بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة الغاشية

هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ1

ముంచుకు వచ్చే ముప్పు (అంటే ప్రళయం)ను గురించిన సమాచారం నీకేమైనా అందిందా?

Syed Abul Aala Maudoodi

سورة الغاشية

وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ2

కొందరి ముఖాలలో ఆ రోజున భయాందోళనలు కనిపిస్తాయి,

Syed Abul Aala Maudoodi

سورة الغاشية

عَامِلَةٌ نَّاصِبَةٌ3

ఎక్కువ శ్రమపడుతూ, అలసిపోతారు,

Syed Abul Aala Maudoodi

سورة الغاشية

تَصْلَىٰ نَارًا حَامِيَةً4

తీవ్రమైన అగ్నిలో చిక్కుకుపోయి ఉంటారు.

Syed Abul Aala Maudoodi

سورة الغاشية

تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ5

త్రాగేందుకు వారికి సలసల కాగే చెలమ నీరు ఇవ్వబడుతుంది.

Syed Abul Aala Maudoodi

سورة الغاشية

لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ6

వారి కొరకు ఎండిన ముళ్ల గడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు,

Syed Abul Aala Maudoodi

سورة الغاشية

لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ7

అది బలమూ నీయదు, ఆకలినీ తీర్చదు.

Syed Abul Aala Maudoodi

سورة الغاشية

وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ8

ఆ రోజున కొందరి ముఖాలు కళ కళలాడుతూ ఉంటాయి,

Syed Abul Aala Maudoodi

سورة الغاشية

لِّسَعْيِهَا رَاضِيَةٌ9

తాము చేసుకున్న సత్కార్యాలకు వారు సంతోషపడతారు,

Syed Abul Aala Maudoodi

سورة الغاشية

فِي جَنَّةٍ عَالِيَةٍ10

అత్యున్నతమైన స్వర్గంలో ఉంటారు.

Syed Abul Aala Maudoodi