بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
هَلْ أَتَىٰ عَلَى الْإِنسَانِ حِينٌ مِّنَ الدَّهْرِ لَمْ يَكُن شَيْئًا مَّذْكُورًا1
అనంతమైన కాలంలో మానవుడు చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉండిన సమయం ఏదైనా అతనిపై గడిచిందా?
Syed Abul Aala Maudoodi
إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا2
మేము మానవుణ్ణి పరీక్షించ టానికి అతనిని ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. ఈ లక్ష్యం కోసం మేము అతనిని వినేవాడుగా, చూసేవాడుగా చేశాము.
Syed Abul Aala Maudoodi
إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا3
మేము అతనికి మార్గం చూపాము ఇక అతను కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు లేదా సత్యాన్ని తిరస్కరించే వాడైనా కావచ్చు.
Syed Abul Aala Maudoodi
إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا4
సత్యతిరస్కారుల కొరకు మేము సంకెళ్లను, కంఠపాశాలను, మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము.
Syed Abul Aala Maudoodi
إِنَّ الْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا5
సజ్జనులు (స్వర్గంలో) కర్పూర జలం కలిపిన మధుపాత్రలను సేవిస్తారు
Syed Abul Aala Maudoodi
عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ اللَّهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا6
ఇది ప్రవహించే ఒక సెలయేరు దైవదాసులు దాని నీటితోపాటు మద్యం సేవిస్తారు. వారు తాము కోరిన చోటికి దాని పాయలను సులభంగా తీసుకుపోతారు.
Syed Abul Aala Maudoodi
يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا7
వారు ఎలాంటి వారంటే, (ప్రపం చంలో) మొక్కుబడి చెల్లించేవారు, నలువైపుల నుండి ఆపదలు కమ్ముకొనివచ్చే దినానికి భయపడేవారు
Syed Abul Aala Maudoodi
وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا8
మరియు అల్లాహ్ మీది ప్రేమతో పేదలకూ, అనాధు లకూ, ఖైదీలకూ అన్నం పెట్టేవారు.
Syed Abul Aala Maudoodi
إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا9
వారు వారితో ఇలా అంటారు), ‘‘మేము కేవలం అల్లాహ్ కోసమే మీకు అన్నం పెడుతున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతలను గానీ ఆశించటం లేదు.
Syed Abul Aala Maudoodi
إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا10
దుర్భరమైన ఆపదలతో కూడుకున్న సుదీర్ఘమైన రోజున మా ప్రభువు విధించే శిక్ష గురించి మేము భయపడుతున్నాము.’’
Syed Abul Aala Maudoodi