بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-ముతఫ్ఫిఫీన్

وَيْلٌ لِّلْمُطَفِّفِينَ1

తూనికలలో, కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశం ఉన్నది.

Syed Abul Aala Maudoodi

అల్-ముతఫ్ఫిఫీన్

الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ2

వారు ప్రజల నుండి తీసుకునే టప్పుడు పూర్తిగా తీసుకుంటారు

Syed Abul Aala Maudoodi

అల్-ముతఫ్ఫిఫీన్

وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ3

వారికి కొలిచిగాని తూచిగాని ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు.

Syed Abul Aala Maudoodi

అల్-ముతఫ్ఫిఫీన్

أَلَا يَظُنُّ أُولَـٰئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ4

ఒక మహాదినంనాడు వారు బ్రతికించి తీసుకురాబడనున్నారని వారికి తెలియదా?

Syed Abul Aala Maudoodi

అల్-ముతఫ్ఫిఫీన్

لِيَوْمٍ عَظِيمٍ5

ఒక గొప్ప దినమున!

Syed Abul Aala Maudoodi

అల్-ముతఫ్ఫిఫీన్

يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ6

ఆ రోజున ప్రజలందరూ సకల లోకాల ప్రభువు సమక్షంలో నిలబడతారు.

Syed Abul Aala Maudoodi

అల్-ముతఫ్ఫిఫీన్

كَلَّا إِنَّ كِتَابَ الْفُجَّارِ لَفِي سِجِّينٍ7

ఎంతమాత్రం కాదు, నిశ్చయంగా దుర్జనుల కర్మల పత్రం చెరసాల గ్రంథంలో ఉంటుంది.

Syed Abul Aala Maudoodi

అల్-ముతఫ్ఫిఫీన్

وَمَا أَدْرَاكَ مَا سِجِّينٌ8

చెరసాల గ్రంథం అంటే ఏమిటో నీకు తెలుసా?

Syed Abul Aala Maudoodi

అల్-ముతఫ్ఫిఫీన్

كِتَابٌ مَّرْقُومٌ9

అదొక వ్రాయబడిన గ్రంథం.

Syed Abul Aala Maudoodi

అల్-ముతఫ్ఫిఫీన్

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ10

తీర్పుదినాన్ని తిరస్కరించే తిరస్కారులకు ఆ రోజున వినాశం ఉన్నది.

Syed Abul Aala Maudoodi