ఇలా అన్నారు, ‘‘మనలోని అవివేకులు కొందరు అల్లాహ్ విషయంలో ఎన్నో సత్యవిరుద్ధమైన విషయాలు పలుకుతున్నారు.’’
Syed Abul Aala Maudoodi
وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا5
ఇంకా ఇలా అన్నారు, ‘‘మానవులు, జిన్నాతులు దేవుని గురించి ఎన్నడూ అబద్ధం పలుకరని మేము భావించాము.’’
Syed Abul Aala Maudoodi
وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا6
ఇంకా ఇలా అన్నారు, ‘‘మానవులలో కొందరు జిన్నాతులలోని కొందరిని శరణు వేడుతుండేవారు. ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు.’’
Syed Abul Aala Maudoodi
وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا7
ఇంకా ఇలా అన్నారు, ‘‘అల్లాహ్ ఎవరినీ సందేశహరుడుగా నియమించి పంపడని మీరు భావించినట్లుగానే, మానవులు కూడ భావించారు.’’
Syed Abul Aala Maudoodi
وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا8
ఇంకా ఇలా అన్నారు, ‘‘మేము ఆకాశంలో వెతికితే, అది పహరాదారులతో, ఉల్కాపాతంతో నిండిపోయి ఉన్నట్లు కనిపించింది.’’
Syed Abul Aala Maudoodi
وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَّصَدًا9
ఇంకా ఇలా అన్నారు, ‘‘మొదట్లో మేము దొంగతనంగా వినటానికి పోయి నప్పుడు, ఆకాశంలో మాకు కూర్చోవటానికి స్థలం దొరికేది. కాని ఇప్పుడు ఎవడైనా దొంగతనంగా వినే ప్రయత్నం చేస్తే, అతడి కొరకు ఒక అగ్ని జ్వాల మాటుకాసి ఉంటుంది.’’
Syed Abul Aala Maudoodi
وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَن فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا10
ఇంకా ఇలా అన్నారు, ‘‘భూలోక వాసులకేదైనా కీడు చెయ్యాలనే నిర్ణయం జరిగిందా లేక వారి ప్రభువు వారికి సన్మార్గం చూపగోరు తున్నాడా అనే విషయం మాకు అర్థమయ్యేది కాదు.’’
Syed Abul Aala Maudoodi