بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-అన్‌ఫాల్

يَسْأَلُونَكَ عَنِ الْأَنفَالِ ۖ قُلِ الْأَنفَالُ لِلَّهِ وَالرَّسُولِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَصْلِحُوا ذَاتَ بَيْنِكُمْ ۖ وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ إِن كُنتُم مُّؤْمِنِينَ1

వారు నిన్ను ‘‘అన్‌ఫాల్‌’’ను గురించి అడుగుతున్నారు. ఇలా అను : ‘‘ఈ అన్‌ఫాల్‌ అల్లాహ్కూ ఆయన ప్రవక్తకూ చెందుతాయి. కనుక మీరు అల్లాహ్ కు భయపడండి. మీ పరస్పర సంబంధాలను సంస్కరించుకోండి. అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి, మీరు గనక విశ్వాసులే అయితే.’’

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ2

’’ నిజమైన విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావన విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి సమక్షంలో అల్లాహ్ ఆయతులు పారాయణం చెయ్యబడినప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారు తమ ప్రభువు పట్ల నమ్మకం కలిగివుంటారు.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ3

వారు నమాజును స్థాపిస్తారు. వారికి మేమిచ్చిన దానినుండి (మా మార్గంలో) ఖర్చుపెడతారు.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

أُولَـٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَّهُمْ دَرَجَاتٌ عِندَ رَبِّهِمْ وَمَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ4

అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారికొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది. శ్రేష్ఠమైన ఆహారం ఉంది.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

كَمَا أَخْرَجَكَ رَبُّكَ مِن بَيْتِكَ بِالْحَقِّ وَإِنَّ فَرِيقًا مِّنَ الْمُؤْمِنِينَ لَكَارِهُونَ5

(ఈ అన్‌ఫాల్‌ వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఇప్పుడూ ఉత్పన్నమౌతోంది. అప్పుడు) నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుండి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

يُجَادِلُونَكَ فِي الْحَقِّ بَعْدَ مَا تَبَيَّنَ كَأَنَّمَا يُسَاقُونَ إِلَى الْمَوْتِ وَهُمْ يَنظُرُونَ6

వారు ఈ సత్యం విషయంలో నీతో ఘర్షణపడ్డారు, అది వాస్తవానికి సత్యమని పూర్తిగా రుజువైపోయింది. వారి పరిస్థితి తమ కళ్లముందే తాము మృత్యువు వైపునకు తరుమబడే వారి మాదిరిగా ఉంది.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

وَإِذْ يَعِدُكُمُ اللَّهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّهَا لَكُمْ وَتَوَدُّونَ أَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَيُرِيدُ اللَّهُ أَن يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ7

రెండు వర్గాలలో ఒక వర్గం మీకు దొరికిపోతుందని అల్లాహ్ వాగ్దానం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు బలహీనవర్గం దొరకాలని మీరు కోరుకున్నారు. కాని తన మాటల ద్వారా సత్యం యొక్క సత్యతను నిరూపించాలనేది, అవిశ్వాసులను సమూలంగా నాశనం చెయ్యాలనేది అల్లాహ్ సంకల్పం.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ8

ఎందుకంటే, సత్యం సత్యంగా రూఢ కావాలని, అసత్యం అసత్యంగా రుజువు కావాలని, ఇది అపరాధులకు ఎంత అనిష్టమైనా సరే.

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ أَنِّي مُمِدُّكُم بِأَلْفٍ مِّنَ الْمَلَائِكَةِ مُرْدِفِينَ9

ఇంకా మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. సమాధానంగా అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చాడు : ‘‘నేను మీ సహాయం కొరకు వెయ్యిమంది దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని ఎడతెగకుండా పంపుతున్నాను.’’

Syed Abul Aala Maudoodi

అల్-అన్‌ఫాల్

وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ وَلِتَطْمَئِنَّ بِهِ قُلُوبُكُمْ ۚ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّهِ ۚ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ10

మీకు శుభవార్తగానూ మీ మనస్సులు దీనివల్ల నిశ్చింతగా ఉండే నిమిత్తమూ అల్లాహ్ ఈ విషయాన్ని మీకు తెలిపాడు. సహాయమనేది ఎప్పుడు లభించినా అల్లాహ్ తరఫు నుండే లభిస్తుంది. నిశ్చయంగా అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు, అత్యంత వివేకవంతుడూను.

Syed Abul Aala Maudoodi