بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
అల్-ముజమ్మిల్
يَا أَيُّهَا الْمُزَّمِّلُ1
ఓ దుప్పటి కప్పుకుని పడుకునేవాడా!
Syed Abul Aala Maudoodi
అల్-ముజమ్మిల్
قُمِ اللَّيْلَ إِلَّا قَلِيلًا2
రాత్రివేళ నమాజులో నిలబడుతూ ఉండు, కాని కొంచెం సేపు మాత్రమే
Syed Abul Aala Maudoodi
అల్-ముజమ్మిల్
نِّصْفَهُ أَوِ انقُصْ مِنْهُ قَلِيلًا3
రాత్రిలో సగభాగం లేదా దానిని కొంచెం తగ్గించుకో
Syed Abul Aala Maudoodi
అల్-ముజమ్మిల్
أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا4
లేదా దానిని కొంచెం పొడిగించుకో. ఖుర్‌ఆన్‌ను నెమ్మదిగా ఆగి ఆగి పఠించు.
Syed Abul Aala Maudoodi
అల్-ముజమ్మిల్
إِنَّا سَنُلْقِي عَلَيْكَ قَوْلًا ثَقِيلًا5
మేము నీపై ఒక గంభీరమైన వాణిని అవతరింప జేయబోతున్నాము.
Syed Abul Aala Maudoodi
అల్-ముజమ్మిల్
إِنَّ نَاشِئَةَ اللَّيْلِ هِيَ أَشَدُّ وَطْئًا وَأَقْوَمُ قِيلًا6
వాస్తవానికి రాత్రివేళ లేవటం మనస్సును అదుపులో ఉంచేందుకు ఎంతో ఉపయుక్తమైనది ఖుర్‌ఆన్‌ను శ్రద్ధగా పఠించేందుకు ఎంతో అనువైనది:
Syed Abul Aala Maudoodi
అల్-ముజమ్మిల్
إِنَّ لَكَ فِي النَّهَارِ سَبْحًا طَوِيلًا7
ఎందుకంటే, పగటి వేళ నీకు చాలా పనులుంటాయి.
Syed Abul Aala Maudoodi
అల్-ముజమ్మిల్
وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلًا8
నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు అన్నిటినీ వదలి పూర్తిగా ఆయనకే అంకితమైపో.
Syed Abul Aala Maudoodi
అల్-ముజమ్మిల్
رَّبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَا إِلَـٰهَ إِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِيلًا9
ఆయన తూర్పు పడమరలకు స్వామి, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. కనుక నీవు ఆయననే వకీలుగా చేసుకో.
Syed Abul Aala Maudoodi
అల్-ముజమ్మిల్
وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا10
లోకులు కల్పించే మాటల పట్ల సహనం వహించి, మంచితనంతో వారి నుండి వైదొలగిపో.
Syed Abul Aala Maudoodi